EPFO: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్‌..? వేతన పరిమితి రూ.21వేలకు పెంపు..!

|

Apr 19, 2022 | 4:00 PM

EPFO: ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆసరాగా నిలిచేది ఈపీఎఫ్‌. ఉద్యోగ సమయంలో వేతనం నుంచి కట్‌ అయ్యే పీఎఫ్‌ (PF) తర్వాత భవిష్యత్తుకు ఉపయోగపడనుంది. ఇక తాజాగా..

EPFO: ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే గుడ్‌న్యూస్‌..? వేతన పరిమితి రూ.21వేలకు పెంపు..!
Follow us on

EPFO: ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆసరాగా నిలిచేది ఈపీఎఫ్‌. ఉద్యోగ సమయంలో వేతనం నుంచి కట్‌ అయ్యే పీఎఫ్‌ (PF) తర్వాత భవిష్యత్తుకు ఉపయోగపడనుంది. ఇక తాజాగా ఉద్యోగులకు (Employees) తీపి కబురు అందబోతోందా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వెలువడుతున్న నివేదికల ప్రకారం పరిశీలిస్తే.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌ అందనుందని తెలుస్తోంది. అయితే ఉన్నతస్థాయి కమిటీ ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (EPFO) ఉద్యోగి వేతన లిమిట్‌ను పెంచాలని ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఆ కంపెనీ సిఫార్సు కూడా చేసినట్లు సమాచారం. ఎకనామిక్‌ టైమ్స్‌ నివేదిక ప్రకారం.. వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.21,000లకు పెంచాలని ఈ కమిటీ సూచిస్తోంది. ఈ నిర్ణయంతో దాదాపు 75 లక్షల మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుందని నివేదిక పేర్కొంది. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపింది. పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ఈ ప్రతిపాదనలు అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రతిపాదన అమలైతే 75 లక్షల ఉద్యోగులు ఈపీఎఫ్‌వో పరిధిలోకి వస్తారు. కేంద్ర సర్కార్‌ ఈపీఎఫ్‌వో ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌కు సుమారు రూ.6,750 కోట్ల ఖర్చును భరిస్తోంది. ఈపీఎఫ్‌వో చందాదారుల మొత్తం బేసిక్‌ వేతనంలో 1.16 శాతం ఈ పెన్షన్‌ స్కీమ్‌కు జమ చేస్తోంది. ఈపీఎఫ్‌వో, ఈస్‌ఐసీ రెండింటిలో సామాజిక భద్రతను అందించడానికి ఒకే విధానమైన నియమ నిబంధనలను అమలు చేయాలనే ఏకాభిప్రాయం వ్యక్తం అవుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

EPF నిబంధనలు..

కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు ఈపీఎఫ్‌ మెంబర్‌గా రిజిస్టర్‌ అయితే అప్పుడు ఆటోమేటిక్‌గా ఈపీఎఫ్‌ సభ్యుడిగా మారుతారు. ఉద్యోగి వేతనంలో12 శాతం పీఎఫ్‌ అకౌంట్‌లో జమ అవుతూ వస్తుంది. ఇదే మొత్తాన్ని కంపెనీ కూడా సబ్‌స్క్రైబర్ ఈపీఎఫ్ అకౌంట్‌లో జమ చేస్తుంది. అయితే ఇందులో 8.33 శాతం ఈపీఎస్‌కు వెళ్తుంది. ప్రస్తుతం పీఎఫ్‌ కావాలంటే గరిష్ట వేతనం రూ.15,000గా ఉంది. అంటే ప్రతి నెలా గరిష్ట పెన్షన్ వాటా రూ.1250. అంటే ఈ వేతనంలో 8.33 శాతం కట్‌ అవుతూ అకౌంట్లో జమ అవుతుంది. ప్రస్తుతం రూ.15వేలు ఉన్న పరిమితిని రూ.21వేలు పెంచాలని భావిస్తోంది. దీంతో ఒక ఉద్యోగికి మినిమమ్‌ శాలరీ రూ.21వేలు ఉండనుంది.

ఉద్యోగి పదవీ విరమణ తర్వాత..

ఉద్యోగి పదవీ విరమణ తర్వాత పెన్షన్‌ లెక్కింపునకు గరిష్ట వేతనంగా రూ.15,000లను తీసుకుంటారు. దీని ప్రకారం.. ఉద్యోగికి ఈపీఎఫ్‌ కింద గరిష్ట పెన్షన్‌ రూ.7500 అవుతుంది. ఈపీఎఫ్‌వో వేతన పరిమితికి సంబంధించి చివరిసారిగా 2014లో సవరణ చేశారు. ఆ సమయంలో ప్రభుత్వం భవిష్యనిధి వేతన పరిమితి రూ.6,500 నుంచి రూ.15,000లకు పెంచింది. ఒక సంస్థలో 20 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు ఉంటే కంపెనీ తప్పకుండా ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పరిమితిని కూడా 10కి తగ్గించాలనే డిమాండ్‌ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి:

PPF Account: పీపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి డబ్బులు విత్‌డ్రా చేయాలనుకుంటున్నారా..? ఈ నియమాలు తెలుసుకోండి

Fixed Deposit: చిన్న ఫైనాన్స్‌ బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై ఎక్కువ వడ్డీ రేట్లు.. ఎఫ్‌డీలపై కొత్త రేట్లు..!