
సర్వీస్ పీరియడ్ ఓవర్‌లాపింగ్ కారణంగా పీఎఫ్ క్లెయిమ్‌లు చాలా వరకు ఇటీవల తిరస్కరణకు గురవుతున్నాయి. ఇకపై ఆ తరహా క్లెయిమ్స్‌ను తిరస్కరించకూడదని ఈపీఎఫ్‌ఓ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ఓ ప్రకటన విడుదల చేసింది. కేవలం సర్వీస్ పీరియడ్‌లు ఓవర్‌లాపింగ్ కావడం వల్ల బదిలీ క్లెయిమ్‌లను తిరస్కరించలేమని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. అలాంటి ఓవర్‌లాపింగ్‌ల వెనుక నిజమైన కారణాలు ఉంటే వాటిని యాక్సెప్ట్ చేస్తామని పేర్కొంది. ఉద్యోగాలు మారినప్పుడు పీఎఫ్ బదిలీ ప్రక్రియలో అనవసరమైన జాప్యాలు, తిరస్కరణలను నిరోధించడమే లక్ష్యంగా ఈ ఆదేశాలు జారీ చేశారు. ప్రాంతీయ కార్యాలయాలు సర్వీసు టైమ్ ఓవర్‌లాప్ సమస్య కారణంగా బదిలీ క్లెయిమ్ అభ్యర్థనలను తిరస్కరిస్తున్నట్లు గమనించామని ఈపీఎఫ్ో పేర్కొంది. సహేతుకమైన కారణాల వల్ల సర్వీసుల్లో ఓవర్‌లాప్ జరగవచ్చు. అందువల్ల బదిలీలను అమలు చేయడంలో దీనిని అనర్హతగా పరిగణించకూడదని స్పష్టం చేసింది
ఒక ఉద్యోగి సర్వీస్ రికార్డులో జాబ్ టైమ్ కారణంగా అనేక ప్రాంతీయ కార్యాలయాలు బదిలీ క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నాయని గమనించిన తర్వాత మే 20న సర్క్యులర్ జారీ చేశారు. గతంలో పని చేసిన సంస్థ చివరి పని దినాన్ని నమోదు చేయడంలో ఆలస్యం కారణంగా క్లెయిమ్ రిజెక్ట్ అవతుంది. అలాగే కొత్త యజమాని చేరిన తేదీ నమోదు చేయడంలో ఆలస్యంతో పాటు సర్వీస్ రికార్డులలో క్లరికల్ లేదా అడ్మినిస్టేషన్ లోపాల వల్ల తరచూగా పీఎఫ్ క్లెయిమ్స్ రిజెక్ట్ అవతున్నారు. అందువల్ల ఇకపై ఇలాంటి పరిస్థితులు లేకుండా సజావుగా క్లెయిమ్స్ ప్రాసెసింగ్ చేయాలని ఈపీఎఫ్ఓ ఆదేశాలు జారీ చేసింది.
ఓవర్‌లాపింగ్ సర్వీస్ పీరియడ్ అంటే అంటే ఒక ఉద్యోగి ఒక సంస్థ నుంచి నిష్క్రమించిన తేదీ, మరొక సంస్థలో చేరిన తేదీ ఒకే విధంగా లేదా ఓవర్ ల్యాప్ అయినట్లు ఉంటుంది. అంటే ఆ వ్యక్తి ఒకేసారి రెండు ఉద్యోగాలలో పని చేస్తున్నట్లు సిస్టమ్ రికార్డు అవుతుంది. వాస్తవానికి ఇది కేవలం రిపోర్టింగ్ లేదా అప్‌డేట్ సమస్య వల్ల జరుగుతూ ఉంటుంది. ఈ తరహా క్లెయిమ్‌లను ప్రాసెస్ చేయడానికి ఈపీఎఫ్ఓ అప్‌డేటెడ్ మార్గదర్శకాలు ఉపయోగపడతాయి. అయితే ఓవర్‌లాపింగ్ పిరయడ్ స్పష్టం చేయాల్సిన అవసరం నిజంగా తలెత్తితే ప్రాసెసింగ్ అధికారి ఆమోదం పొందే ముందు వారు సభ్యుల నుంచి వివరణ తీసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి