Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీ లీక్‌.. ఎప్పటి నుంచో తెలుసా?

|

Sep 02, 2024 | 8:00 AM

Flipkart Big Billion Days Sale 2024: మీరు చౌక వస్తువులను కొనుగోలు చేయడానికి గొప్ప ఆన్‌లైన్ విక్రయం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలో 'బిగ్ బిలియన్ డే సేల్ 2024'ని ప్రారంభించనుంది. ఇక్కడ మీరు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందుతారు..

Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీ లీక్‌.. ఎప్పటి నుంచో తెలుసా?
Flipkart
Follow us on

Flipkart Big Billion Days Sale 2024: మీరు చౌక వస్తువులను కొనుగోలు చేయడానికి గొప్ప ఆన్‌లైన్ విక్రయం కోసం ఎదురు చూస్తున్నారా? ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ త్వరలో ‘బిగ్ బిలియన్ డే సేల్ 2024’ని ప్రారంభించనుంది. ఇక్కడ మీరు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లతో సహా వివిధ ఉత్పత్తులపై భారీ తగ్గింపులను పొందుతారు. ఈ ఏడాది అతిపెద్ద ఆన్‌లైన్ విక్రయాల్లో ఒకటైన ‘బిగ్ బిలియన్ డేస్ సేల్’ తేదీ తాజాగా లీక్ అయింది. మీరు ఈ సేల్‌ ఎప్పుడు ప్రారంభం కానుందో తెలుసుకుందాం.

గత సంవత్సరం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్‌లో ప్రారంభమైంది. ఈసారి ఈ సేల్ సెప్టెంబర్‌లో మాత్రమే ప్రారంభమవుతుంది. దీని తేదీకి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 టీజర్ కూడా కనిపించింది. ప్రస్తుతం ఈ టీజర్ ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సేల్ ఎప్పటి నుంచి మొదలవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది.

ఇవి కూడా చదవండి

సేల్ ప్రారంభం

సోషల్ మీడియా వేదికగా టెక్ టిప్‌స్టర్ ముకుల్ శర్మ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ సెప్టెంబర్ 29 నుండి ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి టీజర్‌ను కూడా శర్మ పోస్ట్‌లో షేర్ చేశారు.

ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో తేదీ:

ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసినప్పుడు ఫ్లిప్‌కార్ట్ అధికారిక వెబ్‌సైట్ సెర్చ్‌ కూడా బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభ తేదీని చూపుతోంది. ఫ్లిప్‌కార్ట్ సైట్ వివరాల ప్రకారం, ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ సెప్టెంబర్ 29 నుండి ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌లో అత్యుత్తమ డీల్స్, డిస్కౌంట్‌ల ప్రయోజనాన్ని పొందండి అని అందులో రాసి ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సెర్చ్ లింక్‌పై క్లిక్ చేసిన తర్వాత వివరాలు రావడం లేదు.

Flipkart Big Billion Days Sale

గాడ్జెట్లు చౌకగా..

బిగ్ బిలియన్ డేస్ సేల్ తేదీని ఫ్లిప్‌కార్ట్ అధికారికంగా వెల్లడించలేదు. సేల్ డీల్స్, డిస్కౌంట్ ఆఫర్‌లను ఇంకా వెల్లడించలేదు. ల్యాప్‌టాప్‌లు, టీవీలు, స్మార్ట్‌వాచ్‌లతో సహా వివిధ గాడ్జెట్‌లపై భారీ తగ్గింపులను ఆశించవచ్చు. యాపిల్, గూగుల్, సామ్‌సంగ్ వంటి టాప్ బ్రాండ్‌ల స్మార్ట్‌ఫోన్‌లను తక్కువ ధరలకు కొనుగోలు చేసే అవకాశం మీకు లభిస్తుంది.

 


ఇది కూడా చదవండి: Cylinder Price Hike: వినియోగదారులకు బ్యాడ్‌ న్యూస్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి