ప్రపంచవ్యాప్తంగా ఈవీ స్కూటర్లకు డిమాండ్ విపరీతంగా పెరగుతుంది. ముఖ్యంగా అమెరికా, చైనా తర్వాత ఈవీ స్కూటర్ల వాడకంలో భారతదేశం మూడో స్థానంలో ఉంది. పెరుగుతున్న పెట్రోల్ ధరలకు ప్రత్యామ్నాయంగా సగటు వినియోగదారుడు ఈవీ స్కూటర్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెరుగుతున్న కాలుష్యం నుంచి రక్షణకు ఈవీ కొనుగోలును ప్రోత్సహించాలనే లక్ష్యంతో ప్రత్యేక సబ్సిడీలను అందిస్తూ ఈవీ స్కూటర్ల ధరలను అందుబాటులో తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో టాప్ కంపెనీల దగ్గర నుంచి స్టార్టప్ కంపెనీల వరకూ ఈవీ స్కూటర్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఎన్ని స్కూటర్లు అందుబాటులోకి వచ్చిన ఈవీ స్కూటర్ల మార్కెట్ ఓలా తన హస్తగతం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రత్యేక సందర్బాల్లో ఆఫర్లను అందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటీవల ఓలా ఎస్ 1 స్కూటర్లపై తగ్గింపులను అందిస్తుంది. అలాగే జనవరి 31 వరకూ ఈ తగ్గింపులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. కాబట్టి ఓలా ఎస్ 1 ఈవీ స్కూటర్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.
ఓలా కంపెనీ గణతంత్ర దినోత్సవం రోజున ఎస్1 స్కూటర్లపై ఆఫర్లను ప్రకటించింది. రూ.25,000 విలువైన ప్రత్యేక ఆఫర్లను విడుదల చేసింది. ప్రత్యేక ఆఫర్లు జనవరి 31, 2024 వరకు అందుబాటులో ఉంటాయి. అలాగే ఆఫర్లు కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ లైనప్ అంతటా వర్తిస్తాయి. ఓలా ఎలక్ట్రిక్ రిపబ్లిక్ డే ఆఫర్లలో పొడిగించిన వారంటీ పై 50 శాతం తగ్గింపు, ఎస్1 ఎయిర్, S1 ప్రో మోడల్స్‌పై రూ.2,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తుంది. ఓలా ఎలక్ట్రిక్ ఎంపిక చేసిన క్రెడిట్ కార్ ఈఎంలపై కొనుగోలుదారులు రూ.5,000 వరకు తగ్గింపును పొందవచ్చని పేర్కొంది. కంపెనీ జీరో డౌన్ పేమెంట్, జీరో-ప్రాసెసింగ్ ఫీజు, 7.99 శాతం నుండి వడ్డీ రేట్లు వంటి అనేక ఫైనాన్స్ ఆఫర్లను అందిస్తోంది.
అలాగే ఓలా ఎస్1 ఎక్స్ ప్లస్ స్కూటర్లపై గతేడాది డిసెంబర్లో తొలిసారిగా ప్రకటించిన రూ.20,000 తగ్గింపును అలాగే ఉంచుతుంది. అంటే ఈ స్కూటర్ ఇప్పడు రూ.89,999 (ఎక్స్-షోరూమ్) వద్ద కొనుగోలు అందుబాటులో ఉంటుంది. ఓలా ఎలక్ట్రిక్ శ్రేణి వివిధ ధరల పాయింట్లలో ఐదు మోడళ్లను కలిగి ఉంది. అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎస్1 ఎక్స్ (2 కేడబ్లూహెచ్), ఎస్1 ఎక్స్ (3 కేడబ్లూహెచ్), ఎస్1 ఎక్స్ +, ఎస్ 1 ఎయిర్, ఎస్1 ప్రోతో ప్రారంభమయ్యే రెండో తరం ఎస్1 ప్లాట్ ఫారమ్ పై ఆధారపడి ఉంటాయి. ఎంట్రీ-లెవల్ ఎస్ 1 ఎక్స్ విక్రయాలు ఇంకా ప్రారంభం కాలేదు. అయితే ఈ స్కూటర్‌ను రూ.3999 చెల్లించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు.
ఓలా ఎలక్ట్రిక్ 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఓలా యూనిటీ హెరిటేజ్ రైడ్ ను నిర్వహించిందని, ఇందులో కస్టమర్లు దేశంలోని 26 నగరాల్లోని తమ సమీప వారసత్వ ప్రదేశాలకు వెళ్లారని వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల పీఎల్‌ఐ పథకం కింద ఆమోదించిన మొదటి ఈవీ తయారీదారుగా మారింది. ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) చేపట్టేందుకు కంపెనీ డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్‌ను కూడా దాఖలు చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి