Gold Hallmarking: నగల ధగధగలకు హాల్ మార్క్ సెగ.. భగ్గుమన్న గోల్డ్ షాప్ ఓనర్లు.. అసలు ఎందుకో తెలుసా..

|

Aug 23, 2021 | 2:17 PM

ఇపుడు దేశమంతటా హాల్ మార్క్ రగడ జరుగుతోంది. ఏ బంగారు నగకైనా హాల్ మార్క్ ఉండాల్సిందేనంటుంది కేంద్రం. అలా చేస్తే మాకు ఇబ్బందికరం అంటారు చిరు వ్యాపారగణం. ఎందుకని? ఇంతకీ హాల్ మార్క్ అంటే ఏంటి?

Gold Hallmarking: నగల ధగధగలకు హాల్ మార్క్ సెగ.. భగ్గుమన్న గోల్డ్ షాప్ ఓనర్లు.. అసలు ఎందుకో తెలుసా..
Hallmarking Strike
Follow us on

ఇపుడు దేశమంతటా హాల్ మార్క్ రగడ జరుగుతోంది. ఏ బంగారు నగకైనా హాల్ మార్క్ ఉండాల్సిందేనంటుంది కేంద్రం. అలా చేస్తే మాకు ఇబ్బందికరం అంటారు చిరు వ్యాపారగణం. ఎందుకని? ఇంతకీ హాల్ మార్క్ అంటే ఏంటి? హాల్ మార్క్- ఎందుకు వద్దు? ఎందుకు కావాలి? ఇంతకీ ఏంటీ హాల్ మార్క్ పై వీరి నుంచి వినవస్తున్న రిమార్క్.. అంటే, మీరుగానీ ఒక నగ కొన్నారనుకోండి.. ఆ నగను తిరిగి అమ్మాలంటే.. దానిపై హాల్ మార్క్ ఉంటే ఒక రేటు- లేకుంటే మరో రేటు పలుకుతుంది.. ఎందుకంటే హాల్ మార్క్ లేని నగల నాణ్యతకంటూ ఒక గ్యారంటీ ఉండదు. అదే హాల్ మార్క్ గానీ ఉంటే.. దాని క్వాలిటీకి ఇక తిరుగులేదనే అనుకోవాలి. మరి ఇదంతా మంచిదే కదా? అంత మంచి హాల్ మార్కింగ్ ఎందుకు వద్దంటున్నారు? కారణాలేంటి? అన్నదిప్పుడు సగటు కస్టమర్ ను తొలిచేస్తున్న క్వొశ్చిన్ మార్క్..

అయితే ఇక్కడ రెండు వర్షెన్లున్నాయి. ఒకటి చిరు వ్యాపారులది. మరొకటి బడా జ్యువెలరీ షాపులది. నిజానికి దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని నగలకూ హాల్ మార్కింగ్ చేయాలంటే.. 200 రోజుల వరకూ పడుతుంది. అప్పటి వరకూ ఏ నగా అమ్మ వద్దంటే ఎలా? ఇప్పటికే కరోనా కారణంగా షాపులన్నీ బందు పెట్టుకున్నాం. దీంతో వ్యాపారం లేక.. కూటికి లేక- గుడ్డకు లేక స్వర్ణకారులెందరో నకనకలాడుతున్నారు.. ఇపుడీ కొత్త నిబంధన కూడానా? హాల్ మార్క్ పూర్తి చేసుకుని వచ్చే సరికి లేటయిపోతుంది. కస్టమర్లకు సకాలానికి నగలు అందించడం కుదరదన్నది చిరు వ్యాపారుల నుంచి వినిపిస్తున్న ప్రశ్న.

ఇక దీన్లో ఉన్న ఇతర ఇబ్బందుల విషయానికి వస్తే.. హాల్ మార్క్ తో పాటు ఒక నెంబర్ కూడా ఇస్తారు. ఆరు డిజిట్ల ఈ నెంబర్ కూడా నగలపై ముద్రిస్తారు. దీని కారణంగా ప్రతిదీ కేంద్రం లెక్కల్లోకి చేరిపోతుందన్నమాట. హాల్ మార్కింగ్ మాకు మరింత మంచిదే అంటాయి బడా జ్యువెలరీ షాపులు. మా ప్రొడక్ట్ క్వాలిటీ ఎంత బాగుంటే.. మాకే అంత మంచిది. మా బ్రాండ్ వాల్యూ మరింత పెరుగుతుంది.

కస్టమర్లకు కూడా ఇది ఎంతో మంచిది. వారి జ్యువెలరీ రీసేల్ వాల్యూ అమాంతం పెరుగుతుంది కాబట్టి.. ఇట్స్ గుడ్ సైన్ అన్నది.. బడా వ్యాపారస్తుల ఇన్నర్ వాయిస్. అయితే అందరితో పాటు మేమూ కలుస్తాం. చిరు వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా.. వ్యాపారం వ్యాపారమే.. వారి సమస్యలూ మా సమస్యలూ వేరు కావన్నది వీరి నుంచి వినిపిస్తున్న ఔటర్ వాయిస్.

హాల్ మార్క్- యునిక్ ఐడీ వంటి కోసం ప్రత్యేక క్లరికల్ వర్క్ అవసరం. ఇలాంటి వెసలుబాట్లు- పెద్ద పెద్ద షాపులకు మాత్రమే ఉంటాయి. దానికి తోడు ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో మా వివరాలు మొత్తం బయటకు వెళ్లడం అంత మంచిది కాదు. పెద్ద షాపులకు నడుస్తుందేమోగానీ, మాకు వీలు పడదు. కాబట్టి మీ మార్కు మాకొద్దని అంటారు కొందరు వ్యాపారులు. అందుకే ఈ అంశంపై మా నిరసన వ్యక్తం చేస్తున్నామంటున్నారు.

ఇలాంటివన్నీ ఎప్పుడూ ఉండేవే.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు.. హాల్ మార్క్ విషయంలో ముందుకే తప్ప పునరాలోచన చేసేది లేదంటుంది కేంద్రం. ఏదైనా సరే పక్కాగా జరగాల్సిందే. హాల్ మార్క్ తప్పదంతే.. అన్నది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న క్లారిటీ. మరి ఈ మార్క్ వార్.. ఎక్కడ రిమార్కబుల్ టర్న్ తీసుకుంటుందో చూడాలి.

ఇవి కూడా చదవండి: Jewellers businessmen: వద్దేవద్దు.. గోల్డ్‌పై హాల్‌మార్కింగ్‌కు వ్యతిరేక గళం.. ఇవాళ వ్యాపారుల నిరసన

Viral Video: ఈ మినీ బస్సు చాలా స్పెషల్.. రోడ్డుపై పరుగులు పెడుతుంది.. కానీ అన్ని బస్సుల్లా కాదు..