AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ప్రతీఒక్కరి అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త. ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు వడ్డీ జమ చేయడం ప్రారంభించింది. జులై 3 నుంచి విడుదల చేస్తోంది. ఇప్పటికే చాలామంది ఖాతాదారులకు అందాయి. 15 రోజుల్లో అందరి ఖాతాల్లో జమ చేయడం పూర్తి కానుంది. ఇప్పటికే చాలామంది పీఎఫ్ జమ అయిందా... లేదా అనేది చూసుకుంటున్నారు.

EPFO: పీఎఫ్ అకౌంట్ ఉందా..? ప్రతీఒక్కరి అకౌంట్లోకి డబ్బులు వచ్చేశాయి.. చెక్ చేస్కోండి..
Epfo
Venkatrao Lella
|

Updated on: Jul 05, 2026 | 6:50 AM

Share

పీఎఫ్ ఖాతాదారులకు భారీ గుడ్ న్యూస్. ఈపీఎఫ్ఓ వార్షిక వడ్డీని జమ చేయడం ప్రారంభించింది. జులై 3వ తేదీ నుంచి వడ్డీని ఖాతాదారుల అకౌంట్లోకి విడుదల చేస్తోంది. ప్రస్తుతం కొందరి అకౌంట్లలో ఇప్పటికే డబ్బులు పడగా.. 15 రోజుల్లో ఖాతాదారుల అందరి అకౌంట్లో పడనున్నాయి. దీంతో చాలామంది పీఎఫ్ వడ్డీని చెక్ చేసుకుంటున్నారు. పీఎఫ్ వడ్డీ ఎప్పుడెప్పుడు జమ అవుతుందా అని ఖాతాదారులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మార్చిలో ఈపీఎఫ్ఓ వార్షిక వడ్డీ 8.25 శాతం అందించాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఆమోదం కోసం కేంద్ర ఆర్ధికశాఖకు పంపింది. కేంద్ర ఆర్ధికశాఖ ఇటీవల ఆమోదం తెలపడంతో ఈపీఎఫ్ఓ ఇప్పుడు ఖాతాదారుల అకౌంట్లలో జమ చేస్తోంది.

ఈపీఎఫ్ఓ వడ్డీ చెక్ చేసుకోవడం ఎలా..?

ఈపీఎఫ్ఓ పోర్టల్‌లో పాస్ బుక్ యాక్సెస్ నిలిచిపోయాయి. వారం రోజులుగా పాస్ బుక్ సేవలు నిలిచిపోగా.. అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశముంది. దీంతో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చాలానే ఉన్నాయి. మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. యూఏఎన్‌తో లింక్ అయిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలి. రెండు రింగుల తర్వాత కాల్ ఆటోమేటిక్‌గా డిస్‌కనెక్ట్ అవుతుంది. కొన్ని సెకన్లలోనే మీ మొబైల్‌కు టెక్ట్స్ రూపంలో బ్యాలెన్స్ వివరాలు అందుతాయి. ఇక ఎస్‌ఎంఎస్ ద్వారా పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు చెక్ చేసుకోవచ్చు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి EPFOHO UAN LAN ఫార్మట్‌లో మెస్సేజ్ పంపాలి. దీంతో టెక్ట్స్ రూపంలో మీ బ్యాలెన్స్ వివరాలు అందుతాయి.

సర్వీసులు ఎందుకు ఆగిపోయాయి..?

ప్రధాన సిస్టమ్ అప్‌గ్రేడ్ కారణంగా దాదాపు 7 రోజుల పాటు ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ మూతపడింది. జూన్ 26వ తేదీ నుంచి నిలిచిపోగా.. జూలై 3న శుక్రవారం తెరుచుకుంది. అయితే సభ్యుల లాగిన్ పేజీ సరిగ్గా పనిచేయకపోవడంతో చాలా మంది వినియోగదారులు ఇప్పటికీ UAN పోర్టల్‌లోకి లాగిన్ అవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం కొన్ని సర్వీసులు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దశలవారీగా మిగతా సేవలు అందుబాటులోకి వస్తాయని ఈపీఎఫ్ఓ తెలిపింది. మరో రెండు వారాల సమయం పట్టే అవకాశముంది. పాస్ బుక్ సేవలు ఇంకా ఓపెన్ కాకపోవడంతో ఖాతాదారులు వడ్డీ జమ అయిందా.. లేదా అనేది తెలుసుకోలేకపోతున్నారు. అయితే మిస్డ్ కాల్, ఎస్ఎంఎస్ విధానం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. లేదా యూఏఎన్ పోర్టల్‌లోకి వెళ్లి తెలుసుకోవచ్చు.

Follow Us
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
నీట్ ఉద్యమంలో పాల్గొన్న ఈ ఏకైక తెలుగు హీరోను గుర్తుపట్టారా?
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
అర్ధరాత్రి అలజడి.. రోడ్డుపై ఒక్కసారిగా నిలిచిపోయిన వాహనాలు..
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదేనా? పరిశోధనలు ఏం చెబుతున్నాయో తెలిస్తే
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
సింహం వేటను ఎలా చంపుతుందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..
వాచ్‏లో జెండా రంగులు.. రూ. 41 లక్షల వాచ్ గురించి తెలిస్తే..
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! సీఎం రేవంత్ కీలక ప్రకటన
21 ఏళ్లకే ఎన్నికల్లో పోటీ..! సీఎం రేవంత్ కీలక ప్రకటన
విమానంలో త్రిష లాగా 'షీట్ మాస్క్' వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా
విమానంలో త్రిష లాగా 'షీట్ మాస్క్' వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసా
చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు..
చాతుర్మాసంలో ఈ పరిహారాలు పాటించండి.. జీవితంలో శుభఫలితాలు..
ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి..
ఇంట్లో కూర్చొనే నెలకు 20వేల సంపాదన.. ఈ సూపర్ స్కీమ్ గురించి..
ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..
ఓటీటీలోకి లేటేస్ట్ లవ్ స్టోరీ.. ఎక్కడ చూడొచ్చంటే..