Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల ప్రభావం సామాన్యుడిపై.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..!

|

Feb 27, 2022 | 5:46 PM

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల ప్రభావం భారత్‌కు పడుతోంది. దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సన్‌ప్లవర్‌..

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యా యుద్ధాల ప్రభావం సామాన్యుడిపై.. భారీగా పెరిగిన వంట నూనె ధరలు..!
Follow us on

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌-రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాల ప్రభావం భారత్‌కు పడుతోంది. దేశీయంగా కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా సన్‌ప్లవర్‌ నూనె (Sunflower Oil) గత సంవత్సరం మన దేశం (India) 1.89 మిలియన్‌ టన్నుల నూనెను దిగుమతి చేసుకుంది. అందులో 70 శాతం ఉక్రెయిన్‌ (Ukraine), 20 శాతం రష్యా (Russia) నుంచి వచ్చింది. మరో 10 శాతం ఆర్జెంటీనా (Argentina) నుంచి దిగుమతి చేసుకుంది భారత్‌. నెలకు 2 నుంచి 3 లక్షల టన్నుల ఈ సన్‌ప్లవర్‌ నూనె దిగుమతి చేసుకుంటోంది. ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌ నుంచి సరఫరా నిలిచిపోయింది. దీంతో పొద్దుతిరుగుడు నూనె ధర పెరిగింది. ఇలాగే దేశాల మధ్య యుద్ధాలు కొనసాగితే భారత్‌పై మరింత ప్రభావం ఉండే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇక తాజాగా ప్రజలకు మరో భారం పడింది. వంట నూనె ధరలు పెరిగాయి. ట్రేడ్‌ నిపుణుల ప్రకారం.. రానున్న రోజుల్లో వంట నూనె ధర మరింతగా పెరిగే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వెంటనే ట్రేడర్లు ధరలు పెంచేసినట్లు తెలుస్తోంది. ట్రేడర్లు కృత్రిమ కొరత సృష్టించారని కొనుగోలుదారులు ఆరోపిస్తున్నారు.

అయితే రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు రాకముందు పామ్‌ ఆయిల్‌ ధర లీటర్‌కు రూ.135 ఉండేది, ఇప్పుడు రూ.142కు చేరుకున్నట్లు, ఇక సన్‌ప్లవర్‌ ఆయిల్‌ ధర ఇంతకు ముందు రూ.142 ఉండగా, యుద్ధ పరిస్థితుల తర్వాత రూ.165కు చేరుకున్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. మరోవైపు మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించడం లేదని, హోల్‌ సెల్‌ మార్కెట్‌కు కంపెనీలు సరఫరా తగ్గించాయని ట్రేడర్లు చెబుతున్నారు. ఉక్రెయిన్‌-రష్యా వార్‌ నెలకొన్నప్పటి నుంచి వంట నూనె ధరలను కంపెనీలు 8 శాతం వరకు పెంచాయని హోల్‌ సెల్‌ డీలర్లు చెబుతున్నారు. ఇదే సమయంలో కంపెనీల సరఫరా కూడా తగ్గాయని పేర్కొంటున్నారు. దీంతో ఆయిల్ కొరత ఏర్పడటంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Russias Military: రష్యా సైనికుల వాహనాలపై జెడ్‌ (Z) అనే అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా..?

Mars: అంగారకుడిపై పువ్వులా కనిపించే రాయిని కనుగొన్న క్యురియాసిటీ రోవర్‌.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు