EPF Balance Without UAN: యూఏఎన్ నెంబర్‌ లేకుండానే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వివరాలు ఇలా చెక్‌ చేసుకోండి

|

May 15, 2021 | 6:05 AM

EPF Balance Without UAN: పీఎఫ్‌ పెట్టుబడులకు మరింత పారదర్శకంగా చేయడానికి ఇటీవల కాలంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లు సవరణలు..

EPF Balance Without UAN: యూఏఎన్ నెంబర్‌ లేకుండానే మీ పీఎఫ్‌ బ్యాలెన్స్‌ వివరాలు ఇలా చెక్‌ చేసుకోండి
Epf Balance
Follow us on

EPF Balance Without UAN: పీఎఫ్‌ పెట్టుబడులకు మరింత పారదర్శకంగా చేయడానికి ఇటీవల కాలంలో ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ)లు సవరణలు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈపీఎఫ్‌ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకునేందుకు ఈపీఎఫ్‌ కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ చెక్​ చేసుకోవాలంటే UAN నంబర్​ తప్పనిసరిగా అవసరం. కానీ, ఇక నుంచి యూనివర్సల్​అకౌంట్​ నంబర్​ (UAN)​ లేకుండానే బ్యాలెన్స్​వివరాలు తెలుసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. తద్వారా మీ UAN నెంబర్​ మీకు గుర్తుకు లేకపోయినా కూడా పీఎఫ్​ బ్యాలెన్స్​ఎంత ఉందో తెలుసుకోవచ్చు. ‌దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 011-229014016 కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, ఈ సౌకర్యాన్ని పొందేందుకు మీరు ముందుగానే​ UAN పోర్టల్‌లో రిజిస్టర్​చేసుకొని ఉండాలి. అంతేకాక, మీ KYC వివరాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఈ క్రింది ప్రక్రియ అనుసరించండి.

UAN లేకుండా PF బ్యాలెన్స్ ఎలా చెక్​ చేసుకోవాలి..

Step​ 1: ఈపీఎఫ్​ఓ హోమ్​ పేజీ epfindia.gov.in లాగిన్ అవ్వండి
Step 2: మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి ‘క్లిక్​ హియర్​ టు నో యువర్​ పీఎఫ్​ బ్యాలెన్స్​’ పై క్లిక్ చేయండి.
Step 3: వెంటనే epfoservices.in/epfo/ పేజ్​ ఓపెన్​ అవుతుంది. అక్కడ ‘మెంబర్​ బ్యాలెన్స్​ ఇన్ఫర్మేషన్‌’ను ఎంచుకోండి.
Step 4: అక్కడ మీ రాష్ట్రం, ఈపీఎఫ్​ కార్యాలయం, కోడ్​, పీఎఫ్​ ఖాతా సంఖ్య, ఇతర వివరాలను నమోదు చేయండి.
Step​ 5: ‘సబ్​మిట్’ చేసే ముందు ‘ఐ అగ్రీ’పై క్లిక్ చేయండి.
Step​ 6: అప్పుడు మీ స్క్రీన్​పై ఈపీఎఫ్​ బ్యాలెన్స్​ వివరాలు ప్రత్యక్షమవుతాయి.

అయితే ఈ ప్రక్రియతోనే కాకుండా passbook.epfindia.gov.in వెబ్‌సైట్‌లోకి లాగిన్ కావడం ద్వారా కూడా మీ యుఎఎన్ నంబర్ లేకుండానే ఈపీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు.

UAN నంబర్​తో PF బ్యాలెన్స్ ఎలా చెక్ చేసుకోవాలి..

ఈపీఎఫ్ఓ చందాదారుడికి UAN నంబర్​ఉంటే, అప్పుడు SMS లేదా మిస్డ్ కాల్ ద్వారా పీఎఫ్​ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. దీని కోసం మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 కు EPFOHO UAN అని ఎస్‌ఎంఎస్‌ పంపాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ రిజిస్టర్డ్​ మొబైల్ నంబర్‌కు ఈపీఎఫ్​ఓ సంస్థ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలను పంపిస్తుంది.

ఇవీ కూడా చదవండి:

LIC Customers: ఎల్‌ఐసీ పాలసీదారులకు గుడ్‌న్యూస్‌.. కరోనా పరిస్థితుల్లో కస్టమర్లకు ఊరట కలిగించే నిర్ణయం

EPF Withdrawal: వివిధ రకాల అవసరాల కోసం ఈపీఎఫ్‌ అకౌంట్‌ నుంచి ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చంటే..!