
ఇప్పటికే చాలామంది ఐటీ ఉద్యోగులు ఏఐతో తమ జాబ్స్ పోతాయేమో అన్న భయంతో ఉన్నారు. ఇలాంటి సమయంలో మస్క్ ఓ షాకింగ్ కామెంట్ చేశారు. ఏఐతో ఉద్యోగాలన్నీ పోతాయని, అదే మనిషికి నిజమైన స్వేచ్ఛ అని ఆయన అంటున్నారు. దీంతో ఈ టాపిక్ నెట్టింట వైరల్ గా మారింది. అసలు మస్క్ మాటల వెనుక ఉన్న అర్థం ఏంటి? మస్క్ దృష్టిలో ఎఐతో మనిషికి స్వేచ్ఛ ఎలా వస్తుంది? ఆయన మాటల్లోనే చూద్దాం.
ఏఐ టూల్స్, ఏఐ రోబోట్స్ వల్ల ఇప్పుడున్న ఉద్యోగాలన్నీ పోవడం పక్కా అని మస్క్ అన్నారు. ఉద్యోగుల స్థానంలో ఏఐ, రోబోట్స్ వచ్చి చేరతాయని, ఆ తర్వాత మనుషులకు అసలైన స్వేచ్ఛ లభిస్తుందని ఆయన అన్నారు. ఏఐ వచ్చాక మనుషులు పని చేయడం అనేది వాలంటరీగా మారుతుందని తెలిపారు. కూరగాయలు సాగు చేయడం వంటివి హాబీలుగా చేసుకోవచ్చని ఆయన అన్నారు. అంతేకాకుండా ఏఐ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే.. దేశాల్లో సార్వత్రిక ఆదాయ విధానం అమల్లోకి వస్తుందని, జనాలు డబ్బు కోసం పని చేయాల్సిన అవసరం ఉండదని, తమకు నచ్చిన జీవైన శైలిని కొనసాగించొచ్చని ఆయన అన్నారు.
మస్క్ మాటలకు టెకీలు తెగ రియాక్ట్ అవుతున్నారు. ఇది కరెక్ట్ అని కొందరు అంటుంటే ఇది జరిగే పని కాదంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఏఐ ఎఫెక్ట్ ఇప్పటికే సాఫ్ట్‌వేర్ రంగంపై కనిపిస్తోంది. ఏఐ టూల్స్ వచ్చాక అనేక సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెజాన్ వంటి సంస్థలు మరో రెండేళ్లలో వర్కర్ల స్థానంలో ఏఐ, రోబోలను నియమించుకోవాలని చూస్తున్నాయి. ఏఐలో కూడా మరింత అడ్వాన్స్‌డ్ ఆటోమేటెడ్ టెక్నాలజీలు వస్తున్నాయి. దీంతో ఉద్యోగుల్లో కొంత టెన్షన్ వాతావరణం అయితే ఉంది. దీనికి తోడు మస్క్ చేసిన కామెంట్స్ ఈ టెన్షన్ ను మరింత పెంచేవిగా ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి