Fake loan apps: నకిలీ లోన్ యాప్‌లతో పెరుగుతున్న మోసాలు.. ఈ చిట్కాలతో చెక్..!

పెరిగిన టెక్నాలజీతో ప్రతి పనీ సులభంగా, వేగంగా జరుగుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్ కార్యకలాపాలు శరవేగంగా చేసుకోగలుగుతున్నాం. డిజిటల్ విప్లపంలో భాగంగా డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫాంల ఆవిర్భావం గణనీయంగా పెరిగింది. వీటిని ఉపయోగించి వ్యక్తిగత రుణాలను మొబైల్ ద్వారా కొన్ని నిమిషాల్లో పొందే అవకాశం కలిగింది. అలాగే బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (ఎన్బీఎఫ్సీ) వివిధ రకాల రుణాలను అందజేస్తున్నాయి.

Fake loan apps: నకిలీ లోన్ యాప్‌లతో పెరుగుతున్న మోసాలు.. ఈ చిట్కాలతో చెక్..!
Fake Loan Apps

Updated on: Feb 16, 2025 | 7:00 PM

భారీగా పెరిగిన ఇన్ స్టంట్ లోన్ యాప్ లలో ఏది నిజమో, ఏది అబద్దమో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే కొన్ని అంశాలను జాగ్రత్తగా గమనిస్తే ఫేక్ యాప్ లకు దూరంగా ఉండవచ్చు. సైబర్ నేరగాళ్లు అనేక నకిలీ యాప్ ల ద్వారా రుణాల పేరుతో ఆకర్షిస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్లు, సోషల్ మీడియా ప్రకటనలు, ఫోన్ కాల్స్ ద్వారా సంప్రదింపులు జరుపుతున్నారు త్వరిత ఆమోదం, తక్కువ వడ్డీ రేట్ల పేరుతో వల వేస్తున్నారు. రుణం ఆమోదం కోసం ముందుగా కొంత చెల్లించాలని చెప్పి, డబ్బులు దోచుకుంటున్నారు. లేకపోతే వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. నకిలీ రుణాల పేరుతో వల వేస్తున్న సైబర్ నేరగాళ్ల నుంచి రక్షణ కోసం కొన్ని విషయాలను గమనించాలి. తద్వారా అప్రమత్తంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది.

ఈ చిట్కాలతో మోసాలు దూరం

ఇవి కూడా చదవండి
  • రుణాన్ని ఆమోదించడానికి ముందస్తుగా కొంత సొమ్ము కట్టాలని అడిగితే నమ్మకండి. వారు నకిలీ రుణదాతలు కావచ్చు. నిజమైన లెండర్లు రుణ ఆమోదం తర్వాత ఆ మొత్తం నుంచి రుసుమును మినహాయించుకుంటారు.
  • నిజమైన రుణదాతలు తమ భౌతిక కార్యాలయం, స్పష్టమైన సంప్రదింపు వివరాలను కలిగి ఉంటారు. రుణదాత వెబ్‌సైట్‌లో ఈ సమాచారం లేకపోతే జాగ్రత్తగా ఉండండి.
  • అతి తక్కువ వడ్డీరేటు, అత్యంత వేగంగా రుణాన్ని ఆమోదిస్తామని చెబితే ఒక్కసారి ఆలోచించండి. బ్యాంకులు, మిగిలిన ఆర్థిక సంస్థల వడ్డీరేట్లను సరిపోల్చుకోండి.
  • రుణ నిబంధనలను జాగ్రత్తగా చదవండి. ఏదైనా అస్పష్టంగా ఉంటే అది మోసానికి సంకేతంగా భావించొచ్చు.
  • “https://”తో ప్రారంభమయ్యే వెబ్‌సైట్ సురక్షితమని తెలుసుకోండి. అసురక్షిత వెబ్‌సైట్లు మీ డేటాను ప్రమాదంలో పడేస్తాయి.
  • ఎటువంటి క్రెడిట్ మూల్యాంకనం లేకుండా రుణాన్ని అందిస్తామంటే నమ్మవద్దు.
  • తరచూ సిబిల్,సీఆర్ఐఎఫ్ హైమార్క్, ఎక్స్పీరియన్, ఈక్విఫాక్స్ తదితర వాటిలో క్రెడిట్ స్కోర్ నివేదికను తనిఖీ చేసుకోండి. వాటిలో ఏవైనా రుణాలు లేదా క్రెడిట్ ఖాతాలను మీ పేరు ఉంటే గమనించండి.
  • మీ బ్యాంక్ స్టేట్‌మెంట్లను తరచూ పర్యవేక్షించాలి.
  • మీ పేరు మీద మోసపూరితంగా రుణం తీసుకున్నట్లు గుర్తిస్తే, మీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి