AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..? ఇవి పక్కా తెలుసుకోండి..

Front Load vs Top Load: ఇంట్లోకి కొత్తగా వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా? అయితే షాపుకెళ్లగానే వచ్చే మొదటి కన్ఫ్యూజన్.. ఫ్రంట్ లోడ్ కొనాలా? టాప్ లోడ్ కొనాలా?. డిజైన్ చూసి ఫ్రంట్ లోడ్ కొంటే బడ్జెట్ తలకిందులవుతుంది, ఆఫర్ చూసి టాప్ లోడ్ కొంటే నీళ్లు, కరెంట్ బిల్లులు షాక్ ఇస్తాయి.. మరి మీ ఇంటికి, మీ బడ్జెట్‌కు ఏ మెషీన్ పక్కాగా సెట్ అవుతుందో.. ఇప్పుడు తెలుసుకుందాం..

ఫ్రంట్ లోడ్ Vs టాప్ లోడ్.. మీ ఇంటికి ఏ వాషింగ్ మెషీన్ బెస్ట్..? ఇవి పక్కా తెలుసుకోండి..
Front Load Vs Top Load Washing Machine
Krishna S
|

Updated on: May 16, 2026 | 9:00 AM

Share

ఈ రోజుల్లో ప్రతి ఇంట్లోనూ వాషింగ్ మెషీన్ ఒక అత్యవసర వస్తువుగా మారిపోయింది. అయితే కొత్తగా వాషింగ్ మెషీన్ కొనాలని షాపుకో లేదా ఆన్‌లైన్ సైట్లకో వెళ్లినప్పుడు ప్రతి ఒక్కరినీ వేధించే ఏకైక ప్రశ్న.. ఫ్రంట్ లోడ్ మెషీన్ కొనాలా? లేక టాప్ లోడ్ మెషీన్ కొనాలా?. రెండు చూడటానికి అద్భుతంగానే కనిపిస్తాయి, కంపెనీలు కూడా తమ మోడళ్లే బెస్ట్ అని కలరింగ్ ఇస్తాయి. కానీ కేవలం డిజైన్ లేదా ఆఫర్ల ధర చూసి కొంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ రెండింటి మధ్య కేవలం బట్టలు వేసే విధానంలోనే కాదు.. క్లీనింగ్, నీరు, కరెంట్ వినియోగంలోనూ చాలా తేడాలు ఉన్నాయి. వాషింగ్ మెషీన్ కొనేటప్పుడు మన అవసరాలు, బడ్జెట్. ఇంటి రకాన్ని బట్టి సరైన దాన్ని ఎంచుకోవాలి.

ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్

ఈ మెషీన్లలో బట్టలను ముందు వైపు ఉన్న డోర్ ద్వారా లోడ్ చేస్తారు. ఇవి బట్టలను ఉతకడానికి డ్రమ్‌ను గుండ్రంగా తిప్పుతాయి. దీనివల్ల బట్టలు చాలా లోతుగా, నీట్‌గా క్లీన్ అవుతాయి. ఇందులో నీరు, డిటర్జెంట్ చాలా తక్కువగా ఖర్చవుతాయి. అలాగే ఖరీదైన, సున్నితమైన దుస్తులు పాడవకుండా ఇవి బాగా కేర్ తీసుకుంటాయి. అయితే ఇవి టాప్ లోడ్ మెషీన్ల కంటే ధర చాలా ఎక్కువ. అంతేకాకుండా బట్టలు వేయాలన్నా, తీయాలన్నా కిందకు వంగవలసి ఉంటుంది. నడుము నొప్పి ఉన్నవారికి లేదా ఇంట్లోని వృద్ధులకు ఇది కొంత కష్టంగా అనిపించవచ్చు.

టాప్ లోడ్ వాషింగ్ మెషీన్

భారతదేశంలో మెజారిటీ ఇళ్లలో ఈ రకమైన మెషీన్లనే ఎక్కువగా ఇష్టపడతారు. ఇందులో బట్టలను పైనుంచి లోడ్ చేస్తారు. వీటి ధర అందరికీ అందుబాటులో ఉంటుంది. నిలబడే బట్టలు వేయవచ్చు, తీయవచ్చు కాబట్టి వాడకం చాలా ఈజీ. వీటి వాష్ సైకిల్స్ చాలా త్వరగా పూర్తవుతాయి, తద్వారా సమయం ఆదా అవుతుంది. ఉతికే మధ్యలో కూడా అదనపు బట్టలను యాడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇవి ఫ్రంట్ లోడ్ అంత పవర్‌ఫుల్‌గా బట్టలను క్లీన్ చేయలేవు. అంతేకాకుండా వీటికి నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉంటుంది.

నీరు, కరెంట్ ఆదా చేయడంలో ఏది తోపు?

పొదుపు విషయానికి వస్తే ఖచ్చితంగా ఫ్రంట్ లోడ్ మెషీన్లదే పైచేయి. ఇవి తక్కువ నీటితోనే బట్టలను అద్భుతంగా క్లీన్ చేయగలవు. డిటర్జెంట్ కూడా తక్కువ పడుతుంది. అయితే రోజుకు నాలుగైదు సార్లు బట్టలు ఉతకాల్సి వచ్చే పెద్ద కుటుంబాలు ఉన్నచోట, వేగంగా పనవ్వడం కోసం టాప్ లోడ్ మెషీన్లు ఎక్కువ ప్రాక్టికల్‌గా ఉపయోగపడతాయి.

ఏది కొనాలి?

మీకు బెస్ట్ క్లీనింగ్ కావాలి, నీటి కొరత ఉంది, బట్టలు ఎక్కువ కాలం మన్నికగా ఉండాలి అనుకుంటే.. బడ్జెట్ కొంచెం ఎక్కువైనా ఫ్రంట్ లోడ్ మెషీన్ బెస్ట్ ఛాయిస్. మీ బడ్జెట్ లిమిటెడ్‌గా ఉండి, వంగే పని లేకుండా ఈజీగా, ఫాస్ట్‌గా వాషింగ్ అయిపోవాలి అనుకుంటే.. టాప్-లోడ్ మెషీన్ పక్కాగా సెట్ అవుతుంది. కేవలం బ్రాండ్, ఆఫర్లు చూసి కాకుండా.. మీ ఇంట్లో ఉండే నీటి సదుపాయం, మీ ఫ్యామిలీ సైజును బట్టి వాషింగ్ మెషీన్ కెపాసిటీని ఎంచుకోవడం ఎల్లప్పుడూ ఉత్తమం.

Follow Us
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
అపూర్వమైన ప్రకృతి దృశ్యాలు.. ఊటీని మైమరిపించే పులిగుండాల
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
ఒక సామాన్యుడి వేల కోట్ల సామ్రాజ్యం వెనుకున్న రహస్యం ఏమిటి?
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
కార్లు, బైకుల బీమా ప్రీమియంపై కేంద్రం కసరత్తు
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఇన్సూరెన్స్ లేని బండ్లకు బంకుల్లో నో పెట్రోల్
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
ఓటు వేసినప్పుడే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు వస్తుంది
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
పోటాపోటీగా సాగర్ నీళ్లు విడుదల చేసిన ఏపీ, తెలంగాణ అధికారులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
కల్లాల్లోనే ధాన్యం రాశులు.. కన్నీరు పెడుతున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
వరుస చోరీలతో విసిగి.. మాటు వేసి.. దొంగలను పట్టుకున్న రైతులు
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
మాకేమైనా బిచ్చం వేస్తున్నారా? ఎస్పీపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే
కరెంటు కనెక్షన్ కట్ చేస్తామని కాల్ వస్తే.. చెక్ చేయాల్సిందే