AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

2024 KTM 250 Duke: యువతకు పిచ్చెక్కిస్తున్న డ్యూక్.. నయా మోడల్ ధర ఎంతంటే..?

దేశంలో ద్విచక్ర వాహనాలకు డిమాండ్ బాగా పెరుగుతోంది. దాదాపు ప్రతి ఒక్కరికీ ఇవి కనీస అవసరంగా మారాయి. గతంలో కుటుంబానికి ఒక్క బైక్ ఉంటే సరిపోయేది. కానీ ఇప్పడు ఆ పరిస్థితి మారింది. మహిళలు కూాడా ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తుండడంతో వారికీ వాహనం అవసరమైంది. ఇక కాలేజీలకు వెళ్లే పిల్లలకూ బైక్ తప్పనిసరి అయ్యింది. ఈ నేపథ్యంలో అనేక కొత్త రకాల ద్విచక్ర వాహనాలు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. ఇప్పుడు కేటీఎం కంపెనీ నుంచి 2024 మోడల్ 250 డ్యూక్ ను విడుదల అయ్యింది.

2024 KTM 250 Duke: యువతకు పిచ్చెక్కిస్తున్న డ్యూక్.. నయా మోడల్ ధర ఎంతంటే..?
Ktm 250 Duke
Nikhil
|

Updated on: Oct 21, 2024 | 3:02 PM

Share

యువతకు ఆకట్టుకునేలా స్పోర్టివ్ లుక్ తో అదిరే స్లైల్ తో రూపొందించిన మోడల్ 250 డ్యూక్ బైక్‌లో అనేక ప్రత్యేకతలు ఉన్నాయి.  ఆస్ట్రియన్ మోటారు సైకిల్ కంపెనీ అయిన కేటీఎం మన దేశంలోని ద్విచక్ర వాహనాల మార్కెట్ లో ప్రత్యేక స్థానం సంపాదించుకోవడానికి ప్రణాళికలు రూపొందిస్తోంది. దీని నుంచి విడుదలైన వాహనాలకు యువత ఆదరణ బాగా లభించింది. దీంతో ప్రీమియం మోాటార్ సైకిల్ విభాగంలో సత్తా చాటడానికి చర్యలు చేపట్టింది. కొత్తగా విడుదల చేసిన 2024 కేటీఎం 250 డ్యూక్ ఈ జోరును కొనసాగిస్తుందని భావిస్తున్నారు. దీనిలో అనేక ఫంక్షనల్, విజువల్ అప్ డేట్ లు చేశారు. మన దేశంలో ఈ బైక్ రూ.2.41 లక్షలకు (ఎక్స్ షోరూమ్)  అందుబాటులో ఉంది.

కొత్త కేటీఎం 250 డ్యూక్ మోటారు సైకిల్ అప్ డేట్ ప్రొఫైల్ తో అందుబాటులోకి వచ్చింది. బూమరాంగ్ ఆకారంలో ఉండే ఎల్ ఈడీ డే టైమ్ రన్నింగ్ లైట్లు, స్పోర్టియర్ లుక్ తో స్లైలిష్ గా తయారు చేశారు. అలాగే అట్లాంటిక్ బ్లూ, ఎలక్ట్రానిక్ ఆరెంజ్, సిరామిక్ వైట్ అనే మూడు రకాల రంగులతో ఆకట్టుకుంటోంది. 250 డ్యూక్ మోటారు సైకిల్ లోని కొత్త ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఎంతో ఆకట్టుకుంటోంది. దీనిలో 5.0 అంగుళాల ఫుల్ కలర్ టీెెఎఫ్ టీ డిస్ ప్లే ఏర్పాటు చేశారు. స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నావిగేషన్, హెడ్ సెట్ కనెక్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. కేటీఎం కనెక్ట్ యాప్ ద్వారా హెడ్ సెట్ ను ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ కు జత చేసుకోవచ్చు. స్విచ్ గేర్ ను కొత్తగా అప్ డేట్ చేశారు. కొత్త ఫోర్ వే మెనూ స్విచ్ లేఅవుట్ తో తీసుకువచ్చారు. ఇది రైడర్ టీఎఫ్ టీ స్క్రీన్ లోని వివిధ నియంత్రణలను యాక్సెస్ చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇతర భాగాల మాదిరిగానే ఈ స్విచ్ గేర్ ను కూడా డ్యూక్ 390 నుంచి తీసుకున్నారు.

స్ట్రీట్, ట్రాక్ అనే రెండు రకాల రైడ్ మోడ్ లతో 250 డ్యూక్ మోటారు సైకిల్ అందుబాటులోకి వచ్చింది. టీఎఫ్ టీ స్క్రీన్ ద్వారా రైడర్ ఈ మోడ్ లను సులువుగా మార్పు చేసుకోవచ్చు. ట్రాక్ మోడ్ లో టీఎఫ్ టీ స్క్రీన్ గ్రాఫిక్స్ మరింత బాగా పనిచేస్తాయి. ఎన్ లార్జ్డ్ రెవ్ కౌంటర్, ల్యాప్ టైమర్, ప్రిఫర్డ్ రైడర్ ఎయిడ్ సెట్టింగులు కనిపిస్తాయి.  కేటీఎం 250 డ్యూక్ బైక్ లో పాత మోడల్ మాదిరిగానే 248 సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఏర్పాటు చేశారు. దీని నుంచి 9250 ఆర్పీఎం వద్ద 30 బీహెచ్ పీ గరిష్ట శక్తిని, 7250 ఆర్పీఎం వద్ద 25 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ కు 6 స్పీడ్ గేర్ బాక్స్ జత చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..