
Flight Tickets: సాధారణంగా విమానంలో ప్రయాణించాలంటే వేలల్లో టికెట్ ధర ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆఫర్లను ప్రకటిస్తుంటాయి విమానయాన సంస్థలు. అలాంటిప్పుడు టికెట్ ధర వెయ్యి, రెండు వేలు ఉంటుంది. కానీ దేశీయ దిగ్గజ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇండిగో బంపరాఫర్ ప్రకటించింది. పసి పిల్లలు ఉన్న తల్లిదండ్రుల అతి తక్కువ ధరకే ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తోంది.
ఈ ప్రయాణంలో దాదాపు రూ.1750 వరకు ఆదా చేసుకోవచ్చని ప్రకటించింది. అంతేకాదు, పసి పిల్లల కోసం కేవలం ఒక రూపాయికే విమాన ప్రయాణం (ఇన్ఫాంట్ ఫ్లై ఎట్ రూ.1) పేరుతో స్పెషల్ సేల్ అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఏడాది లోపు వయసున్న పిల్లలకు ఒక్క రూపాయికే విమాన ప్రయాణం కల్పిస్తున్నట్లు ఇండిగో విమానయాన సంస్థ తెలిపింది. అయితే నేరుగా ఇండిగో అధికారిక వెబ్‌సైట్ నుంచి టికెట్లు బుక్ చేసుకుంటేనే ఆ ఆఫర్ వర్తిస్తుందని వెల్లడించింది. 1 రూపాయితో టికెట్ కొనుగోలు చేసిన తల్లిదండ్రులు చెక్-ఇన్ పాయింట్ దగ్గర పిల్లల వయసు ధ్రువీకరణ కోసం వాలిడ్ డాక్యుమెంట్లు అయిన, బర్త్ సర్టిఫికెట్, వ్యాక్సినేషన్ సర్టిఫికెట్, హాస్పిటల్ డిశ్చార్జ్ కార్డ్, పాస్ట్‌పోర్ట్ వంటివి రుజువును చూపించాల్సి ఉంటుందని తెలిపింది.
ఒక రూపాయికే టికెట్ ఆఫర్ నవంబర్ 30, 2025 వరకు ఉంటుందని ఇండిగో ఎయిర్ లైన్స్ వెల్లడించింది. ఈ టికెట్ మీద దేశీయ విమానాల్లో ఎక్కడికైనా ప్రయాణించవచ్చని పేర్కొంది. ఈ ఆఫర్కు సంబంధించిన పూర్తి వివరాలకోసం అధికారిక వెబ్‌సైట్ డీల్స్ అండ్ ఆఫర్స్ విభాగంలో వెల్లడించింది. పసిపిల్లలతో జర్నీ చేసేవారికి తమ వంతు మద్దతుగా ఈ ఆఫర్ అందిస్తున్నట్లు తెలిపింది.
ఇది కూడా చదవండి: Gold Price Update: అదిరిపోయే గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే..?
ఇది కూడా చదవండి: Supreme Court: ఇళ్లల్లో అద్దెకు ఉండేవారిపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి