Holi Sale 2023: కళ్లు జిగేల్‌ మనేలా హోలీ ఆఫర్స్‌.. ఐఫోన్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌ దాకా.. సమయం లేదు మిత్రమా.. త్వరపడండి

మీ ప్రియమైన వారికి ఐఫోన్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌ గా ఇచ్చి హోలీని మరింత రంగులమయంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారా? అయితే మీకిదే సరైన సమయం. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర రిటైలర్స్‌ ప్రత్యేక సేల్స్‌ ను ప్రకటించాయి.

Holi Sale 2023: కళ్లు జిగేల్‌ మనేలా హోలీ ఆఫర్స్‌.. ఐఫోన్‌ నుంచి స్మార్ట్‌ వాచ్‌ దాకా.. సమయం లేదు మిత్రమా.. త్వరపడండి
Holi Sale 2023
Follow us
Madhu

|

Updated on: Mar 04, 2023 | 11:00 AM

రంగుల పండుగ హోలీ సమీపిస్తోంది. వర్ణాలమయమైన పండుగను మరింత కలర్‌ ఫుల్‌గా మార్చేందుకు ఈ-కామర్స్‌ దిగ్గజాలు ప్రత్యేక ఆఫర్లతో తరలివచ్చాయి. మీ ప్రియమైన వారికి ఐఫోన్‌ గిఫ్ట్‌ ఇవ్వాలని ఆలోచిస్తున్నారా? సర్‌ ప్రైజ్‌ గిఫ్ట్‌ గా ఇచ్చి హోలీని మరింత రంగులమయంగా మార్చుకోవాలని ఆశిస్తున్నారా? అయితే మీకిదే సరైన సమయం. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర రిటైలర్స్‌ ప్రత్యేక సేల్స్‌ ను ప్రకటించాయి. స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌ వాచ్‌లు, ఇతర ఎలక్ట్రానిక్‌ వస్తువులపై స్సెషల్‌ డిస్కౌంట్‌లు అందిస్తున్నాయి. తక్కువ ధరకు ఐఫోన్‌ను కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి సూపర్‌ డీల్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బచత్‌ ధమాకా సేల్‌, అమెజాన్‌ హోలీ సేల్‌, క్రోమా ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్ హోలీ ఎడిషన్ పేరిట ఆఫర్లను ప్రకటించాయి. ముఖ్యంగా ఫ్లిప్‌ కార్ట్‌లో ఐఫోన్‌పై అదిరిపోయే ఆఫర్‌ ఇంది. ఇప్పటికే ఈ ఆఫర్లు ప్రారంభమయ్యాయి. సమయం లేదు మిత్రమా త్వరపడండి..

ఫ్లిప్‌కార్ట్ బిగ్ బచత్ ధమాల్ సేల్ 2023

ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్‌లో మార్చి 3 నుంచి 5 వరకు జరుగుతుంది. ఈ సమయంలో వినియోగదారులకు అనేక ఆకర్షణీయమైన డిస్కౌంట్స్‌ అందుబాటులో ఉంటాయి. దాదాపు 100,000 ఉత్పత్తులతో ఫ్లిప్‌ కార్ట్‌ ఈ సేల్‌ని నిర్వహిస్తోంది. వినియోగదారులు యాపిల్‌ ఐఫోన్‌లు, ఎయిర్‌పాడ్‌లు, గాడ్జెట్‌లు, అధునాతన గృహోపకరణాల వరకు వివిధ రకాల వస్తువులపై 80 శాతం వరకు డిస్కౌంట్‌ అందుకోవచ్చు. ఐఫోన్ పై అదిరిపోయే ఆఫర్.. సేల్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్‌ ఐఫోన్‌-13, 14 మోడళ్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తోంది. ఐఫోన్‌ 13 అసలు ధర రూ.61,999, దీన్ని కేవలం రూ.59,999కి సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కస్టమర్‌లు తమ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్‌ చేయడం ద్వారా ఐఫోన్‌ 13 ధరపై అదనంగా రూ.23,000 తగ్గింపును పొందవచ్చు. ఐఫోన్‌-14 ధర రూ.71,999 కాగా హోలీ సందర్భంగా రూ.67,999కి అందిస్తోంది.

