FSSAI Big Announcement: ఇక నుంచి వాటిని హెర్బల్ టీ అనొద్దు.. FSSAI కీలక ఆదేశాలు

FSSAI Big Announcement: ప్రస్తుతం మార్కెట్‌లో చాలా కంపెనీలు చామంతి (Chamomile), రోజ్మెరీ, తులసి, పుదీనా, ఎండిన పండ్లు లేదా పువ్వులతో చేసిన ఇన్ఫ్యూషన్లను ‘హెర్బల్ టీ’ లేదా ‘ఫ్రూట్ టీ’ అనే పేరుతో అమ్ముతున్నారు. వాస్తవానికి వీటిలో అసలైన టీ..

FSSAI Big Announcement: ఇక నుంచి వాటిని హెర్బల్ టీ అనొద్దు.. FSSAI కీలక ఆదేశాలు
Fssai Big Announcement

Updated on: Dec 25, 2025 | 9:43 PM

FSSAI Big Announcement: భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) హెర్బల్, ఫ్లవర్ టీలపై ఒక పెద్ద ప్రకటన చేసింది, “టీ” అనే పదాన్ని నిజమైన టీ మొక్క నుండి రాని ఏ ఉత్పత్తికైనా ఉపయోగించవద్దని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్‌ను హెచ్చరించింది. రూయిబోస్ టీ, ఫ్లవర్ టీ, హెర్బల్ టీ వంటివి నిజమైన టీ కావు, వాటిని అలా లేబుల్ చేయడం వినియోగదారులను తప్పుదారి పట్టించినట్లు అవుతుందని, ఇది FSSAI చట్టం కింద మిస్‌బ్రాండింగ్ కిందకు వస్తుందని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. FSSAI ప్రకారం కామెల్లియా సినెన్సిస్‌ మొక్క ఆకుల నుండి తయారు చేసిన పానీయాలను మాత్రమే “టీ” అని పిలవాలి అని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) స్పష్టం చేసింది.

సరైన, అసలు పేరు ముద్రణ తప్పనిసరి: FSSAI

నిబంధనలను ఉల్లంఘించినందుకు కఠిన చర్యలు తీసుకుంటామని FSSAI తెలిపింది. రెండవది ఈ ఆదేశం అన్ని తయారీదారులు, విక్రేతలకు తప్పనిసరి. ఏదైనా ఆహార ప్యాకేజీ సరైన, నిజమైన పేరును ప్యాకేజీ ముందు భాగంలో ముద్రించడం తప్పనిసరి అని ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ స్పష్టంగా పేర్కొంది. FSSAI ప్రకారం.. కామెల్లియా సినెన్సిస్ మొక్క నుండి తయారు చేసినప్పుడు మాత్రమే టీని ‘చాయ్‌’ అని పిలుస్తారు. హెర్బల్ టీ, రూయిబోస్ టీ, ఫ్లవర్ టీ వంటి ఉత్పత్తులను టీ అని పిలవడం తప్పని పేర్కొంది. నిబంధనల ప్రకారం, కాంగ్రా టీ, గ్రీన్ టీ, ఇన్‌స్టంట్ టీ కూడా కామెల్లియా సినెన్సిస్ నుండి తయారు చేయాలన్నారు.

ఇది కూడా చదవండి: PM Kisan: కీలక అప్‌డేట్‌.. పీఎం కిసాన్‌ 22వ విడత ఎప్పుడో తెలుసా?

ఇవి కూడా చదవండి

ఆహార వస్తువు సరైన పేరు ప్యాకేజీ ముందు భాగంలో ప్రదర్శించబడాలి. కామెల్లియా సినెన్సిస్‌తో తయారు చేయని ఉత్పత్తులపై ‘టీ’ లేదా ‘చాయ్‌’ అని రాయడం తప్పుడు బ్రాండింగ్‌గా పరిగణిస్తున్నారు. అటువంటి మూలికా లేదా ఇతర మొక్కల నుండి తయారు చేసిన ఆహారం లేదా నిర్దిష్టం కాని ఆహారం ‘నియమాలు, 2017’ కిందకు వస్తాయని తెలిపింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ‘కఠిన చర్యలు’

కామెల్లియా సినెన్సిస్‌తో తయారు చేయని ఉత్పత్తులపై ‘టీ’ అనే పదాన్ని ఉపయోగించవద్దని అన్ని తయారీదారులు, విక్రేతలు, దిగుమతిదారులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. నిబంధనలను ఉల్లంఘిస్తే ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. రాష్ట్ర ఆహార భద్రతా అధికారులు ఈ ఆదేశాన్ని ఖచ్చితంగా పాటించడాన్ని పర్యవేక్షిస్తారు. రాబోయే రోజుల్లో నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవలసి ఉంటుందని FSSAI తన నిర్ణయంలో తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Electric Splendor Bike: పాత స్ప్లెండర్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చుకోండి.. కిట్‌ కేవలం రూ.35,000కే.. రేంజ్‌ ఎంతో తెలుసా?

సమస్య ఏంటి ?

ప్రస్తుతం మార్కెట్‌లో చాలా కంపెనీలు చామంతి (Chamomile), రోజ్మెరీ, తులసి, పుదీనా, ఎండిన పండ్లు లేదా పువ్వులతో చేసిన ఇన్ఫ్యూషన్లను ‘హెర్బల్ టీ’ లేదా ‘ఫ్రూట్ టీ’ అనే పేరుతో అమ్ముతున్నారు. వాస్తవానికి వీటిలో అసలైన టీ ఆకులు ఉండవు. ఇలాంటి టీ ఆకులు లేని ఉత్పత్తులకు ‘టీ’ అనే పేరును వాడటం వల్ల కస్టమర్లు అవి నిజంగానే టీలోని వివి రకాలని భావించి కొంటున్నారు. ఇది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం కస్టమర్లను తప్పుదోవ పట్టించడమే అని FSSAI పేర్కొంది.

ఇది కూడా చదవండి: Railway Rule: TTEలతో పాటు రైల్వే పోలీసులు రైలు టిక్కెట్లను తనిఖీ చేయవచ్చా? నియమాలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి