Amazon Offers: అమెజాన్‌లో ఆఫర్ల వెల్లువ.. ప్రారంభమైన ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్..
Amazon Sale Offers: మొబైల్ వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది.
Amazon Sale Offers: మొబైల్ వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ ఆఫర్ ప్రకటించింది. ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ పేరుతో ఇప్పటికే ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లపై భారీ స్థాయిలో డిస్కౌంట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 22వ తేదీ నుంచి ప్రారంభమైన ‘ఫ్యాబ్ ఫోన్స్ ఫెస్ట్’ ఆఫర్లు.. 25వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. ఈ ఆఫర్‌లో భాగంగా 40శాతం వరకు రాయితీలు ఇస్తోంది. వన్‌ప్లస్, శామ్‌సంగ్, రియల్ మీ, షియోమీ కంపెనీలకు చెందిన ఫోన్లపై భారీ డిస్కౌట్లు ఇస్తోంది. ఇక రీఫర్బిష్డ్ ఫోన్ల కోనుగోళ్లపై 65శాతం వరకు డిస్కౌంట్లు ప్రకటించింది అమెజాన్. అలాగే.. మొబైల్ ఫోన్ల యాక్సెసరీలపైనా 40శాతం రాయితీలు ఇస్తోంది. పలు కంపెనీలకు చెందిన హెడ్‌సెట్లపై 60శాతం ఆఫర్లు ఇస్తుండగా, మొబైల్ కేసలపై 80శాతం వరకు రాయితీలు ఇస్తోంది. ఇక ఎక్స్‌ఛేంజ్, ఈఎంఐ ఆఫర్లు కూడా ఉన్నాయి.
Also read:
సొంత పార్టీ నేతకు షాక్ ఇచ్చిన కాంగ్రెస్.. ఆ పార్టీలో చేరబోతున్నాడేనా..?