Elon Musk: అనేక అడ్డంకులను దాటుకుంటూ.. ప్రపంచ కుబేరుడు ట్విట్టర్(Twitter) ను సొంతం చేసుకున్నరు. పరిస్థితులు చూస్తుంటే.. ఇప్పుడు ఆ సక్సెస్‌ను మాత్రం మస్క్ ఎంజాయ్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది. ట్విట్టర్ పై మోజుతో అవసరానికి మించి పెట్టుబడి పెట్టిన మస్క్.. నిధుల సమీకరణ కోసం టెస్లా షేర్లను అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడింది. మస్క్ ట్విట్టర్ చేజిక్కించుకున్న వార్తలు బయటకు రాగానే టెస్లా షేర్లు దారుణంగా పతనమయ్యాయి. మరోవైపు ట్విట్టర్‌కు డబ్బు చెల్లించాల్సిన సమయం దగ్గరపడడంతో భారీ నష్టాలకే తన టెస్లా వాటాలను(Tesla Shares) అమ్ముకోవాల్సి వచ్చింది. ఇలాంటి తలనొప్పులు ఎదుర్కొంటున్న సమయంలోనే చైనా కూడా గట్టి షాక్ ఇచ్చింది.
పెట్టుబడులకు స్వర్గధామం అయిన చైనాలో ఎలాన్ మస్క్ కూడా టెస్లా కోసం భారీగానే ఇన్వెస్ట్ చేశారు. తన టెస్లా కార్ల తయారీ యూనిట్ ను అక్కడ స్థాపించారు. చైనాలో భారీ పెట్టుబడిలో ప్రారంభించిన యూనిట్ లో వరుస సమస్యలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ కారణంగా ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటోంది. సప్లై చెైన్ సమస్యల కారణంగా షాంఘైలోని టెస్లా గిగా ఫ్యాక్టరీ మరోసారి మూతపడింది. నెల రోజుల వ్యవధిలో టెస్లా ఫ్యాక్టరీ రెండవ సారి మూతపడడంతో మస్క్ కొత్త తలనొప్పులను ఎదుర్కొంటున్నారు. అతి పెద్ద ఆసియా మార్కెట్లను టార్గెట్ చేస్తూ చైనాలో వ్యూహాత్మకంగా చేసిన పెట్టుబడి ఇప్పుడు ఇబ్బందులను తెచ్చి పెట్టింది. బిలియన్ డాలర్లు వెచ్చింది టెస్లా గిగా ఫ్యాక్టరీని స్థాపించాక చైనాలో పరిస్థితులు తారుమారయ్యాయి. భారత్ కూడా చైనా వస్తువులపై భారీగా టాక్స్ లు విధిస్తోంది. దీని వల్ల భారత్ లో లాభాలు చాలా తక్కువగానే ఉన్నాయి.
ఇప్పటికే మార్కెటింగ్ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న మస్క్‌ను కరోనా దారుణంగా నష్టాల పాలు చేసింది. షాంఘైలో డ్రాగన్ సర్కారు విధించిన లాక్‌డౌన్ చాలా కాలం పాటు కొనసాగడంతో టెస్లా భారీగా నష్టపోయింది. కరోనా కారణంగా అప్పట్లో ఈ గిగా ఫ్యాక్టరీ 22 రోజుల పాటు షట్‌డవున్ అయింది. షాంఘైలో పరిస్థితి కొంత మెరుగు అవడంతో 2022 ఏప్రిల్ 19 తిరిగి ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమైంది. లాక్ డౌన్ ఎత్తేసినా.. కరోనా కరాణంగా సప్లై వ్యవస్థ దెబ్బతినడంతో రామెటీరియల్స్ కొరత కారణంగా ఉత్పత్తి ఆగిపోయింది. ఇలా చాలం కాలం పాటు ఇబ్బంది పడ్డ గిగా ఫ్యాక్టరీ తిరిగి మళ్లీ తెరుచుకునే నాటికి చైనాలో మళ్లీ కరోనా విస్తరించింది. దీంతో గిగా ఫ్యాక్టరీని మరోసారి మూసేశారు. దీంతో మస్క్ కు మళ్లీ నష్టాలు తప్పడం లేదు. ఇలా ఎలాన్ మస్క్ ను వరుసగా సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
ఇవీ చదవండి..
Electric Scooters: ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలకు అదే కారణమవ్వొచ్చు.. నీతి ఆయోగ్ సంచలన వ్యాఖ్యలు..
Elon Musk: ట్రంప్‌పై ట్విట్టర్ బ్యాన్ ఎత్తేస్తా.. ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం..