ఏదైనా అనుకోని పరిస్థితుల్లో మనకు మరణం సంభవిస్తే మన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించడానికి జీవిత బీమా కడుతూ ఉంటాం. ముఖ్యంగా భారతదేశంలో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) ఖాతాదారులు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే బీమా కట్టే వారికి నమ్మకమైన రాబడినివ్వడమే కాకుండా మరణించిన సందర్భంలో ఎలాంటి షరత్తులు లేకుండా బీమా సొమ్మును అందిస్తారనే నమ్మకంతో అందరూ ఎల్ఐసీ కడుతూ ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ఎల్ఐసీల్లో పెట్టుబడి అనేది సగటు భారతీయుల పొదుపు విధానంలో భాగంగా మారింది. ఎల్ఐసీ కూడా ఎప్పటికప్పుడు ఖాతాదారులను ఉద్దేశించి కొత్త కొత్త ప్లాన్స్‌ను అందుబాటులోకి తీసుకువస్తుంది. ఎల్ఐసీ బీమా రత్న పాలసీల్లో భాగంగా తీసుకొచ్చిన ఈ పాలసీలో రోజుకు రూ.138 పెట్టుబడి పెడితే పాలసీ మెచ్యూరయ్యే సమయానికి రూ.23 లక్షలు ఖాతాదారులు పొందవచ్చు. ఈ పాలసీ వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
ఎల్‌ఐసీ బీమా రత్న ప్లాన్‌కు అర్హత ప్రమాణాలలో కనీస ప్రాథమిక హామీ మొత్తం రూ.5 లక్షలుగా ఉంది. అయితే ఈ ప్లాన్‌కు గరిష్ట పరిమితి లేదు. పాలసీ టర్మ్ 15 ఏళ్లు, 20 ఏళ్లు లేదా 25 ఏళ్లుగా ఉండవచ్చు. 15 ఏళ్ల పాలసీ నిబంధనలకు 11 ఏళ్ల ప్రీమియం చెల్లింపు వ్యవధిగా ఉంటుంది. అలాగే 20 ఏళ్ల పాలసీ నిబంధనలకు 16 ఏళ్లు, 25 ఏళ్ల పాలసీ వ్యవధికి 20 ఏళ్ల ప్రీమియం చెల్లింపు విధానం ఉంటుంది. అంటే ఈ పాలసీలో ఓ రూ. 10 లక్షల బీమా కోసం 20 ఏళ్ల ప్లాన్ తీసుకుంటే వార్షిక చెల్లింపు రూ.50,000 పెట్టుబడి పెట్టాలి. అయితే ఈ పాలసీలో అదనపు రాబడి కోసం ఆరో సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపు రూ.1000 బేసిక్ సమ్ అష్యూర్డ్ కోసం పెట్టుబడి పెడితే రూ.55,000 మెచ్యూరిటీ సమయంలో అందుతాయి. అంటే పాలసీ కట్టే సమయంలో పాలసీదారుడు మరణిస్తే వారి కుటుంబానికి మరణ ప్రయోజనం రూ.12.5 లక్షలతో పాటు రూ.10 లక్షల పాలసీ సొమ్ము అలాగే రూ.55,000 సమ్ ఎస్యూర్డ్ సొమ్ము అందుతుంది అంటే పాలసీదారుని కుటుంబానికి రూ.23,05,000 అందుతుంది. ఎల్ఐసీ బీమా రత్న ప్లాన్ అనేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. పాలసీ అమలులో ఉన్నప్పుడే పాలసీదారు మరణిస్తే పాలసీదారు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే డెత్ బెనిఫిట్ ఉంటుంది. డెత్ బెనిఫిట్ అంటే మరణంపై హామీ ఇవ్వబడిన మొత్తం. ఇది వార్షిక ప్రీమియం కంటే ఏడు రెట్లు ఎక్కువ లేదా బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 125% కంటే ఎక్కువగా ఉంటుంది. అలాగే పాలసీదారులకు సర్వైవల్ ప్రయోజనాలు కూడా అందిస్తారు. సంబంధిత పాలసీ వ్యవధిలో జీవించి ఉన్న పాలసీదారుకు స్థిరమైన ప్రాథమిక హామీ మొత్తం చెల్లిస్తారు. ఈ పాలసీలో మెచ్యూరిటీ బెనిఫిట్ అనేది మెచ్యూరిటీపై హామీ ఇవ్వబడిన మొత్తంగా ఉంటుంది. ఇది బేసిక్ సమ్ అష్యూర్డ్‌లో 50 శాతానికి సమానంగా ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి