Financial Planning: కష్టాలు చెప్పి రావు.. మరి వాటిని ఎదుర్కోవాలంటే డబ్బు ఎలా వస్తుంది? ఇలా చేయండి!

|

Oct 13, 2023 | 9:37 PM

అతను తనయ 26 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరాడు.. రెండేళ్లకు అంటే 28 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకున్నాడు. 30 ఏళ్లు వచ్చేసరికి ఒక పాప. ఇప్పుడు అతనికి 35 ఏళ్లు. కొద్దిగా సేవింగ్స్ చేయగలిగాడు. అది కూడా ఈపీఎఫ్.. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంతే. కొంత సొమ్ము తన పాప పేరుమీద ఫిక్స్ డ్ లో వేశాడు. అంతకు మించి రూపాయి కూడా..

Financial Planning: కష్టాలు చెప్పి రావు.. మరి వాటిని ఎదుర్కోవాలంటే డబ్బు ఎలా వస్తుంది? ఇలా చేయండి!
Financial Planning
Follow us on

సాధారణంగా ఉద్యోగం చేస్తున్నపుడు వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారు తమ కోర్కెలు తీర్చుకోవడం కోసం ఖర్చు చేసేస్తారు. పెళ్ళయి.. పిల్లలు .. బాధ్యతలు పెరిగిన వారికి వారి బాధ్యతలు తీర్చుకోవడానికే వచ్చిన జీతం సరిపోని పరిస్థితి ఉంటుంది. రమేష్ అటువంటి కోవకు చెందిన వాడే. అతను తనయ 26 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరాడు.. రెండేళ్లకు అంటే 28 ఏళ్లు వచ్చేసరికి పెళ్లి చేసుకున్నాడు. 30 ఏళ్లు వచ్చేసరికి ఒక పాప. ఇప్పుడు అతనికి 35 ఏళ్లు. కొద్దిగా సేవింగ్స్ చేయగలిగాడు. అది కూడా ఈపీఎఫ్.. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ అంతే. కొంత సొమ్ము తన పాప పేరుమీద ఫిక్స్ డ్ లో వేశాడు. అంతకు మించి రూపాయి కూడా అతను జాగ్రత్త చేసుకునే పరిస్థితి లేకపోయింది. ఇటీవల ఆర్థిక మాంద్యం మొదలైంది. రమేష్ ఉద్యోగం పోయింది. ఇప్పుడు అతను ఒక్కడే ఆ ఇంటిలో సంపాదించే వాడు. తండ్రి చనిపోయాడు. తల్లి ఉంది. మొత్తం నలుగురిని పోషించాల్సిన బాధ్యత అతనిది. అకస్మాత్తుగా ఉద్యోగం పోవడంతో కొత్త ఉద్యోగం వచ్చేవరకూ ఇంటి అద్దె మొదలు కుని పాప ఫీజు వరకూ ఎలా డబ్బు సమకూర్చుకోవాలో అర్ధం కాక టెన్షన్ పడుతున్నాడు.

ఇది రమేష్ ఒక్కడి కథే కాదు. చాలామంది ఇలానే అకస్మాత్తుగా వచ్చే ఉపద్రవాలతో ఇబ్బందుల్లో పడి.. టెన్షన్ పడుతుంటారు. కష్టాలు చెప్పిరావు. అందులోనూ ఆర్ధికపరమైన కష్టాలు. ఇటువంటి పరిస్థితిలో అత్యవసర నిధి.. అంటే ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకుని ఉంటే చాలావరకూ ఇబ్బందులు లేకుండా ఉండేవి రమేష్ కు . అనుకోకుండా వచ్చే కష్టాలను ఎదుర్కోవడానికి ఎమర్జెన్సీ ఫండ్ చాలా అవసరం. మీరు ఇప్పటికే బాధ్యతలతో ఉండి.. ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకుని ఉండకపోతే ఇప్పుడే ఆ పని చేయండి. అసలు ఆలస్యం చేయకండి.

ఎవరికైనా సరే ఫైనాన్షియల్ ప్లానింగ్ లో ఎమర్జెన్సీ ఫండ్ అనేది అతి ముఖ్యమైన భాగం అని చెప్పవచ్చు. అకస్మాత్తుగా ఉద్యోగం పోవడం.. లేదా చేస్తున్న వ్యాపారంలో ఒడిదుడుకులు రావడం వంటి పరిస్థితిలో ఎమర్జెన్సీ ఫండ్ ఉపయోగపడుతుంది. అది సరే.. ఎమర్జెన్సీ ఫండ్ ఎంత మొత్తం ఉండాలి? అని మీరు అడగవచ్చు. అదే చెప్పబోతున్నాము. దీనికోసం ఓ చిన్న లెక్క ఉంది. ఎమర్జెన్సీ ఫండ్ అనేది మీ ఆదాయం.. లైఫ్ స్టైల్.. మీ పై ఆధారపడిన కుటుంబ సభ్యులా సంఖ్య వారి అవసరాలకు అయ్యే ఖర్చులు.. మీకు ఉన్న అప్పులు.. ఈఎంఐ లు ఇటువంటి అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. కనీసం మీ మూడు నెలల జీతానికి సరిపడే అంతా ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలని నిపుణులు చెబుతారు. అయితే, మీ కుటుంబలో పిల్లలు.. పెద్ద వయస్సు వారు ఉన్నట్లయితే ఇది ఆరు నెలల జీతానికి సరిపడే అంత ఉండాలి. అలా ఉన్నపుడు మీరు విపత్కర పరిస్థితులు ఎదుర్కునే సమయంలో అనవసరంగా ఎక్కువ వడ్డీలకు అప్పులు చేసే పరిస్థితి రాదు

ఇవి కూడా చదవండి

ఎమర్జెన్సీ ఫండ్ ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది కూడా చాలామందికి వచ్చే అనుమానం. మీ జీతం నెలకు 40 వేలు అనుకుంటే కనీసం మూడు నెలల మొత్తం అంటే లక్షా ఇరవైవేల రూపాయలు ఎమర్జెన్సీ ఫండ్ గా ఉండాలి. దాని కోసం అంతా సొమ్ము ఒకేసారి పక్కన పెట్టడం కష్టమే. కానీ.. సరైన ప్రణాళిక.. ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే ఇది సాధ్యమే. దీని కోసం ప్రతి నెలా కొంత సొమ్ము సేవింగ్స్ లో ఉంచుకోవాలి. ఆ సొమ్మును తీసి వేసి మిగిలిన సొమ్ము మాత్రమే మీ జీతంగా పరిగణించాలి. మీరు అనుకున్న కార్పస్ పోగయ్యే వరకూ ఇలానే చేయాలి. దీనికోసం ఒక ప్రత్యేక బ్యాంక్ ఎకౌంట్ తీసుకోవడం మంచిది. ఇక మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. బయట ఫుడ్ తినే అలవాటు ఉంటే దానిని మానుకోవాలి. అలాగే అనవసరంగా షాపింగ్ చేయడం వంటి పనులు వెంటనే పక్కన పెట్టాలి.

ఇక ఎమర్జెన్సీ ఫండ్ ను ఎక్కడైనా ఇన్వెస్ట్ చేస్తే వడ్డీ వస్తుంది కదా.. లేదా లాభాలు వచ్చే విధంగా స్టాక్ మార్కెట్లో పెడితే మంచిది కదా అనే ఆలోచనలు చేయవద్దు. ఎప్పుడూ ఎమర్జెన్సీ ఫండ్ మీకు అందబాటులో ఉండేలా చూసుకోవాలి. సేవింగ్స్ ఎకౌంట్ లో ఉంచడం మంచిది. ఎమర్జెన్సీ ఫండ్ ను 15:15:70 నిష్పత్తిలో ఉండేలా సెట్ చసుకోవయచ్చు. అంటే 15 శాతం క్యాష్ రూపంలో.. 15 శాతం సేవింగ్స్ ఎకౌంట్ లో .. మిగిలిన 70 శాతం షార్ట్ టర్మ్ డిపాజిట్ లేదా లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. లేదంటే 6 లేదా సంవత్సర కాలానికి రికరింగ్ డిపాజిట్ ఎకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఎలా చేసినా సరే అత్యవసర పరిస్థితిలో డబ్బు చేతికి అందేలా ఉంచుకోవాలి.

అదీ విషయం. రమేష్ లా ఇబ్బందులు పడకూడదు అంటే మీరు కూడా ఎమర్జెన్సీ ఫండ్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నాలు ఇప్పుడే మొదలు పెట్టండి. భవిష్యత్ లో వచ్చే కష్టాలు ఎదుర్కోవాలంటే ఇప్పడు పొదుపు చేయడం చాలా అవసరం ఏమంటారు?