EPF Customers Alert: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ 12 అంకెల యూనివర్సల్ అకౌంట్ నెంబర్ (యూఏఎన్)ను జారీ చేస్తుంది. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్‌లో యూఏఎన్ నంబర్ పొందవచ్చు. యూఏఎన్ నెంబర్ అనేది తొలిసారి ఉద్యోగంలో చేరిన వెంటనే ఆటోమేటిక్‌గా క్రియేట్ అయిపోతుంది. అయితే మీ యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN)ని ఆధార్‌తో లింక్ చేయడానికి నేటితో (నవంబర్ 30)తో గడువు ముగియనుంది. ఇంకా ఒక్క రోజే సమయం ఉంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) UANతో ఆధార్ సీడింగ్, వెరిఫికేషన్ పూర్తి చేసే తేదీని నవంబర్ 30, 2021 వరకు పొడిగించింది. డిసెంబర్ 1, 2021 నుండి ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్‌లను (ECR) ఫైల్ చేయాలని యజమానులను కోరింది. UANతో ఆధార్ ధృవీకరణ పూర్తయిన ఉద్యోగులకు EPFO మీ యజమాని ECR మార్గాన్ని ఉపయోగించి బదిలీ, ఉపసంహరణలను సులభతరం కానున్నాయి. ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్స్ (ECR)ని యజమాని ఉద్యోగి వివరాలతో EPFOకి తెలియజేయడం ద్వారా దాఖలు చేయాల్సి ఉంటుంది.
ముఖ్యంగా UANతో ఆధార్ నంబర్ సీడ్ చేసిన ఉద్యోగులకు మాత్రమే ECR ఫైల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటికీ తమ ఆధార్ కార్డ్ నంబర్‌ను తమ EPFO UANకి లింక్ చేయని వారు, 30 నవంబర్ 2021లోపు లింక్ చేయాలి. e-KYC పోర్టల్‌లోని OTP ధృవీకరణ ద్వారా UANని Umang యాప్, మెంబర్ సేవా పోర్టల్ ఉపయోగించి ఆధార్‌కి లింక్ చేయవచ్చు.
UANను ఆధార్‌తో లింక్ చేయండిలా..
► పీఎఫ్ ఖాతాదారులు https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/ పోర్టల్‌లోకి వెళ్లాలి.
► ఈపీఎఫ్ అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి ఈపీఎఫ్ఓ పోర్టల్ ఓపెన్ చేయాలి.
► యూఏఎన్ నెంబర్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
► ఆ తర్వాత Manage ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
► ఆ తర్వాత డ్రాప్‌డౌన్ మెనూలో KYC ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
► కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
► అందులో Aadhaar సెలెక్ట్ చేసి ఆధార్ నెంబర్, పేరు ఎంటర్ చేయాలి.
► ఆధార్ కార్డులో ఉన్నట్టుగానే పేరు, నెంబర్ ఎంటర్ చేయాలి.
► ఆ తర్వాత Save పైన క్లిక్ చేయాలి.
► ఆ తర్వాత వివరాలు ఓసారి సరిచూసుకోవాలి.
► మీ వివరాలు యూఐడీఏఐ డేటాతో క్రాస్ చెక్ చేసిన తర్వాత అప్రూవ్ అవుతుంది.
► అప్రూవ్ అయిన తర్వాత Verified అని కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి: