లగ్జరీ వాచ్ విక్రేత అయిన ఎథోస్ లిమిటెడ్ సోమవారం స్టాక్ మార్కెట్‌లో విస్టయింది. అథోస్ లిమిటెడ్ షేర్లు ఇన్వెస్టర్లను నిరాశపరిచాయి. స్టాక్ మార్కెట్లో ఎథోస్ బలహీనంగా లిస్టయింది. ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం తగ్గింపుతో రూ. 825 వద్ద లిస్ట్ కాగా… బిఎస్‌ఇలో 5.4 శాతం తగ్గింపుతో 830 రూపాయల వద్ద స్టాక్ లిస్టింగ్ జరిగింది. దీని ఇష్యూ ధర ఒక్కో షేరుకు రూ.878గా ఉంది. లిస్టింగ్ తర్వాత, స్టాక్ పతనమైంది. రూ.792 కనిష్ట స్థాయికి పడిపోయింది. ఇన్వెస్టర్లు ఒక్క షేరుపై రూ.53 నష్టపోయారు. IPOలో తాజాగా రూ. 375 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లు, 1,108,037 ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) ఉన్నాయి. Ethos IPO ద్వారా వచ్చే ఆదాయాన్ని రుణ చెల్లింపు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు, కొత్త స్టోర్‌ల ప్రారంభోత్సవం, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తుంది.
ఎథోస్ లిమిటెడ్‌కు దేశంలో లగ్జరీ, ప్రీమియం వాచ్ రిటైల్ విభాగంలో కంపెనీకి మంచి మార్కెట్ వాటా ఉంది. ప్రీమియం విభాగంలో మొత్తం రిటైల్ అమ్మకాలలో కంపెనీ వాటా 13 శాతం కాగా, 2020 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ లగ్జరీ విభాగంలో 20 శాతం వాటాను కలిగి ఉంది. దేశంలోని 17 నగరాల్లో మల్టీ-స్టోర్ ఫార్మాట్‌లో కంపెనీ 50 ఫిజికల్ రిటైల్ స్టోర్‌లను కలిగి ఉంది. ఇది తన ఉత్పత్తులను తన వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా వినియోగదారులకు విక్రయిస్తుంది. ఎథోస్ IPO నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల (NIIలు) వాటా 1.48 రేట్లు సబ్‌స్ర్కైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIBs) 1.06 రేట్లు సబ్‌స్ర్కైబ్ అయింది. Ethos 50కి పైగా ప్రీమియం, లగ్జరీ వాచ్ బ్రాండ్‌లను విక్రయిస్తోంది.