క్రోమా ఫెస్టివల్ ఆఫ్ డ్రీమ్స్ హోలీ ఎడిషన్

రిటైల్ స్టోర్ క్రోమా తన హోలీ సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇతర వస్తువులపై బెస్ట్‌ డీల్స్‌ అందిస్తోంది. బ్లూటూత్ హెడ్‌ఫోన్‌లు: జీబ్రానిక్స్‌ ప్యారడైస్‌ బ్లూటూత్ హెడ్‌సెట్ మైక్‌తో రూ.599కి లభిస్తుంది. పీట్రాన్‌ సౌండ్‌స్టర్‌ లైట్‌ 140317952 మైక్‌తో బ్లూటూత్ హెడ్‌సెట్ రూ.769, ఫైర్‌ బోల్ట్‌ బీహెచ్‌ 1001, బీహెచ్‌1000 మైక్‌తో ఆన్-ఇయర్ నాయిస్ ఐసోలేషన్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ రూ.829, గిజ్‌మోర్‌ గిజ్‌ ఓవర్‌ ఇయర్‌ ఎంహెచ్‌ 411 పాసివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ మైక్‌తో రూ.949కి అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వాచ్‌లు: ఫైర్‌ బోల్ట్‌ డాజెల్‌ ప్లస్‌ బీఎస్‌డబ్ల్యూ037 స్మార్ట్‌వాచ్ డిస్కౌంట్‌ ధర రూ.1,399కి అందుబాటులో ఉంది. యాపిల్‌ మ్యాక్‌బుక్: యాపిల్‌ మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ 2022 (ఎం2, 13.6 అంగుళాలు, 8జీబీ, 256జీబీ, మ్యాక్‌ ఓఎస్‌, స్టార్‌ లైట్‌)ని రూ.1,10,8390కి కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా యాపిల్‌ మ్యాక్‌ బుక్‌ ఎయిర్‌ 2020 (ఎం1, 13.3 అంగుళాలు, 8జీబీ, 256జీబీ, మ్యాక్‌ ఓఎస్‌ బిగ్ సుర్, సిల్వర్) రూ.83,900కి లభిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లు: వన్‌ప్లస్‌ 11ఆర్‌ 5జీ రూ.39,999 నుంచి ప్రారంభం అవుతుంది. శామ్‌సంగ్‌ ఏ14 5జీ రూ.14,999 నుంచి మొదలవుతుంది. రెడ్‌మీ 10ఏ సిరీస్ రూ.7,999 నుంచి, వివో T1ఎక్స్‌ రూ.14,249 నుంచి ఉంటాయి.

ఇవి కూడా చదవండి

అమెజాన్ హోలీ సేల్ 2023

హోలీ పండుగను పురస్కరించుకుని అమెజాన్ ఇండియా హోలి షాపింగ్‌ స్టోర్‌ సేల్‌ లాంచ్‌ చేసింది. ల్యాప్‌టాప్‌లు, వేరియబుల్స్‌, అమెజాన్ డివైజెస్‌పై ప్రత్యేక డిస్కౌంట్లు అందిస్తోంది. అమెజాన్‌ హోలి సేల్‌ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ సేల్‌లో లభిస్తున్న బెస్ట్‌ డీల్స్‌ పై లుక్కేద్దాం రండి.. స్మార్ట్‌ఫోన్లు: వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ 2 లైట్‌ 5జీ ఫోన్‌ రూ.18,999కి లభిస్తుంది. అదే విధంగా శామ్‌సంగ్‌ గెలాక్సీ ఎం13 రూ.10,999కి అందుబాటులో ఉంది. ల్యాప్‌టాప్‌లు: ఆసుస్‌ వివో బుక్‌ ప్రో 16 ల్యాప్‌టాప్ (లెవన్త్‌ జనరేషన్‌ ఇంటెల్ కోర్ ఐ9 ప్లస్‌ ఆర్‌టీఎక్స్‌ 3050 గ్రాఫిక్స్) డిస్కౌంట్‌ ప్రైస్‌ రూ.89,990కి లిస్ట్‌ అయింది. అమెజాన్ డివైజెస్‌: అమెజాన్ ఎకో డాట్ (థర్డ్‌ జనరేషన్‌) రూ.3,499కి, అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ రూ.3,299కి అందుబాటులో ఉన్నాయి. స్మార్ట్ వాచ్‌: బోట్ వేవ్ ఎడ్జ్‌ డిస్కౌంట్‌ ధర రూ.2,199. ఇయర్ ఫోన్స్: బోట్ రాకెర్జ్‌ 255 ప్రో ప్లస్‌ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ రూ.1299కి అందుబాటులో ఉంది. బోట్‌ రాకెర్జ్‌ 103 ప్రో బ్లూటూత్ నెక్‌బ్యాండ్ రూ.899కి, అమెజాన్‌ బేసిక్స్‌ బ్లూటూత్ నెక్‌బ్యాండ్ రూ.489 లభిస్తున్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు