SIP Investment: ఎస్ఐపీల్లో పెట్టుబడుల వరద.. ఏడాదిలో ఏకంగా 233 శాతం వృద్ధి

|

Dec 22, 2024 | 4:44 PM

భారతదేశంలో పెట్టుబడిదారుల ఆలోచనా విధానాలు మారుతున్నాయి. ముఖ్యంగా స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే పథకాల్లో కాకుండా కొంచెం రిస్క్ అయినా పర్వాలేదని స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ వంటి పథకాల్లో పెట్టుబడికి ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా పెరిగిన ఆర్థిక అక్షరాస్యత నేపథ్యంలో పెట్టుబడుదారులు రిస్క్ తీసుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యూచువల్ ఫండ్స్ ఎస్ఐపీలు పెట్టుబడిదారులను అమితంగా ఆకర్షిస్తున్నాయి.

SIP Investment: ఎస్ఐపీల్లో పెట్టుబడుల వరద.. ఏడాదిలో ఏకంగా 233 శాతం వృద్ధి
Follow us on

భారతదేశంలో సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్‌లలో (సిప్‌లు) మొత్తం నికర పెట్టుబుడుల్లో (సంవత్సర ప్రాతిపదికన) 233 శాతం భారీ వృద్ధి నమోదైంది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ స్థాయి పెట్టుబులు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్‌ వరకు మొత్తం నికర ఇన్‌ఫ్లోలు రూ.9.14 లక్షల కోట్లుగా ఉండగా 2023లో రూ. 2.74 లక్షల కోట్లు ఉన్నాయి. ఇది దాదాపు 233 శాతం వృద్ధికి సమానమని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. నవంబర్ 2023లో రూ.30.80 లక్షల నుండి నమోదైన కొత్త ఎస్ఐపీల సంఖ్య నవంబర్ చివరి నాటికి రూ.49.47 లక్షలకు పెరిగింది. అంతేకాకుండా నిర్వహణలో ఉన్న ఎస్ఐపీ ఆస్తులు (ఏయూఎం) నవంబర్‌లో రూ.13.54 లక్షల కోట్లుగా ఉంది. ఏయూఎంలు రూ. 2023లో 9.31 లక్షల కోట్లుగా మాత్రమే ఉన్నాయి. 

భారతీయ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గతేడాది కాలంలో నికర ఇన్‌ఫ్లోలలో 135 శాతానికి పైగా పెరిగింది. అలాగే నికర ఏయూఎంలు దాదాపు 39 శాతం వృద్ధిని సాధించింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం ప్రకాశవంతమైన స్థానంలో ఉండడానికి ఈ వృద్ధి అనేది కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. భారత ఆర్థిక వ్యవస్థలో దేశీయ మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ రాబోయే సంవత్సరాల్లో అనేక రెట్లు వృద్ధిని సాధిస్తుందని భావిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి మొత్తం ఇన్‌ఫ్లోలు నవంబర్ 2023లో రూ.25,615.65 కోట్ల నుంచి నవంబర్ 2024లో రూ.60,295.30 కోట్లకు చేరాయి. అంటే దాదాపు 135.38 శాతం వృద్ధి నమోదైంది. గత ఏడాది నవంబర్‌లో రూ. 49.05 లక్షల కోట్ల వద్ద మాత్రమే నికర ఏయూఎం ఉందంటే వృద్ధి ఏ స్థాయిలో ఉందో? అర్థం చేసుకోవచ్చు. 

భారతదేశంలో అన్ని ఫండ్‌లు బలమైన వృద్ధిని సాధించగా ఈక్విటీ కేటగిరీ కింద లార్జ్ క్యాప్ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లోలు అత్యధికంగా ఉన్నాయి. గత ఏడాది ఇదే కాలంలో రూ. 306.70 కోట్లు ఉండగా నవంబర్ 2024లో దాదాపు 731 శాతం పెరిగి రూ.2547.92 కోట్లకు చేరుకుంది. ఏయూఎంలో స్థిరమైన పెరుగుదలను చూసిన స్మాల్ క్యాప్, మిడ్-క్యాప్ ఫండ్‌లు దీర్ఘకాలిక పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్గత వృద్ధిని సాధించాలనే ప్రభుత్వ ఉద్దేశానికి అనుగుణంగా పెట్టుబడులు కూడా పెరగడం అనేది శుభపరిణామమని నిపుణులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి