Bank Offers : రష్యా- ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం అన్నీ రంగాలపైనా పడుతుంది. ఇక ఈ యుద్ధం కారణంగా సామాన్యుల ఆదాయం పై పెను ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మిగులు ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు ఖాతాలలో ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీరు పొదుపు ఖాతాలలోని డిపాజిట్ల నుండి వడ్డీ ఆదాయాన్ని కూడా పొందుతారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వడ్డీ రేట్లు పడిపోతున్నాయి. ఈ పరిణామాల మధ్య బ్యాంక్ బజార్ సర్వే ప్రకారం.. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు అధిక వడ్డీ రేట్లను అందిస్తాయి. కొత్త రిటైల్ కస్టమర్లను పొందేందుకు ప్రముఖ ప్రైవేట్ , ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు పొదుపు ఖాతాలపై అధిక వడ్డీ రేట్లను అందిస్తున్నాయి. అయితే ఈ బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ముందు ఆ బ్యాంకులకు సంబంధించిన పూర్తివివరాలు, వాటి బ్రాంచ్ లకు సంబంధించిన వివరాలు, అలాగే ATM సేవల గురించి తెలుసుకోవాలి. పొదుపు ఖాతాలపై ఉత్తమ వడ్డీ రేట్లను అందించే చిన్న ఫైనాన్స్ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకుల వివరాలు ఇప్పుడు చూద్దాం..
AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. సేవింగ్స్ ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 2,000 నుండి రూ. 5,000 ఉండాలి. అలాగే ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కూడా పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అదేవిధంగా ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్.. ఈ బ్యాంక్ కూడా పొదుపు ఖాతాలపై 7 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. అయితే సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ.2,500 నుండి రూ.10,000 ఉండాలి. ఇక DCB బ్యాంక్ పొదుపు ఖాతాలపై 6.75 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తుంది. ప్రైవేట్ బ్యాంకులలో, ఈ బ్యాంక్ ఉత్తమ వడ్డీ రేట్లను అందిస్తుంది. మినిమమ్ రూ.2,500 నుంచి రూ.5,000 బ్యాలెన్స్ మన అకౌంట్ లో ఉండాలి. అలాగే ఆర్‌బిఎల్ బ్యాంక్ పొదుపు ఖాతాలపై 6.25 శాతం వరకు వడ్డీ రేట్లను అందిస్తోంది. సగటు నెలవారీ బ్యాలెన్స్ రూ. 2,500 నుండి రూ. 5,000 ఉండాల్సి ఉంటుంది. బ్యాంక్ బజార్ ఫిబ్రవరి 16, 2022 నాటికి ఈ డేటాను సేకరించింది. సాధారణ పొదుపు ఖాతా కోసం మినిమం బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి. అదేవిధంగా రెగ్యులర్ సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ (BSBD) ఖాతా మాత్రమే దీనికోసం పరిగణిస్తారు.
మరిన్ని ఇక్కడ చదవండి :