Flipkart: షాపింగ్ ప్రియులు సిద్ధంగా ఉండండి.. ఆఫర్ల పండగ వచ్చేస్తోంది

|

Apr 27, 2024 | 6:43 AM

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్ సైతం బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌ను ప్రారంభిస్తోంది. తాజాగా దీనికి సంబంధించి తేదీలను ప్రకటించింది. మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ మొదలు ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాల వరకు అన్ని రకాల...

Flipkart: షాపింగ్ ప్రియులు సిద్ధంగా ఉండండి.. ఆఫర్ల పండగ వచ్చేస్తోంది
Online Shopping
Follow us on

కొత్తగా ఫోన్‌ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? సమ్మర్‌లో ఏసీ కొందామని చూస్తున్నారా.? అయితే సిద్ధంగా ఉండండి ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్లతో సిద్ధమవుతోంది. ఈకామర్స్‌ సంస్థలు సేల్స్‌ పేరుతో వినియోగదారులను ఆకర్షిస్తాయన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిగ్‌ సేవింగ్‌ డేస్‌ పేరుతో అన్ని రకాల వస్తువులపై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తాయి.

ఈ క్రమంలోనే తాజాగా ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌ కార్ట్ సైతం బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌ను ప్రారంభిస్తోంది. తాజాగా దీనికి సంబంధించి తేదీలను ప్రకటించింది. మే 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ సేల్‌ కొనసాగనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ స్మార్ట్‌ ఫోన్స్‌ మొదలు ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌, గృహోపకరణాల వరకు అన్ని రకాల వస్తువలపై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తోంది.

ఇదిలా ఉంటే ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్ మెంబర్‌షిప్‌ ఉన్న యూజర్లు ఒకరోజు ముందు నుంచే అంటే మే 2వ తేదీ నుంచే ఈ సేల్‌లో డీల్స్‌ను పొందొచ్చు. ఇక ఈ సేల్‌లో భాగంగా ఎస్‌బీఐకి చెందిన కార్డుల ద్వారా కొనుగోలు చేసిన వారికి 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ లభిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్‌ లే పేరట్ ఆప్షన్‌ ద్వారా రూ. లక్ష వరకు ముందుగానే కొనుగోలు చేసి తర్వాత చెల్లించుకోవచ్చు. దీనిపై నో కాస్ట్‌ ఈఎమ్‌ఐ అందించనున్నారు.

ఫ్లిప్‌కార్ట్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ లభించనుంది. యూపీఐ ద్వారా పేమెంట్ చేసే వారికి కూడా అదనంగా డిస్కౌంట్స్‌ అందించనున్నారు. ఇక ఈ సేల్‌లో ఏయే ప్రొడక్ట్‌పై ఎంత డిస్కౌంట్‌ లభించనుంది అన్న దానిపై ఫ్లిప్‌ కార్ట్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..