EV Charging Stations: రాజధానిలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ ఆప్ ప్రభుత్వం ఢిల్లీలోని పెట్రోల్ పంపులు, CNG స్టేషన్లలో EV ఛార్జింగ్ స్టేషన్ల లైసెన్స్ ఫీజును తగ్గించింది. ఢిల్లీలో అవసరమైన ఛార్జింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో ఎలక్ట్రిక్ బైక్‌లు, స్కూటళ్లకు డిమాండ్ మరింతగా పెరుగుతోంది. ఢిల్లీలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు పెరిగాయి. 2020లో ప్రభుత్వ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీని ప్రకటించిన తర్వాత ఢిల్లీలో ఈ-వాహనాల విక్రయాలు పెరిగాయి. ఛార్జింగ్ స్టేషన్లకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
ద్విచక్ర వాహనాలకు డిమాండ్ ఎక్కువ..
ఈ సంవత్సరం జనవరి నుండి మార్చి వరకు 55 శాతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు రిజిస్ట్రేషన్ అయ్యాయని, జనవరి నుండి మార్చి వరకు మొత్తం 10,707 ఎలక్ట్రిక్ వాహనాలు నమోదు అయినట్లు ప్రభుత్వం తెలిపింది. వాటిలో ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహనాలు, ఇ-రిక్షా, ఇ-కార్, ఇ-బస్ మొదలైనవి ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి