Indian Startups: భారతీయ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడుల వరద.. వారం రోజుల్లో మిలియన్ల డాలర్ల పెట్టుబడులు

|

Aug 05, 2024 | 5:39 PM

ప్రపంచవ్యాప్తంగా యువత ఆలోచనా విధానాలు బాగా మారుతున్నాయి. గతంలో బాగా చదివి మంచి ఉద్యోగంలో చేరాలని అనుకునే వారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగం కంటే వ్యాపారమే మేలని నమ్మే వారు చాలా మంది పెరిగారు. ఈ ఆలోచనా విధానంతోనే కొంత మంది వివిధ వ్యాపారలను పెట్టి సక్సెస్ కూడా అయ్యారు. వ్యాపార రంగంలో తమను ప్రూవ్ చేసుకుందామనుకునే వారు స్టార్టప్ కంపెనీలను ప్రారంభిస్తున్నారు.

Indian Startups: భారతీయ స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడుల వరద.. వారం రోజుల్లో మిలియన్ల డాలర్ల పెట్టుబడులు
Indian Startups List
Follow us on

ప్రపంచవ్యాప్తంగా యువత ఆలోచనా విధానాలు బాగా మారుతున్నాయి. గతంలో బాగా చదివి మంచి ఉద్యోగంలో చేరాలని అనుకునే వారు. అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా ఉద్యోగం కంటే వ్యాపారమే మేలని నమ్మే వారు చాలా మంది పెరిగారు. ఈ ఆలోచనా విధానంతోనే కొంత మంది వివిధ వ్యాపారలను పెట్టి సక్సెస్ కూడా అయ్యారు. వ్యాపార రంగంలో తమను ప్రూవ్ చేసుకుందామనుకునే వారు స్టార్టప్ కంపెనీలను ప్రారంభిస్తున్నారు. వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్న స్టార్టప్ కంపెనీలను ప్రోత్సహించేలా కొంత మంది పెట్టుబడులకు కూడా ముందుకు వస్తున్నారు. ఇలా గత వారం 32 భారతీయ స్టార్టప్ కంపెనీల్లో కొంతమంది పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టారు. ఈ నేపథ్యంలో భారతీయ కంపెనీల్లో పెట్టుబడుల వరద గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

గత వారంలో 32 భారతీయ స్టార్టప్‌లు 341 మిలియన్ల డాలర్లకు పైగా నిధులను పొందాయి. ముఖ్యంగా భారతీయ స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో గత వారం ఆరు వృద్ధి-దశ నిధుల ఒప్పందాలు, 22 ప్రారంభ దశ ఒప్పందాలను చేసుకున్నారు. మొబిలిటీ స్టార్టప్ రాపిడో నేతృత్వంలో ఆరు స్టార్టప్‌లు 216 మిలియన్ల డాలర్లకు పైగా నిధులను సంపాదించాయి. అలాగే ఫిన్‌టెక్ సంస్థలు నవీ, భారత్‌పే మరియు స్పోర్ట్స్ టెక్ కంపెనీ ఖేలోమోర్ వంటి గణనీయమైన మొత్తంలో నిధులను సేకరించారు. పునరుత్పాదక ఇంధన సంస్థ బ్లూపైన్, ఈవీ స్టార్టప్‌లు సింపుల్ ఎనర్జీ, కైనెటిక్ గ్రీన్ ఉన్నాయి.

ఇటీవల 3,600 టెక్ స్టార్టప్‌లతో సహా ఇంక్యుబేటర్ల ద్వారా స్టార్టప్‌లకు మొత్తం రూ.580 కోట్ల నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ 1,40,803 ఎంటీటీలను స్టార్టప్‌లుగా గుర్తించింది. ఐఏఎన్ఎస్ నివేదిక ప్రకారం స్టార్టప్ ఇండియా చొరవ గురించి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ మాట్లాడుతూ స్టార్టప్‌ల కోసం ఫండ్ ఆఫ్ ఫండ్స్, స్టార్టప్ ఇండియా సీడ్ ఫండ్ స్కీమ్, స్టార్టప్‌ల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ వంటి ఫ్లాగ్‌షిప్ పథకాలను ప్రభుత్వం చేపట్టిందని వివరించారు. ఈ పథకాలు స్టార్టప్‌లు ఏంజెల్ ఇన్వెస్టర్లు లేదా వెంచర్ క్యాపిటలిస్ట్‌ల నుంచి పెట్టుబడులను సేకరించేందుకు లేదా రుణాలను పొందేందుకు సహాయపడ్డాయన్నారు.  ఈ పథకాల సహాయంతో భారతదేశంలో డీపీఐఐటీ ద్వారా గుర్తింపు పొందిన 1.43 లక్షల స్టార్టప్‌లు పనిచేస్తున్నాయని ప్రసాద తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి