
మన్నికను తెలుసుకునే క్రమంలో ఏథర్ ఎక్స్ ను అనేక విధాలుగా పరీక్ష చేశారు. దీనిలో భాగంగా పై నుంచి నీటిని స్కూటర్ పై పోశారు. పూర్తిగా తడిసిపోయినప్పటికీ సాధారణంగానే స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత ఇసుక, తారు నేలపై స్కూటర్లను దొర్లించారు. దాని వల్ల స్వల్పంగా గీతలు పడినా బండి పనితీరులో మార్పులేదు. అనంతరం ఆ యూట్యూబర్ తన స్నేహితులతో కలిసి స్కూటర్ వెనుక చక్రాన్ని బలంగా నేలకేసి కొట్టాడు. స్కూటర్ సస్పెన్షన్ ను పరీక్షించేందుకు ఇలా చేశాడు. అప్పుడు కూడా సస్పెన్షన్ కు ఎలాంటి నష్టం కలగలేదు.
పరీక్షల స్థాయిని పెంచే క్రమంలో భాగంగా టయెటా ఎటియోస్ ను ఏథర్ 450ఎక్స్ తో లాగారు. చాలా సులభంగా ఆ పని జరిగింది. అనంతరం కారుతో స్కూటర్ ను బలంగా ఢీకొట్టగా అద్దం విరిగిపోయింది. మరో వైపు కారుకు డెంట్లు, పగుళ్ల ఏర్పడ్డాయి. అనంతరం క్రేస్ సాయంతో 15 అడుగుల నుంచి స్కూటర్ ను నేల పైకి పడేశారు. అయినా చాలా తక్కువ నష్టంతో బయటపడింది. దీంతో మరోసారి 40 అడుగుల ఎత్తు నుంచి కిందకు వదిలారు. ఈ సారి స్కూటర్ కు కొంచెం డామేజ్ అయినా రన్నింగ్ విషయంలో మాత్రం ఇబ్బంది లేదు. ఏథర్ 450 ఎక్స్ మన్నికను ఈ పరీక్షలు నిరూపించాయి. ఎలాంటి సమయంలోనైనా వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తుందని తెలిసింది. వానలో తడిచినా, రోడ్డుపై వెళుతూ జారిపడినా, ఎత్తయిన ప్రాంతం నుంచి కొందకు దొర్లినా ఈ స్కూటర్ పనిచేస్తూనే ఉంటుందని రుజువైంది.
అప్‌డేటెడ్ ఫీచర్లతో ఏథర్ ఎనర్జీ 450 ఎక్స్ 2025 మార్కెట్ లోకి విడుదలైంది. 2.9 కేడబ్ల్యూహెచ్, 3.7 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ లలో అందుబాటులోకి వచ్చింది. ధరలు వరుసగా రూ.1.47 లక్షలు, రూ.1.57 లక్షలుగా ఉన్నాయి. పాత వేరియంట్ తో పోల్చితే స్వల్పంగా ధర పెరిగింది. 2.9 కేడబ్ల్యూహెచ్ వేరియంట్ రేంజ్ 85 నుంచి 105 కిలోమీటర్లకు, 3.7 కేడబ్ల్యూహెచ్ రేంజ్ 105 నుంచి 130 కిలోమీటర్లకు పెరిగింది. వీటి బ్యాటరీలను మూడు గంటల్లో సున్నా నుంచి 80 శాతం వరకూ చార్జింగ్ చేసుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి