
వెనిజులా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితుల క్రమంలో ఎలాన్ మాస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వెనిజులాలో స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చంటూ సంచలన ప్రకటన చేశారు. దీంతో వెనిజులా ప్రజలు స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. వెనిజులాలో సంక్షోభం నెలకొన్న క్రమంలో ఎలాన్ మాస్క్ ఈ ప్రకటన చేసి సంచలనం సృష్టించారు. వెనిజులాపై అమెరికా సైనిక చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే. అంతేకాకుండా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్ట్ కూడా చేశారు. ఈ పరిణామం జరిగిన కొన్ని గంటల్లోనే ఎలాన్ మాస్క్ చేసిన ప్రకటన చర్చనీయాశంగా మారింది.
ఫిబ్రవరి 3వ తేదీ వరకు స్టార్ లింక్ సేవలు వెనిజులా ప్రజలు ఉచితంగా ఉపయోగించుకోవచ్చని ఎలాన్ మాస్క్ ప్రకటించారు. దేశంలో సంక్షోభ పరిస్థితులు ఏర్పడిన క్రమంలో ప్రజలకు కనెక్టివిటీని పెంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వెనిజులా ప్రజలకు సపోర్ట్‌గా ఈ డెసిషన్ తీసుకున్నట్లు చెప్పారు. సంక్షోభం క్రమంలో ఇంటర్నెట్ కనెక్టివిటీకి అంతరాయం ఏర్పడే అవకాశముంది. ఈ తరుణంలో ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు స్టార్ లింక్ సేవలు ఉపయోగపడనున్నాయి. మారుమూల గ్రామాల్లో మొబైల్ టవర్లు పనిచేయనప్పుడు స్టార్ లింక్ సేవలు ఉపయోగించుకోవచ్చు.