Investment Tips: పెట్టుబడులపై ఎన్నికల ఎఫెక్ట్.. ఆ ఒక్క చర్యతో పెట్టుబడులు సేఫ్

ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది క్లారిటీతో అంచనా వేయలేం. అప్పటి వరకు ఏం చేయాలో స్టాక్ మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. పోర్ట్‌ఫోలియో నిర్మాణంతో పాటు ఆస్తుల కేటాయింపులో అనుభవం ఉన్న వారు పెట్టుబడిదారులు ఇలాంటి పరిస్థితుల్లో విభిన్న రంగాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు.

Investment Tips: పెట్టుబడులపై ఎన్నికల ఎఫెక్ట్.. ఆ ఒక్క చర్యతో పెట్టుబడులు సేఫ్
Stock Market

Updated on: Jun 03, 2024 | 11:45 AM

భారతదేశంలో ప్రస్తుతం ఎన్నికల ఫీవర్ తారాస్థాయిలో ఉంది. జూన్ 4న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడికానుండగా అంతకు ముందు మార్కెట్‌ వరుసగా పతనమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అందరూ రకరకాలుగా ఊహాగానాలు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత మార్కెట్ పెరుగుతుందా? తగ్గుతుందా? అనేది క్లారిటీతో అంచనా వేయలేం. అప్పటి వరకు ఏం చేయాలో స్టాక్ మార్కెట్ నిపుణులు ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు. పోర్ట్‌ఫోలియో నిర్మాణంతో పాటు ఆస్తుల కేటాయింపులో అనుభవం ఉన్న వారు పెట్టుబడిదారులు ఇలాంటి పరిస్థితుల్లో విభిన్న రంగాలపై దృష్టి పెట్టాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నేపథ్యంలో మన పెట్టుబడులపై పెద్దగా ఎఫెక్ట్ పడకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలో? ఓసారి తెలుసుకుందాం.

ముఖ్యంగా పెట్టుబడుల్లో తయారీ, ఆర్థిక, మెటల్ రంగాలు మంచి ఎంపికలు కాగలవని సూచిస్తున్నారు. వచ్చే పదేళ్లలో మెటల్ వినియోగం గత యాభై ఏళ్లలో లేని స్థాయికి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. అదనంగా పీఎస్‌యూ బ్యాంకులు మంచి పెట్టుబడులు పెడుతున్నాయని ఆయన చెప్పారు. పెట్టుబడి అవకాశాల పరంగా ప్రైవేట్ బ్యాంకు కంటే మంచి పీఎస్‌యూ బ్యాంకు చాలా మెరుగైనదని పేర్కొన్నారు. ఫలితాల తర్వాత మార్కెట్‌లో 5-10 శాతం ర్యాలీని చూడవచ్చని, అయితే స్వల్ప ప్రమాదాన్ని గమనించాలని సూచిస్తున్నారు. బీజేపీ భారీ మెజారిటీతో వచ్చినా లేదా మెజారిటీకి తగ్గితే మార్కెట్‌లో ఆశ్చర్యం కలుగుతుందని పేర్కొన్నారు. మార్కెట్లో హెచ్చుతగ్గులకు పాలసీల కొనసాగింపు చాలా ముఖ్యం.

బీజేపీ భారీ మెజారిటీతో వస్తే ఇప్పుడున్న విధానాల్లో ఎంత పెద్ద మార్పు వస్తుందోనని ఇన్వెస్టర్లు అయోమయంలో పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. భారత మార్కెట్లో ఇప్పటికీ చాలా చైతన్యం ఉందని, రాబోయే ఐదేళ్లలో పరిస్థితి మరింత దిగజారాలంటే, ఇది జరగడానికి అనేక విషయాలు తప్పుగా మారాల్సి ఉంటుందని అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి