EPFO Transfer: ఆన్‌లైన్‌లో పీఎఫ్‌ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి చాలు..

|

Jun 22, 2022 | 1:05 PM

ఇండియాలో ఉద్యోగం చేసే దాదాపు అందరికి పీఎఫ్‌ అకౌంట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయినా అతను పీఎఫ్‌ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు...

EPFO Transfer: ఆన్‌లైన్‌లో పీఎఫ్‌ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి చాలు..
Epfo
Follow us on

ఇండియాలో ఉద్యోగం చేసే దాదాపు అందరికి పీఎఫ్‌ అకౌంట్ ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడి నుంచి ఎక్కడికి బదిలీ అయినా అతను పీఎఫ్‌ అకౌంట్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ప్రైవేట్‌ ఉద్యోగికి మాత్రం కంపెనీ మారితే పీఎఫ్‌ను ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవాల్సిందే. గతంలో పీఎఫ్‌ బదిలీకి పెద్ద తతంగం ఉంటుండే.. పీఎఫ్‌ ఆఫీస్‌కు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంత ఆన్‌లైన్‌లోనే.. అయితే చాలా మందికి ఆన్‌లైన్‌లో పీఎఫ్‌ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవడం తెలియదు. పీఎఫ్‌ అకౌంట్‌ ఎలా బదిలీ చేసుకోవచ్చో స్టెప్‌ బై స్టెప్‌ చూద్దాం…

Step 1: ముందుగా నెట్‌ ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌కు వెళ్లాలి. సర్వీసెస్‌లో ఎంప్లాయిస్‌ సెలక్ట్‌ చేసుకోవాలి. ఆ తర్వాత యూఏఎన్‌ ఆన్‌లైన్‌ సర్వీస్‌పై క్లిక్‌ చేయాలి. అప్పుడు యూఏఎన్‌ నెంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ కావాలి.

Step 2: లాగిన్‌ అయిన తర్వాత ఆన్‌లైన్‌ సర్వీస్‌పై కర్సర్‌ పెట్టగా అక్కడు ట్రాన్స్‌ఫర్‌ రిక్వెస్ట్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్‌ చేయాలి.

ఇవి కూడా చదవండి

Step 3: వ్యక్తిగత వివరాలు సరిచూసుకోవాలి. ఆ తర్వాత ప్రస్తుతం పని చేస్తున్న కంపెనీ వివరాలు నమోదు చేయాలి.

Step 4: అభ్యర్థులు మునుపటి ఉద్యోగానికి సంబంధించిన PF ఖాతా కనిపించే ‘వివరాలను పొందండి’ ఎంపికపై క్లిక్ చేయాలి.

Step 5: EPFO సభ్యులు ఇప్పుడు ఫారమ్‌ను ధృవీకరించడానికి మునుపటి యజమాని లేదా ప్రస్తుత యజమాని ఎంపికలను ఎంచుకోవాలి

Step 6: UAN నమోదిత మొబైల్ నంబర్‌లో OTPని స్వీకరించడానికి సభ్యులు ‘గెట్ OTP’ ఎంపికపై క్లిక్ చేయాలి

Step 7: చివరగా, EPFO సభ్యులు OTPని నమోదు చేసి సబ్మిట్‌పై క్లిక్ చేయాలి