CIBIL Score: మీ సిబిల్‌ స్కోర్‌ తెలియడం లేదా.? ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి..

అయితే మనలో చాలా మంది తెలిసో తెలియకో చేసే పొరపాట్ల కారణంగా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈఎమ్‌ఐలను సకాలంలో చెల్లించకపోవడం, క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులను చెల్లించని పక్షంలో సిబిల్ స్కోర్‌ డౌన్‌ అవుతుంది. దీంతో భవిష్యత్తులో రుణాలు తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. సాధారణంగా 750 పాయింట్లకు పైగా స్కోర్ ఉంటే అది బెస్ట్‌ సిబిల్‌ స్కోర్‌గా పరిగణలోకి తీసుకుంటారు...

CIBIL Score: మీ సిబిల్‌ స్కోర్‌ తెలియడం లేదా.? ఇలా సింపుల్‌గా చెక్‌ చేసుకోండి..
Cibil Score

Updated on: Dec 30, 2023 | 11:32 AM

ఏ బ్యాంకు రుణం ఇవ్వాలన్నా, క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్నా కచ్చితంగా మంచి సిబిల్‌ స్కోర్ ఉండాలనే విషయం తెలిసిందే. సిబిల్‌ స్కోర్ ఆధారంగానే బ్యాంకులు రుణాలు చెల్లిస్తాయి. అలాగే కొన్ని ఫైనాన్స్‌ సంస్థలు అయితే సిబిల్ స్కోర్‌ ఆధారంగానే వడ్డీ రేట్లను కూడా లెక్కగడుతాయి. మంచి సిబిల్‌ స్కోర్ ఉన్న వారికి తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తాయి. అలాగే రుణ పరిమితిని కూడా పెంచుతాయి.

అయితే మనలో చాలా మంది తెలిసో తెలియకో చేసే పొరపాట్ల కారణంగా సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ముఖ్యంగా ఈఎమ్‌ఐలను సకాలంలో చెల్లించకపోవడం, క్రెడిట్‌ కార్డ్‌ బిల్లులను చెల్లించని పక్షంలో సిబిల్ స్కోర్‌ డౌన్‌ అవుతుంది. దీంతో భవిష్యత్తులో రుణాలు తీసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. సాధారణంగా 750 పాయింట్లకు పైగా స్కోర్ ఉంటే అది బెస్ట్‌ సిబిల్‌ స్కోర్‌గా పరిగణలోకి తీసుకుంటారు. ఇంతకీ మీ సిబిల్‌ స్కోర్ ఎంత ఉందో ఎలా తెలుసుకోవాలో ఎప్పుడైనా ఆలోచించారా.? సిబిల్‌ స్కోర్‌ను ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

సిబిల్‌ స్కోర్ తెలియాలంటే మీకు కచ్చితంగా పాన్‌ కార్డ్‌ ఉండాల్సిందే. పాన్‌ ఆధారంగానే ఒక వ్యక్తి ఆర్థిక స్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు. పాన్‌ నెంబర్‌తో పాటు పుట్టిన తేదీ, పేరు వంటి వివరాలతో సిబిల్ స్కోర్‌ను తెలుసుకోవచ్చు. దేశంలో పలు క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ రిపోర్ట్‌లను అందిస్తాయి. సిబిల్, ఈక్విఫ్యాక్స్, ఎక్స్పీరియన్ వంటి వెబ్ సైట్లలో సిబిల్‌ స్కోర్‌లను చాలా సులభంగా తెలుసుకోవచ్చు.

ఇలాంటి వాటిలో సిబిల్‌.కామ్ అనే వెబ్‌సైట్‌ ఒకటి. ఈ వెబ్‌సైట్‌ ద్వారా సిబిల్‌ స్కోర్‌ ఎలా తెలుసుకోవచ్చంటే. ముందుగా సిబిల్‌.కామ్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అనంతరం హోమ్‌ పేజీలో కనిపించే ‘గెట్‌ ఫ్రీ సిబిల్‌ స్కోర్ అండ్‌ రిపోర్ట్‌’ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. వెంటనే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ఈ మెయిల్‌ అడ్రస్‌, పుట్టిన తేదీ, పాన్‌ కార్డ్ నెంబర్‌, మొబైల్ నెంబర్‌ వంటి వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ఈ వివరాలన్ని అందిస్తే మీ పూర్తి సిబిల్‌ స్కోర్‌ మీ మెయిల్‌ ఐడీకి డాక్యుమెంట్ రూపంలో వస్తుంది. ఇందులో మీ సిబిల్‌ స్కోర్‌తో పాటు మీకు ఎన్ని లోన్స్‌ ఉన్నాయి.? ఈఎమ్‌ఐ సరిగ్గా చెల్లిస్తున్నారా.? లేదా.? లాంటి పూర్తి వివరాలు సమగ్రంగా అందుబాటులో ఉంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..