పొదుపు పథకం.. ఈ మధ్యకాలంలో యువత నుంచి ఉద్యోగుల వరకు ప్రతీ ఒక్కరిది ఇదే మంత్రం. చాలీచాలనంత జీతం, నిత్యం పెరుగుతోన్న ఖర్చులతో వచ్చే శాలరీలో ప్రతీ రోజూ భవిష్యత్తు కోసం కొంత దాచుకోవడం బెటర్ ఆప్షన్ అనేది అందరి ఆలోచన. అందుకే మిమ్మల్ని మిలినీయర్‌గా మార్చే ఓ మ్యూచువల్ ఫండ్ గురించి చెప్పబోతున్నాం, అదే ఐసీఐసీఐ ప్రిడెన్షియల్‌కు చెందిన వాల్యూ డిస్కవరీ ఫండ్ 20 ఏళ్ల క్రితం ఇందులో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టినట్లయితే.. అది ఇప్పుడు రూ.4.50 కోట్లుగా మారింది. ఈ ఫండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్(CAGR) 21 శాతం కంటే ఎక్కువ అని చెప్పొచ్చు. అదే సమయంలో నిఫ్టీలో రూ. 10 లక్షల పెట్టుబడికి రూ. 2 కోట్లు మాత్రమే వస్తుంది. అంటే ఈ ఫండ్ నిఫ్టీ కంటే రెట్టింపు లాభాన్ని ఇస్తుంది. నిఫ్టీ కాంపౌండ్ ఇంట్రెస్ట్(CAGR) 16 శాతంగా ఉంది.
ఐసీఐసీఐ ప్రిడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ దేశంలోనే అతిపెద్ద వాల్యూ ఫండ్. దీని అసెట్ వాల్యూ(AUM) వచ్చేసి రూ. 48,806 కోట్లుగా ఉంది. అంటే మ్యూచువల్ ఫండ్స్ వాల్యూ కేటగిరీలో, ఇది ఒక్కటి మాత్రమే మొత్తం AUMలో దాదాపు 26 శాతం వాల్యూ కలిగి ఉంది. డేటా ప్రకారం, ఒక సంవత్సరంలో, ICICI ప్రిడెన్షియల్ ఫండ్ రూ. 10,000ను రూ.14,312గా మార్చింది. అంటే దాదాపు 43 శాతం రిటర్న్ ఇచ్చింది. మూడేళ్లలో దాని రిటర్న్ CAGR 27.28 శాతం ప్రకారం రూ.10 వేల పెట్టుబడిని రూ.20,645గా మార్చింది. ఇది డబుల్ రిటర్న్స్ లెక్క. ఈ మొత్తం ఐదేళ్లలో రూ.32 వేలకు పైగా మారుస్తుంది. ఐదేళ్లకు CAGR 26 శాతంగా ఉంది.
ఈ ఫండ్‌లో SIP పెట్టుబడిని పరిశీలిస్తే, అద్భుతమైన లాభాలు అందిస్తుంది. ఫండ్ ప్రారంభం(అనగా 20 ఏళ్ల క్రితం) నుంచి నెలవారీ రూ.10,000 పెట్టుబడి.. జూలై 31 వరకు SIP ద్వారా పెడితే రూ.2.30 కోట్లకు చేరుతుంది. అసలు పెట్టుబడి రూ.24 లక్షలు.. 19.41 శాతం CAGRతో అది కాస్తా డబుల్ ప్రాఫిట్స్‌గా మారుతుంది. గత రెండు దశాబ్దాలుగా, ICICI ప్రిడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ పనితీరు అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మే 2006 నుంచి ఫిబ్రవరి 2009 మధ్య.. మళ్లీ 2016 నుంచి 2018 వరకు ఈ ఫండ్ కొంచెం డల్ అయినప్పటికీ.. దీర్ఘకాలికంగా పెట్టుబడిదారులకు లాభాలు పంట పండించింది.
ఇది చదవండి: హ్యాండ్ బ్రేక్‌ను హ్యాండిల్ చేయడం ఎలా.? ఈ తప్పు చేస్తే యముడికి షేక్‌హ్యాండ్ ఇచ్చినట్టే
కాగా, ఇటీవల ఈ ఫండ్‌కు 20 సంవత్సరాలు పూర్తవ్వడంతో.. ICICI ప్రిడెన్షియల్ AMC ఎండీ అండ్ సీఈఓ నిమేష్ షా మాట్లాడుతూ.. పూర్తి ప్రయోజనాల పొందేందుకు సమయం పడుతుందని.. దానికి సహనం అవసరమని అన్నారు. ICICI ప్రిడెన్షియల్ వాల్యూ డిస్కవరీ ఫండ్ దీర్ఘకాల లాభాలు సాధించడంలో.. పెట్టుబడిదారులకు స్థిరంగా సహాయపడుతుండటంలో తాము ఆనందంగా ఉన్నామని ఆయన చెప్పారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి