EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని చందాదారుల ఖాతాకు బదిలీ చేయడం ప్రారంభించింది. EPFO 8.50% చొప్పున PF పై వడ్డీని చెల్లించాలి. మీ PF ఖాతాలో ప్రభుత్వం నుండి దీపావళి బహుమతి వచ్చిందో లేదో కూడా మీరు మీ PF ఖాతాను తనిఖీ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మీ ఖాతాను తనిఖీ చేయడానికి మీరు ఈ 4 పద్ధతులను ఉపయోగించవచ్చు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
SMS ద్వారా..
మీ నమోదిత మొబైల్ నంబర్ నుండి 7738299899కి PF బ్యాలెన్స్ చెక్‌కి SMS ద్వారా EPFOHO UAN TEL అని టైప్ చేసి మెసేజ్ పంపించవచ్చు. ఇక్కడ TEL మీరు సమాచారాన్ని కోరుకునే భాషలో మొదటి మూడు అక్షరాలను నిర్దేశిస్తుంది. తెలుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ,తమిళం, మలయాళం అలాగే బెంగాలీ భాషల్లో కూడా మెసేజింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే, మీరు మెసేజ్ ద్వారా EPFO బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే, మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా UANతో నమోదు అయి ఉండాలి.
మిస్డ్ కాల్ ద్వారా..
మిస్డ్ కాల్ ద్వారా PF బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి, మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా UANతో రిజిస్టర్ అయి ఉండాలి. మీరు 011-22901406కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా మీ రిజిస్టర్డ్ మొబైల్ నుండి PF బ్యాలెన్స్‌ని తనిఖీ చేయవచ్చు. మిస్డ్ కాల్ ఇచ్చిన తర్వాత, మీ రిజిస్టర్డ్ నంబర్‌కు PF సందేశం వస్తుంది. దాని నుండి మీకు PF బ్యాలెన్స్ తెలుస్తుంది.
UMANG యాప్‌లో బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేయాలి
మీరు ఈ వెబ్‌సైట్‌లో కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు
ఇవి కూడా చదవండి: Google: గూగుల్ వినియోగదారులకు ఈ రూల్ తప్పనిసరి.. లేకుంటే లాగిన్ కావడం కష్టం!
Air Pollution: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నవారికి వాయుకాలుష్యంతో గుండె జబ్బుల ముప్పు ఎక్కువ!
JioPhone Next: జియో ఫోన్ నెక్స్ట్ బ్యాటరీ గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?