Best electric cycles: వ్యాయామం, విహారం.. దేనికైనా రెడీ.. ఎలక్ట్రిక్ సైకిళ్లతో ఎంతో ఉపయోగం

|

Oct 29, 2024 | 2:45 PM

సంపూర్ణ ఆరోగ్యం కోసం సైకిల్ తొక్కడం ఉత్తమ మార్గమని వైద్యులు సూచిస్తున్న నేపథ్యంలో దేశంలో సైకిలింగ్ చేసే వారు క్రమంగా పెరుగుతున్నారు. తెల్లవారుజామునే అనేక మంది సైకిల్ తొక్కుతూ కనిపిస్తున్నారు. రాత్రి వేళ పనిచేసే ఉద్యోగాలు, జంక్ ఫుడ్, కాలుష్యం కారణంగా నేడు అనేక మంది అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారు. వీరందరికీ సైకిల్ తొక్కడం మంచి వ్యాయామంగా మారింది

Best electric cycles: వ్యాయామం, విహారం.. దేనికైనా రెడీ.. ఎలక్ట్రిక్ సైకిళ్లతో ఎంతో ఉపయోగం
Best Electric Cycles
Follow us on

కొందరు సైకిళ్లపై దూర ప్రాంతాలకు పర్యటిస్తారు. ఇలాంటి వారందరికీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎంతో ఉపయోగంగా ఉంటాయి. చార్జింగ్ తో సులభంగా ప్రయాణం చేయవచ్చు. అవసరమైనప్పుడు తొక్కుకుంటూ వెళ్లవచ్చు. వ్యాయామానికి , విహారానికి రెండు విధాలుగా ఉపయోగపడతాయి. అమెజాన్ లో రూ.25 వేల లోపు దొరుకుతున్న బెస్ట్ ఎలక్ట్రిక్ సైకిళ్లు ఇవే..

ఇమోటోరాడ్ ఎక్స్ 1 మౌంటైన్

ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇమోటోరాడ్ ఎక్స్ 1 మౌంటైన్ ఎలక్ట్రిక్ సైకిల్ చాలా బాగుంటుంది. దీనిలో 250 వాట్ బీఎల్డీసీ మోటారు, 7.65 లియాన్ బ్యాటరీ, ఆటో కట్ ఆఫ్ తో కూడిన మోకానికల్ డిస్కు బ్రేకులు ఆకట్టుకుంటున్నాయి. 18 అంగుళాల ప్రేమ్, 27.5 అంగుళాల టైర్ పరిమాణం, పెడల్, థొరెటల్ మోడ్ లు, 25 కిలోమీటర్ల గరిష్ట వేగం అదనపు ప్రత్యేకతలు. దీన్ని చార్జింగ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. ప్రేమ్ పై ఐదేళ్లు, బ్యాటరీపై 2 ఏళ్ల వారంటీ ఉంది. అమెజాన్ లో రూ.22,999 ధరకు ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అందుబాటులో ఉంది.

అర్బన్ టెర్రైన్ బోల్టన్

పట్టణాల్లో ప్రయాణాలకు చక్కగా సరిపోయే అర్బన్ టెర్రైన్ బోల్టన్ ఎలక్ట్రిక్ సైకిల్ దాదాపు 35 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో లియాన్ బ్యాటరీ, 27.5 అంగుళాల సింగిల్ స్పీడ్ డిజైన్, ఎగ్జిస్టబుల్ హైట్, 18 అంగుళాల హై క్వాలిటీ స్టీల్ ప్రేమ్, ముందు వెనుక బెల్ అల్లాయ్ వీల్స్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. స్త్రీ, పురుషులిద్దరూ దీన్ని చాలా సులభంగా నడపగలరు. 250 వాట్ బీఎల్ డీసీ మోటారుతో పనిచేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర రూ.21,999.

ఇవి కూడా చదవండి

గీకే ఈటీఎక్స్ 26టీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సైకిల్

21 అంగుళాల హై టెన్నైల్ కార్బన్ స్టీల్ ప్రేమ్ తో గీకే ఈటీఎక్స్ 26టీ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ సైకిల్ ఎంతో ఆకట్టుకుంటుంది. దీనిలోని 250 వాట్స్ బీఎల్ డీసీ మోటారుతో రైడ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. 26 అంగుళాల టైర్ పరిమాణం, ఆటో కట్ ఆఫ్ తో డ్యూయల్ డిస్కు బ్రేకులు, ఎఈడీ లైట్లు, పెడల్ అసిస్టెంట్, థొరెటల్ మోడ్ లు, ఎలక్ట్రానిక్ కీ లాక్, ఐపీ 65 వాటర్ రెసిస్టెంట్, అదనపు ప్రత్యేకతలు. నాలుగు గంటల్లో పూర్తిగా చార్జింగ్ చేసుకోవచ్చు. రెండేళ్ల వారంటి కలిగిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అమెజాన్ లో రూ.21,499కు అందుబాటులో ఉంది.

సినర్జీ బీ2 ఎలక్ట్రిక్ సైకిల్

మంచి ఎలక్ట్రిక్ సైకిల్ కొనుగోలు చేయాలనుకునే వారికి సినర్జీ బీ2 ఎలక్ట్రిక్ సైకిల్ మంచి ఎంపిక. దీనిలో 250 వాట్స్ బీఎల్ డీసీ మోటారు, డ్యూయల్ డిస్కు బ్రేకులు, 5.8 ఏహెచ్ లియన్ బ్యాటరీ, ఎల్ సీడీ స్పీడో మీటర్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. 18 అంగుళాల ప్రేమ్ కలిగిన ఈ సైకిల్ ను చార్జింగ్ చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది. తయారీ లోపాలపై ఒక ఏడాది వారంటీ ఇస్తున్నారు. అమెజాన్ లో ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ను రూ.23,999కు కొనుగోలు చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..