E-Scooter: త్వరపడండి.! రూ. 50 వేల కంటే తక్కువ ధరకే ఈ-స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 140 కిమీ నాన్‌స్టాప్..

|

Apr 04, 2023 | 4:52 PM

ఫుజియామా(Fujiyama) అనే EV స్టార్టప్ కంపెనీ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిలో నాలుగు లో-స్పీడ్‌తో..

E-Scooter: త్వరపడండి.! రూ. 50 వేల కంటే తక్కువ ధరకే ఈ-స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 140 కిమీ నాన్‌స్టాప్..
Fujiyama Ev
Follow us on

ఫుజియామా(Fujiyama) అనే EV స్టార్టప్ కంపెనీ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిలో నాలుగు లో-స్పీడ్‌తో, ఒకటి హై-స్పీడ్‌తో లభిస్తాయి. లో-స్పీడ్ మోడళ్లలో స్పెక్ట్రా, స్పెక్ట్రా ప్రో, వెస్పార్, థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. అటు హై-స్పీడ్ మోడల్‌కు ఓజోన్+ అని పేరు పెట్టారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను ఒక్కసారి ఛార్జ్ చేస్తే.. 140 కి.మీల వరకు వెళ్తాయి.

  • ఫుజియామా స్పెక్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 250W BLDC మోటార్‌, 1.56kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ అమర్చబడి ఉన్నాయి. కంపెనీ ప్రకారం, ఇది పూర్తిగా ఛార్జ్ చేస్తే 90 కిలోమీటర్ల పరిధిని ఇస్తుంది.

  • స్పెక్ట్రా ప్రో 250W మోటార్‌, 1.34kWh బ్యాటరీ ప్యాక్‌తో లభిస్తోంది. ఇది కూడా స్పెక్ట్రా ఎలక్ట్రిక్ స్కూటర్ మాదిరిగానే 90 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది.

  • వెస్పార్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో రెట్రో-స్టైల్ డిజైన్ ఉంది. దీని బ్యాటరీ ప్యాక్, రేంజ్ స్పెక్ట్రా మోడల్‌ను పోలి ఉంటాయి.

  • థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ సెటప్, రేంజ్ కూడా స్పెక్ట్రా మోడల్ మాదిరిగానే ఉంటాయి.

డ్రైవింగ్ లైసెన్స్ అక్కర్లేదు..

ఈ నాలుగు లో-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల బ్యాటరీ ప్యాక్‌లు పూర్తిగా డిటాచబుల్. కంపెనీ ప్రకారం, వాటిని 4 నుంచి 5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. ఈ అన్ని ఈ-స్కూటర్లలో LCD డిస్‌ప్లే, LED లైటింగ్ సెటప్ ఉన్నాయి. అలాగే ఇవి లో-స్పీడ్ స్కూటర్లు కాగా.. వీటిని నడపడానికి రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.

ఓజోన్+ ఎలక్ట్రిక్ స్కూటర్..

ఫుజియామా నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ కొత్త హై-స్పీడ్ ఈ-స్కూటర్ ఓజోన్+ స్టైలింగ్ పరంగా వెస్పర్‌ లుక్ ఉంటుంది. పవర్, రేంజ్ పరంగా ఇది చాలా మెరుగ్గా ఉంటుంది. ఇందులో 1.6kW మోటార్‌, 60V/42AH లిథియం అయాన్ బ్యాటరీ అమర్చబడి ఉన్నాయి. ఈ సెటప్ 3.7kW శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ముందు, వెనుక భాగాలలో డిస్క్ బ్రేక్‌లు అమర్చబడ్డాయి. ఫీచర్ల విషయానికొస్తే, ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌సిడి డిస్‌ప్లే, ఎల్‌ఇడి లైట్స్ వంటివి ఉన్నాయి.

కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు..

Fujiyama ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు రూ. 49,499 నుంచి మొదలై రూ. 99,999 వరకు ఉంటాయి.