Traffic Rules: కారు అతి వేగంగా నడిపినందుకు రూ. కోటి జరిమానా.. ఇక్కడ ఆదాయాన్ని బట్టి చలాన్‌!

Traffic Rules: ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి పట్టుబడితే, అతను తన ఆదాయాన్ని తక్కువగా చెబుతాడని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. ఫిన్లాండ్ భద్రతా అధికారులు డిజిటల్ రూపంలో ఆదాయం, ఆస్తి గురించి సమాచారాన్నిసేకరిస్తారు. అప్పుడు వారు ఆదాయాన్ని బట్టి జరిమానాను నిర్ణయించవచ్చు..

Traffic Rules: కారు అతి వేగంగా నడిపినందుకు రూ. కోటి జరిమానా.. ఇక్కడ ఆదాయాన్ని బట్టి చలాన్‌!

Updated on: Aug 02, 2025 | 8:35 AM

భారతదేశంలో మీరు ఎంత ప్రభావవంతమైనవారైనా, ధనవంతులు అయినా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే పోలీసుల నుండి తప్పించుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పైగా ఒక వేళ పట్టుబడినట్లయితే ధనవంతులకు, సామాన్యులకు చలాన్లు ఒకే విధంగా ఉంటాయి. అందరికి రూల్స్‌ సమానంగా ఉంటాయి. కానీ ప్రపంచంలోని ప్రతిచోటా ఇలా ఉండదు. నియమ నిబంధనలు వేరుగా ఉంటాయి. మీరు ఎంత ధనవంతులైతే ట్రాఫిక్ జరిమానా ఎక్కువగా చెల్లించాల్సిన దేశం ఉంది. భారతదేశంతో సహా ప్రపంచంలోని అనేక దేశాలలో జరిమానా మొత్తాన్ని ముందుగానే నిర్ణయిస్తారు. కానీ యూరప్‌లో ఉన్న ఫిన్లాండ్‌లో వ్యవస్థ భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ట్రాఫిక్ చలాన్ లేదా జరిమానా మొత్తాన్ని ఆదాయం ఆధారంగా నిర్ణయిస్తారు.

ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ లక్ష దాటనున్న బంగారం ధర.. హైదరాబాద్‌లో తులం ధర ఎంతంటే..

దీన్ని చేస్తున్న ఏకైక దేశం ఫిన్లాండ్ కాదు. ఐరోపాలోని కొన్ని ఇతర దేశాలలో కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నారు. కానీ ఆదాయ ఆధారిత ట్రాఫిక్ జరిమానాలను అమలు చేసిన మొదటి దేశం ఫిన్లాండ్. 1920లో ఆదాయ ఆధారిత జరిమానాలను అమలు చేసిన మొదటి దేశం ఫిన్లాండ్. ఫిన్లాండ్ నుండి నేర్చుకుంటూ స్వీడన్, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ వంటి ఇతర యూరోపియన్ దేశాలు కూడా త్వరలోనే ఈ వ్యవస్థను అమలు చేయనున్నాయి.

ఇవి కూడా చదవండి

ఆదాయం ఆధారంగా జరిమానా:

ఫిన్లాండ్‌లో దీనిని ఫిన్నిష్ భాషలో ‘పావసక్కో’ అని పిలుస్తారు. అంటే రోజువారి ఆదాయాన్ని బట్టి జరిమానా ఉంటుంది. సాధారణంగా ఇక్కడ ట్రాఫిక్‌ రూల్స్‌ ఉల్లంఘిస్తే జరిమానా వేయాలంటే వారి రోజు వారీ ఆదాయం లెక్కిస్తారు. దీని ఆధారంగా వారికి జరిమానా వేస్తారు. అయితే ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. నేరం ఎంత తీవ్రమైనది, నేరస్థుడి రోజువారీ ఆదాయం ఎంత వంటివి ఉంటాయి. అంటే వ్యక్తి ధనవంతుడైతే అతను ఎక్కువ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. వ్యక్తి తక్కువ డబ్బు సంపాదిస్తే, అతను తక్కువ జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

డే-ఫైన్ విధానం ప్రభావవంతంగా ఉందా?

