Payal Mittal Agarwal Tea Business: పాయల్ మిట్టల్ అగర్వాల్.. ఓ సామాన్య గృహిణి.. తాను చేసే వ్యాపారంలో కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టలేదు… కేవలం టీ అమ్మడం ద్వారా మాత్రమే అద్భుతాలను సృష్టిస్తున్నారు. ఆమె ఇప్పుడు టీ వ్యాపారంతో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. పాయల్ చాయ్‌కు భారత్‌లోనే కాదు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఆమె కంపెనీలో తయారు చేసే టీకి విదేశాల నుంచి కూడా ఆర్డర్లు వస్తుంటాయి.
అయితే ఈ వ్యాపారంలో రహస్యాన్ని అని తెలుసుకునే ముందు పాయల్ మిట్టల్ అగర్వాల్ ఎవరు…? ఏం చదువుకున్నారు..? ఆమె బిజినెస్ ఎలా మొదలు పెట్టారు…? ఆమె కుటుంబ నేపథ్యం ఎంటి.. ? అనేది ముందుగా తెలుసుకుందాం .
ఇప్పుడు కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్న పాయల్ మిట్టల్ అగర్వాల్.. బిజినెస్ మేనేజ్‌మెంట్(MBA) వంటి కోర్సులు చేయలేదు. అలా అని వ్యాపార సంస్థల్లో కూడా పని చేసిన అనుభవం కూడా పాయల్‌కు లేదు. కేవలం తన ఆలోచనను పెట్టుబడిగా పెట్టింది. ఓ ప్రణాళికా బద్దంగా పని చేసి తన లక్ష్యాన్ని చేరుకుంది. ఇప్పుడు ప్రజలు ఆమె చేస్తున్న వ్యాపారం గురించి చర్చిస్తున్నారు.
పాయల్ మిట్టల్ అగర్వాల్ సిలిగురి నివాసి అయినప్పటికీ.., ప్రస్తుతం హర్యానాలోని గురుగ్రామ్‌లో స్థిరపడింది. పాయల్ పాఠశాల స్థాయి నుంచి ఓ డ్రీమ్ ఉండేది.. సొంతగా ఓ వ్యాపారాన్ని చేయాలనే ఆలోచన ఒకటి ఉండేది. అయితే పాయల్ కుటుంబం సభ్యులు మాత్రం ఆమెను ఉన్నత చదువులు చదవించాలనే ఆలోచనను చేశారు .
పాయల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేయలేక పోయారు. ఇందుకు కారణం చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం. ఆ తర్వాత కూడా తాను వ్యాపారం చేయాలనే కలను అలానే కొనసాగించారు. ముందుగా ఓ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. అయినప్పటికీ అతను టార్గెట్‌ను పూర్తి చేయలేదు.
ఒకసారి తన కటుంబ సభ్యులతో కలిసి యూరప్ టూర్‌కు వెళ్లారు. ఆ సమయంలో చాయ్ బిజినెస్‌కు పునాది పడింది. డార్జిలింగ్ టీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిమాండ్‌ను పాయల్ గమనించారు. ఇదే తన వ్యాపారానికి మూలం అని అనుకున్నారు.
యూరప్‌లో చాయ్ అమ్ముతున్న ఓ భారతీయ మహిళను కలుసుకున్నారు. ఆ తరువాత పాయల్ కూడా టీ వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా భారతకు తిరిగి వచ్చిన వెంటనే ఆలోచనకు శ్రీకారం చుట్టారు. కేవలం 7 లక్షల రూపాయల పెట్టుబడితో పాయల్ ఈ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ వ్యాపారం నుంచి రెండు కోట్ల రూపాయలకుపైగా టర్నోవర్ చేస్తున్నారు.
ఇప్పుడు చాలా కంపెనీలకు పాయల్ చాయ్ ప్యాకింగ్ చేసి అందిస్తున్నారు. ఆన్ లైన్ ఆర్డర్ల ద్వారా తయారు చేసిన టీని విదేశాల్లోని కస్టమర్లకు కూడా పంపిస్తున్నారు. ఇంత డిమాండ్ ఎందుకంటే.. ఆమె వద్ద ఒకే రకమైన టీ లభించడం కాదు.. చాలా రకాల ప్రీమియం టీలను విక్రయిస్తున్నారు. అందులో సుమారు 100 కంటే ఎక్కువ రకాల టీలను లభించడమే ఇందుకు కారణం. ఇందులో గ్రే టీ, గ్రీన్ టీ, కహ్వా, జాస్మిన్ టీ, యాంటీ స్ట్రెస్ టీ, మసాలా టీ, డిటాక్స్ టీతో సహా చాలా రకాల టీలను అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రేపటి నుంచి 6,7,8 తరగతులు ప్రారంభం.. సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