PF Customers: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్ ఖాతాదారులకు పెద్ద ఉపశమనం కలిగించే వార్త. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌ఓ) ఖాతాదారుల కోసం నియమాలలో కొన్ని మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఈ రూల్స్ మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపవచ్చు. ఈపీఎఫ్‌ఓ కొత్త నిబంధనల ప్రకారం.. ప్రతి ఒక్క పీఎఫ్ ఖాతాదారుడు వారి పీఎఫ్ ఖాతాను (యూఏఎన్) ఆధార్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి. ఈ నిబంధన 1 సెప్టెంబర్ 2021 నుండి అమలులోకి వచ్చింది. గతంలో జూన్ 1న ఈ నిబంధనలు అమల్లోకి రావాల్సి ఉండగా, తర్వాత గడువుపు పొడిగించారు. అంటే పీఎఫ్ ఖాతా ఉన్న ప్రతి ఒక్కరు ఆగస్టు 31లోగా ఆధార్ కార్డుతో లింక్ చేయాల్సి ఉండేది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉండేది. కానీ తాజాగా పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్ అందించింది పీఎఫ్ సంస్థ. ఈశాన్యంలోని సంస్థలకు, మరికొన్ని వర్గాల సంస్థలకు పీఎఫ్ ఖాతాకు ఆధార్ అనుసంధానం గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించింది. ఈ నిర్ణయంతో ఆధార్ అనుసంధానం చేయని వారికి పెద్ద ఉపశమనం కలిగినట్లయింది.
అయితే సామాజిక భద్రతాలో భాగంగా సెక్షన్ 142 ప్రకారం.. ఆధార్‌తో పీఎఫ్ ఖాతాను లింక్ చేయడం తప్పనిసరి. మీ ఆధార్‌ను యూఏఎన్ (యూనివర్సల్ అకౌంట్ నంబర్-UAN)తో లింక్ చేయకపోతే మీ కంపెనీ ఈపీఎఫ్ ఖాతాలో నెలవారీ పీఎఫ్ జమ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగే లింక్ పూర్తయ్యే వరకు మీరు రుణం లేదా పీఎఫ్ ఫండ్ నుంచి విత్‌డ్రా చేసుకోలేరు. కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని తాజాగా ఆధార్ అనుసంధానం గడువు పెంచింది పీఎఫ్ సంస్థ.
ఈపీఎఫ్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా కూడా మీరు ఈ లింక్ చేసే ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇందుకు ముందుగా మీరు ఈపీఎఫ్‌ఓ వెబ్‌సైట్‌కి వెళ్ళాలి. ఆ తరువాత వెబ్‌సైట్ లింక్ పై క్లిక్ చయండి. ఇప్పుడు మీరు యూఏఎన్ అండ్ పాస్‌వర్డ్‌తో మీ పీఎఫ్ ఖాతాకు లాగిన్ కావాలి. ఇప్పుడు ‘మేనేజ్’ విభాగంలో కేవైసి ఎంపికపై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఓ పేజీ ఓపెన్ అవుతుంది. అందులో మీ ఈపీఎఫ్ ఖాతాతో లింక్ చేయడానికి కొన్ని డాక్యుమెంట్స్ చూస్తారు. ఇక్కడ ఆధార్ ఆప్షన్ ఎంచుకుని ఆధార్ కార్డుపై ఉన్న మీ ఆధార్ నెంబర్, మీ పేరును టైప్ చేసి సర్వీస్‌పై క్లిక్ చేయండి.
దీని తర్వాత మీరు ఇచ్చిన సమాచారం సేవ్ అవుతుంది, మీ ఆధార్ యూఐడిఏఐ డేటాతో వేరిఫై అవుతుంది. ఒక్కసారి మీ కేవైసి డాక్యుమెంట్స్ వేరిఫై తర్వాత మీ ఆధార్ కార్డు మీ పీఎఫ్ ఖాతాతో లింక్ అవుతుంది. మీ ఆధార్ సమాచారం ముందు వేరిఫైడ్ అని చూపిస్తుంది. కాగా, ఇలాంటి పనులు చేసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అన్ని ఖాతాలకు, ఆధార్, పాన్ ఇలా అన్నింటికి లింక్ చేసుకోవాల్సి వస్తుంది. చాలా మంది కూడా ఇలాంటి లింక్‌లు చేయడం తెలియదు. అందుకే ముందస్తుగా గడువులోగా ఇలాంటి పనులు పూర్తి చేసుకోవడం బెటర్.
Deadline for Aadhaar linking of UAN extended till 31.12.2021 for Establishments in NORTH EAST and certain class of establishments. Please check the circular here: pic.twitter.com/x4ZSGG5cy1
— EPFO (@socialepfo) September 11, 2021