మీరు పేదవారైనా లేదా ధనవంతులైనా జరిమానా ప్రభావం ఉంటుందని ఈ వ్యవస్థ నిర్ణయిస్తుందని ఆ దేశ ప్రభుత్వం విశ్వసిస్తుంది. ఇది న్యాయమైన పద్ధతిగా పరిగణిస్తారు. ఇది మాత్రమే కాదు, ఇది ప్రభుత్వ ఆదాయాన్ని కూడా పెంచుతుంది. చివరగా అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ వ్యవస్థ రోడ్డు ప్రమాదాలను కూడా తగ్గిస్తుంది. ప్రపంచంలోనే అతి తక్కువ రోడ్డు ప్రమాద మరణాల రేటు ఉన్న దేశాలలో ఫిన్లాండ్ ఒకటి. ఫిన్లాండ్‌లో లక్ష మందికి 3.8 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇది ప్రపంచ సగటు 17.4 కంటే చాలా తక్కువ.

ఇది కూడా చదవండి: Traffic Challans: గుడ్‌న్యూస్‌.. మీ వాహనంపై చలాన్లు ఉన్నాయా? సగం డబ్బులు మాఫీ!

ఆదాయాన్ని ఎలా కనుగొనాలి?

ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి పట్టుబడితే, అతను తన ఆదాయాన్ని తక్కువగా చెబుతాడని భావిస్తుంటారు. కానీ ఇది నిజం కాదు. ఫిన్లాండ్ భద్రతా అధికారులు డిజిటల్ రూపంలో ఆదాయం, ఆస్తి గురించి సమాచారాన్నిసేకరిస్తారు. అప్పుడు వారు ఆదాయాన్ని బట్టి జరిమానాను నిర్ణయించవచ్చు. రోజువారీ ఆదాయం సాధారణంగా పన్ను మినహాయింపు తర్వాత నెలవారీ ఆదాయంలో 1/60 వంతుగా లెక్కిస్తారు. అప్పుడు జరిమానా నిర్ణయించిన రోజు రోజువారీ ఆదాయంతో గుణిస్తారు. ఎవరైనా 20 రోజుల పాటు జరిమానా విధిస్తే అతని రోజువారీ ఆదాయం 100 యూరోలుగా పరిగణిస్తే అతను మొత్తం 2,000 యూరోల జరిమానా చెల్లించాలి. ఈ పద్ధతి ధనవంతులకు కూడా జరిమానాను ప్రభావవంతంగా చేస్తుంది. తద్వారా చట్టం అందరికీ సమానంగా ఉంటుంది.

అతివేగంగా వాహనం నడిపినందుకు కోటి రూపాయల జరిమానా:

దాదాపు 2 సంవత్సరాల క్రితం 76 ఏళ్ల ఫిన్నిష్ మిలియనీర్ ఆండర్స్ విక్లాఫ్ కు అతివేగంగా కారు నడిపినందుకు 1,21,000 యూరోలు (సుమారు రూ.1.1 కోట్లు) జరిమానా విధించారు. అతను నిర్దేశించిన పరిమితి కంటే గంటకు 30 కి.మీ. ఎక్కువగా వాహనం నడిపాడు. ఈ జరిమానా ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. విక్లాఫ్ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్త. అతని మొత్తం సంపద దాదాపు కోటి యూరోలు ఉంటుందని అంచనా. అయితే 2018లో విక్లాఫ్ కు కూడా అతివేగంగా వాహనం నడిపినందుకు 63,680 యూరోల జరిమానా విధించారు.

ఇది కూడా చదవండి: Hero Vida: సింగిల్ ఛార్జింగ్‌తో 142కి.మీ మైలేజ్‌.. ధర కేవలం రూ.45,000 మాత్రమే.. రికార్డ్‌ స్థాయిలో అమ్మకాలు!

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి