AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. ఇలా చెక్ చేస్కోండి..

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో గుడ్ న్యూస్ అందనుంది. ప్రభుత్వం వడ్డీని జమ చేసేందుకు సిద్దమవుతోంది. ఆర్ధికశాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చాక అకౌంట్లలో నగదు వేయున్నారు. అయితే ఈపీఎఫ్‌వో నగదు ఎలా చెక్ చేసుకోవాలి. అకౌంట్లలోకి ఎప్పుడు వస్తాయి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

EPFO: ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు గుడ్ న్యూస్.. త్వరలోనే అకౌంట్లోకి డబ్బులు.. ఇలా చెక్ చేస్కోండి..
Epfo
Venkatrao Lella
|

Updated on: Jun 06, 2026 | 9:34 PM

Share

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త అందనుంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ త్వరలో చందాదారులకు వడ్డీ జమ చేయనుంది. ఈ నెల లేదా వచ్చే నెలలో ఖాతాల్లో ఎప్పుడైనా వడ్డీ నగదు పడవచ్చు. దీంతో ఖాతాదారులు ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఖాతాదారులకు 8.25 శాతం వడ్డీ అందించాలని ఈపీఎఫ్‌వో నిర్ణయం తీసుుకుంది. ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆర్ధికశాఖ ఆమోదం కోసం పంపింది. కానీ ఆర్దికశాఖ నుంచి ఇంకా ఆమోదం లభించలేదు. ఆర్ధికశాఖ నుంచి ఆమోదం లభించాక ఈపీఎఫ్‌వో వీటిని జమ చేయనుంది.

త్వరలో వడ్డీ పడే అవకాశం

లక్షలాది ఖాతాదారులు తమ ఖాతాలో వడ్డీ ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తున్నారు. 2026 మార్చిలో వడ్డీ రేటును ఈపీఎఫ్‌వో నిర్ణయించింది. మూడు నెలలు గడుస్తున్నా ఇంకా వడ్డీ జమ కాకపోవడంతో ఎప్పుడు వేస్తారా అని ఎదురుచూస్తున్నారు. అయితే వడ్డీ రేటును ప్రకటించిన ఈపీఎఫ్‌వో ఎప్పుడు జమ చేస్తామనే విషయం మాత్రం ప్రకటించలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత మాత్రమే డబ్బులు పడనున్నాయి. దీంతో ఖాతాదారులు దీని కోసం ఎదురు చూస్తూ ఉండాలి. వడ్డీ జమ చేయడంలో ఎప్పుడూ ఆలస్యం జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఆమోదం రావడం, వడ్డీ జమ చేసేందుకు అకౌంట్లను అప్డేట్ చేసేందుకు సమయం పడుతుంది. అందుకే ఈ ప్రక్రియలో ఆలస్యం జరుగుతూ ఉంటుంది.

ఆలస్యమైతే నష్టం జరుగుతుందా..?

అయితే ఈపీఎఫ్‌వో వడ్డీ జమ కావడం ఆలస్యమైతే నష్టం జరుగుతుందని చాలామంది భావిస్తారు. కానీ అది నిజం కాదు. 1952 EPF పథకం నిబంధనల ప్రకారం నెలవారీ రన్నింగ్ బ్యాలెన్స్ ఆధారంగా వడ్డీని అధికారులు లెక్కిస్తారు. ఖాతాలో వడ్డీ ఎంట్రీ ఆలస్యంగా కనిపించినప్పటికీ.. సభ్యుడు పూర్తి వడ్డీని పొందుతారు. పరిపాలనాపరమైన జాప్యాల కారణంగా వడ్డీ మొత్తంలో ఎలాంటి తగ్గింపు ఉండదు.

వడ్డీ ఎలా చూసుకోవాలి..?

-యూఏఎన్ పోర్టల్ ఓపెన్ చేయండి

-మీ పాస్ వర్డ్, యూఏఎన్ నెంబర్‌తో లాగిన్ అవ్వండి

-పాస్ బుక్‌పై క్లిక్ చేయండి

-అక్కడ పాస్ బుక్ వివరాలు కనిస్తాయి. అందులో వడ్డీ జమ అయిందో.. లేదో తెలుసుకోవచ్చు

-ఇక ఉమాంగ్ యాప్‌లోకి వెళ్లి అయినా చూసుకోవచ్చు

-7738299899 నంబర్‌కు “UAN EPFOHO ENG” అని SMS పంపడం ద్వారా కూడా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు

-అయితే మీరు పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్ యాక్టివ్‌గా ఉండాలి.

-ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు లింక్ అయి ఉండాలి

Follow Us