నేడు వేతన జీవుల్లో చాలా మంది క్రెడిట్ కార్డులు ఉపయోగిస్తున్నారు. నెలకు నిర్ధిష్ట జీతం ఉంటే చాలు.. వివిధ బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలే క్రెడిట్ కార్డులు అడిగి మరీ ఇస్తున్నాయి. ఓ వ్యక్తికి అవసరం లేకపోయినా.. అతగాడి సిబిల్ స్కోర్ బాగుంటే చాలు.. వెంటపడి మరీ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. మరికొంతమంది అయితే అవసరానికి పనికొస్తుందని క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారు. అయితే క్రెడిట్ కార్డులను ఒక్కొక్కరు ఒక్కో దానికి వినియోగిస్తుంటారు. మరోవైపు దేశంలో చాలా మంది క్రెడిట్ కార్డులు వాడుతున్నట్లుగా అనిపిస్తుంది. కాని మనీ 9 పర్సనల్ ఫైనాన్ష్ ప్రకారం దేశంలో దాదాపు 7 శాతం మంది భారతీయులు క్రెడిట్ కార్డులు వాడుతున్నట్లు తేలింది. క్రెడిట్ కార్డులో వ్యక్తికి ఇచ్చిన లిమిట్‌ను ప్రణాళిక ప్రకారం ఖర్చుచేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే రాబడి కంటే ఎక్కువ ఖర్చు చేస్తే మాత్రం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొవల్సి వస్తుంది. ప్రస్తుతం క్రెడిట్ కార్డు వినియోగదారులు తమ కార్డును నిత్యవసర వస్తువులు, దుస్తులు, ప్రయాణాలు ఇలా రకరకాల అవసరాలకు ఉపయోగిస్తున్నారు.
క్రెడిట్ కార్డు వినియోగదారుల్లో 50 శాతం మంది కిరాణాకు సంబంధించి నిత్యవసర వస్తువల కోసం తమ క్రెడిట్ కార్డు వినియోగిస్తున్నట్లు తేలింది. 47 శాతం మంది ఇంధనాన్ని కొనుగోలు చేయడానికి అంటే తమ వాహనలకు డీజిల్, పెట్రోల్ కోసం వినియోగిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. 38 శాతం మంది వినియోగదారులు వస్త్రాలను కొనుగోలు చేయడానికి తమ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. 33 శాతం మంది స్కూల్, కాలేజీ ఫీజులు లేదా ఇతర బిల్లులు చెల్లించడానికి ఉపయోగిస్తున్నారు. అలాగే ఫ్రిజ్, టీవీ లాంటి వస్తువులతో పాటు గృహోపకరణాల కొనుగోలుకు క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్నారు.
ఎక్కువ మంది మాత్రం క్రెడిట్ కార్డులను కిరణా వస్తువలు కొనుగోలు, ఫీజుల చెల్లింపు, ఇంధనం కోసం ఉపయోగిస్తున్నట్లు తేలింది. ఈ మూడింటికి ఖర్చు చేస్తున్నవారి శాతంలో గణనీయమైన తేడా ఏమి కన్పించలేదు. అయితే క్రెడిట్ కార్డు దేని కోసం ఉపయోగిస్తున్నారో తెలిస్తే దాని ఆధారంగా కుటుంబ ఆర్థిక పరిస్థితిని అంచనా వేయవచ్చు. కిరణా సామాగ్రి, ఇంధనం, విద్యార్థుల ఫీజుల కోసం క్రెడిట్ కార్డులను వాడాల్సి వస్తే వారి కుటుబం ఆర్థిక పరిస్థితి బాగోలేదనే సంకేతాలనిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. క్రెడిట్ కార్డులు కూడా చాలామంది పేద, మధ్య తరగతి ప్రజలకు తమ ఆర్థిక అవసరాలను తీర్చడానికి సమయానికి ఉపయోగపడుతున్నట్లు తేలింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం చూడండి..