అదృష్టం అనేది ఎవరికో ఒక్కరికి మాత్రమే ఉంటుంది. అలాంటి వారు పట్టిందల్లా బంగారంగా మారుతుంటుంది. అందుకే.. అదృష్టం అనేది అందరికీ కలిసిరాదంటారు. మరికొంత మందికి అప్పుడప్పుడు లక్ తలుగుతుంటే.. ఇంకొంత మందికి మాత్రం లక్ అనేది ఆమడదూరంలో ఉంటుంది. ఇక్కడ మాత్రం బిగ్ బిలియన్ డేస్ సేల్ లో అదిరిపోయే లక్ తగిలింది. ఇటీవల ఫ్లిప్ కార్ట్ ఇటీవల బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సేల్ అందుబాటులో లేదు. ఈ సేల్ లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఎన్నో రకాల ఆఫర్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. వినియోగదారులకు ఈ ఆఫర్లను తెగ వినియోగించుకున్నారు. అలాగే ఐఫోన్లపై కూడా భారీ ఆఫర్లు ఉండడంతో బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో చాలామంది ఐఫోన్లను కొనుగోలు చేశారు.
ఈ క్రమంలో ఫ్లిప్ కార్ట్ లో ఐఫోన్ ఆర్డర్లు క్యాన్సిల్ చేసిందని విమర్శలు కూడా వినిపించాయి. అయితే, ఇక్కడ మాత్రం ఓ వ్యక్తికి ఫ్లిప్ కార్ట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే.. ఐఫోన్ 14 డెలివరీ చేశారు. ఇటీవల జరిగిన బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐఫోన్ 13 ధర 50వేల వరకు ఉంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యూజర్ వెల్లడించారు. ఐఫోన్ 13 ఆర్డర్ చేస్తే ఐఫోన్ 14 వచ్చిందంటూ ట్విట్ చేసి తెలిపారు.
One of my follower ordered iPhone 13 from Flipkart but he recieved iPhone 14 instead of 13 ? pic.twitter.com/FDxi0H0szJ
— Ashwin Hegde (@DigitalSphereT) October 4, 2022
రిటైల్ బాక్స్ వంటి వాటిని కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆర్డర్ వివరాల ప్రకారం.. ఐఫోన్ కోసం రూ.49,019 చెల్లించాడు. అయితే అతనికి ఐఫోన్ 14 డెలివరీ అయింది. ఐఫోన్ 14 ధర 80వేల నుంచి లక్ష వరకు ఉంటుంది.
The luck I always want luck to.. https://t.co/A0zwwzZJHw
— Sanjeev Choudhary (@Devilsanj28) October 6, 2022
అశ్విని హెగ్డే అని వ్యక్తి ట్విట్ చేయగా.. ఇది నెట్టింట వైరల్‌గా మారింది. లక్ అంటే ఇలా ఉంటుందని.. మాకు ఇలాంటి అదృష్టం కలిసి రాదంటూ కొందరు నెటిజన్లు ట్విట్టర్‌లో ఫన్నీగా స్పందిస్తున్నారు.
I WANT THIS LUCK IN MY LIFE ☹️ https://t.co/29YAm5EJCL
— SHREYAS RAO (@S_R_ARTS_) October 6, 2022
దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. చాలామంది నెటిజన్లు పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.
— Parth Monish Kohli (@Pmkphotoworks) October 5, 2022
అంతకుముందు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి వాటిల్లో ఫోన్లను ఆర్డర్ చేసిన కస్టమర్‌లకు వాటికి బదులుగా సబ్బులు, ఇటుకలు, ఇతర పనికిరాని ఉత్పత్తులు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది.
— pranav padmawar (@pranavpadmawar) October 5, 2022
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..