Health Insurance: ఇకపై గంటలోనే నగదురహిత వైద్యం షురూ.. బీమా కంపెనీల అభిప్రాయం కోరిన ఐఆర్‌డీఏఐ

అనుకోని పరిస్థితుల్లో వేరే ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటే అందుకు సంబంధించిన బిల్లులతో పాటు ఇతర వివరాలను ఇస్తే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానం మార్చాలని ఇన్సూరెన్స్ రెగ్యూలేటరీ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలకు కొన్ని సూచనలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఐఆర్డీఏఐ ఆరోగ్య బీమా తీసుకునే వారికి గంటలోనే నగదురహిత వైద్యం అందించేలా కీలక చర్యలు తీసుకుంది.

Health Insurance: ఇకపై గంటలోనే నగదురహిత వైద్యం షురూ.. బీమా కంపెనీల అభిప్రాయం కోరిన ఐఆర్‌డీఏఐ
Health Insurance

Updated on: May 31, 2024 | 4:00 PM

ఆపద సమయాల్లో ఆరోగ్య బీమా మంచి నేస్తంగా ఉంటుంది. ఆరోగ్య బీమాతో నగదు రహిత వైద్యం పొందవచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని బీమా నిబంధనల వల్ల అన్ని ఆస్పత్రుల్లో నగదు రహిత వైద్యం పొందలేరు. కేవలం నెట్‌వర్క్ ఆస్పత్తుల్లోనే ఆ సదుపాయం ఉంటుంది. అనుకోని పరిస్థితుల్లో వేరే ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటే అందుకు సంబంధించిన బిల్లులతో పాటు ఇతర వివరాలను ఇస్తే క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ విధానం మార్చాలని ఇన్సూరెన్స్ రెగ్యూలేటరీ ఐఆర్డీఏఐ బీమా కంపెనీలకు కొన్ని సూచనలు చేస్తూ ఉంటుంది. తాజాగా ఐఆర్డీఏఐ ఆరోగ్య బీమా తీసుకునే వారికి గంటలోనే నగదురహిత వైద్యం అందించేలా కీలక చర్యలు తీసుకుంది. ఐఆర్‌డీఏఐ తీసుకున్న తాజా నిర్ణయాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఐఆర్‌డీఏఐ ఇటీవల ఆరోగ్య బీమాపై మాస్టర్ సర్క్యులర్‌ను విడుదల చేసింది. బీమా సంస్థ అభ్యర్థించిన ఒక గంటలోపు నగదు రహిత అధికారంపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. హెల్త్ ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై మాస్టర్ సర్క్యులర్ గతంలో జారీ చేసిన 55 సర్క్యులర్‌లను రద్దు చేసింది. అలాగే పాలసీదారుల సాధికారతతో పాటు ఆరోగ్య బీమాను బలోపేతం చేయడానికి ఇది ఒక ముఖ్యమైన పురోగతి అని ఐఆర్‌డీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా నగదు రహిత అధికార అభ్యర్థనలపై తక్షణమే, ఒక గంటలోపు నిర్ణయం తీసుకోవాలని, అలాగే ఆసుపత్రి నుంచి అభ్యర్థన వచ్చిన మూడు గంటలలోపు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని స్ఫస్టం చేసింది. పాలసీదారులకు సంబంధించిన ఆన్‌బోర్డింగ్, పాలసీ పునరుద్ధరణ, పాలసీ సర్వీసింగ్, ఫిర్యాదుల పరిష్కారం కోసం ఎండ్-టు-ఎండ్ టెక్నాలజీ సొల్యూషన్‌లను అందించాలని వివరించారు. 

అలాగే క్లెయిమ్ సెటిల్‌మెంట్ల కోసం పాలసీదారు ఎటువంటి పత్రాలను సమర్పించాల్సిన అవసరం లేదని, బీమా సంస్థలు, టీపీఏలు ఆసుపత్రుల నుంచి అవసరమైన పత్రాలను సేకరించాలని పేర్కొంది. ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా పోర్టల్‌లోని పోర్టబిలిటీ అభ్యర్థనలకు సంబంధించి ప్రస్తుత బీమా సంస్థ, కొనుగోలు చేసే బీమా సంస్థలు చర్య తీసుకోవడానికి కఠినమైన సమయపాలన విధిస్తామని పేర్కొంది. అంబుడ్స్‌మన్ అవార్డులను 30 రోజులలోపు అమలు చేయని పక్షంలో బీమాదారు పాలసీదారునికి రోజుకు రూ. 5,000 చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. చికిత్స సమయంలో మరణించిన పక్షంలో మృతదేహాన్ని వెంటనే ఆసుపత్రి నుండి విడుదల చేయాలని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..