Account Hacked: ఒక్క స్టెప్ రాంగ్ వేస్తే అకౌంట్ హ్యాక్? అదేలాగో తెలిస్తే అవాక్కే!

|

Feb 19, 2024 | 7:22 PM

ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయిన సైబర్ ఫ్రాడ్. ఇక్కడ స్కామ్‌స్టర్ మీ గుర్తింపును కొట్టేడయడమే కాకుండా.. స్కామ్ చేయడానికి మీ ఫ్రెండ్స్ అకౌంట్స్ ని కూడా ఉపయోగిస్తున్నాడు. అనేక సందర్భాల్లో, ఫేస్‌బుక్‌ యూజర్‌లకు పేజీ కమ్యూనిటీ ప్రమాణాలు , నిబంధనలు పాటించడం లేదంటూ మెసేజ్ లను అందుకుంటున్నారు. మీరు ఇతరులను తప్పుదారి పట్టించే కంటెంట్‌ను షేర్ చేస్తున్నారని..

Account Hacked: ఒక్క స్టెప్ రాంగ్ వేస్తే అకౌంట్ హ్యాక్? అదేలాగో తెలిస్తే అవాక్కే!
Account Hacked
Follow us on

ఇటీవల కాలం నుంచి సైబర్‌ ఫ్రాడ్‌ బాగా పెరిగిపోయింది. ఫేస్‌బుక్‌లో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు మీ ఫ్రెండ్‌ మెసేజ్‌ చేసినట్లు సందేశాలు పంపుతూ మీ అకౌంట్లను ఖాళీ చేసేస్తున్నారు. ఈ అంశాన్ని ముందుగా ఉదాహరణతో అర్థం చేసుకుందాం. కొన్ని రోజుల క్రితం శాలినికి ఫేస్‌బుక్‌లో ఆమె స్నేహితురాలి నుంచి మెసేజ్ వచ్చింది. స్నేహితురాలు ఆమెను కోడ్ అడిగింది. ఈ కోడ్‌ని ఆమెకు షేర్ చేసినట్లయితే, ఆమెకు అకౌంట్ కు బ్లూ టిక్ వెరిఫై అవుతుందని చెప్పింది. దీంతో శాలిని కోడ్‌ని షేర్ చేసింది. కానీ ఆ మరు క్షణంలోనే తన ఫేస్‌బుక్ ఖాతా, మెసెంజర్ హ్యాక్ అయ్యాయని ఆమెకు అర్థమైంది. ఆమె తన స్నేహితురాలికి ఫోన్ చేసి వెరిఫై చేయగా, తన ఫ్రెండ్ అలాంటి మెసేజ్ ఏదీ పంపలేదని చెప్పింది. నిజానికి, ఆమె సొంత ఖాతా కూడా హ్యాక్‌ అయ్యింది. అంటే శాలినికి ఈ మెసేజ్ ను హ్యాకర్ పంపాడన్నమాట.

ఈ మధ్యకాలంలో బాగా డెవలప్ అయిన సైబర్ ఫ్రాడ్. ఇక్కడ స్కామ్‌స్టర్ మీ గుర్తింపును కొట్టేడయడమే కాకుండా.. స్కామ్ చేయడానికి మీ ఫ్రెండ్స్ అకౌంట్స్ ని కూడా ఉపయోగిస్తున్నాడు. అనేక సందర్భాల్లో, ఫేస్‌బుక్‌ యూజర్‌లకు పేజీ కమ్యూనిటీ ప్రమాణాలు , నిబంధనలు పాటించడం లేదంటూ మెసేజ్ లను అందుకుంటున్నారు. మీరు ఇతరులను తప్పుదారి పట్టించే కంటెంట్‌ను షేర్ చేస్తున్నారని.. నకిలీ పేర్లు, ఫొటోలు వాడుతున్నారని.. ఒకవేళ ఇందులో ఏదైనా పొరపాటు జరిగితే, దాన్ని సమీక్షించడానికి కింది లింక్‌పై క్లిక్ చేయండి అని ఆ సందేశాలు వస్తున్నాయి. ఇలా చేయడంలో ఫెయిలైతే.. 24 గంటలలోపు పేజీని తొలగిస్తామని అందులో ఉంటుంది.

మెసేజ్ పంపించిన వారు మెటా బిజినెస్ సర్వీస్‌ అని ఉండడంతో.. ఫేస్ బుక్ వర్గాలే ఈ మెసేజ్ ను పంపించాయని అనుకుంటారు. దీంతో వారు ఆ లింక్ పై క్లిక్ చేస్తారు. అంతే వెంటనే వారి పేజీలు హ్యాక్ అయిపోతాయి. పిల్లల అకౌంట్స్, యూత్ అకౌంట్స్ నే హ్యాకర్లు టార్గెట్ గా పెట్టుకుంటున్నారు. మెసెంజర్ లోని చాట్ లోని అన్ని ఫోటోలను హ్యాక్ చేసి.. వాటిని అడ్డం పెట్టుకుని.. ఆ అకౌంట్ హోల్డర్ ని బెదిరిస్తారు. మరి ఇలాంటి వాటి నుంచి ఎలా రక్షించుకోవాలో కూడా చూద్దాం.

ఇవి కూడా చదవండి

సోషల్ మీడియా పట్ల జాగ్రత్త

ముందుగా సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలి. తెలియని మెసేజ్ లను గుడ్డిగా నమ్మద్దు. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కూడా మీ అకౌంట్‌ను రిమూవ్ చేయదు. మీ అకౌంట్ నుంచి ఏదైనా రాంగ్ యాక్టివిటీ ఉంటే.. మీ అకౌంట్‌ణు సస్పెండ్ చేస్తారు. అంతే కాని డిలీట్ చేయరు. అందుకే అకౌంట్ డిలీట్ చేస్తామని వచ్చే మెసేజ్‌లను పట్టించుకోకపోవడమే మంచిదని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

ఇలాంటి మెసేజ్ వస్తే కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి

మీకు స్నేహితుడి నుంచి ఏదైనా మెసేజ్ వచ్చినట్లయితే సంబంధిత వ్యక్తికి నేరుగా కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి. ఈ విధంగా మీరు మోసాలు, అకౌంట్ హ్యాకింగ్ నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకుంటారు. ఇలా చేయడం వల్ల మీకు మెసేజ్ పంపిన ఫ్రెండ్ ని కూడా అలెర్ట్ చేసినట్లవుతుంది. అంతేకాకుండా, మీ facebook పేజీని ఎప్పుడూ లాక్‌లో ఉంచుకోండి. ఇది మీ ఫ్రెండ్స్ కాకుండా ఇంకెవరూ దానిని చూడలేరు. దీనివల్ల అందులో ఉండే మీ ఫోటోలను కాని, అందులో ఉన్న కంటెంట్ ను కాని ఇతరులు చూడలేరు. ఇక మీ పర్సనల్ గాడ్జెట్స్ నుంచి కాకుండా వేరే వాటి నుంచి సోషల్ మీడియా అకౌంట్స్ కి లాగిన్ అయితే జాగ్రత్తగా ఉండాలి. పని పూర్తయిన తరువాత లాగవుట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే లాగిన్ అలెర్ట్ నోటిఫికేషన్స్ ను ఆన్ చేసి ఉంచుకోవాలి. దీనివల్ల వేరే ఎవరైనా మీ అకౌంట్‌ని లాగిన్ చేయాలని ప్రయత్నిస్తే వెంటనే మీకు అలెర్ట్ వస్తుంది. సైబర్ ఫ్రాడ్ చేతిలో మోసపోకుండా అప్రమత్తంగా ఉండండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి