ELSS Funds: లక్ష పెట్టుబడితో కోటి రూపాయలు.. అద్భుతం చేసిన హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్‌

కోటీశ్వరులు కావాలన్న కల అందరిలో ఉంటుంది. కానీ అందుకు తగినట్లుగా మార్గాలను ఎంచుకున్నప్పుడే ఆ స్థాయికి చేరుకుంటాము. త్వరగా డబ్బు సంపాదించాలంటే ఎన్నో మార్గాలు ఉన్నాయి. వివిధ రకాలలో ఇన్వెస్ట్‌మెంట్‌ చేయడం ద్వారా మంచి రాబడిని సంపాదించుకోవచ్చు. కానీ మంచి అవగాహన ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది..

ELSS Funds: లక్ష పెట్టుబడితో కోటి రూపాయలు.. అద్భుతం చేసిన హెచ్‌డీఎఫ్‌సీ స్కీమ్‌
Follow us
Subhash Goud

|

Updated on: Oct 21, 2024 | 3:20 PM

కోటీశ్వరులు కావాలనే ఆశ అందరిలో ఉంటుంది. కానీ కొందరికి నెరవేరుతుంది.. కొందరికి నెరవేరదు. కోటీశ్వరులు కావాలనే మార్గాన్ని ఎంచుకుంటే సక్సెస్‌ అవుతారన్నది నిపుణులు చెబుతున్న మాట. కొందరు అందుకు తగినట్లుగా ఇన్వెస్ట్‌మెంట్‌ చేస్తుంటారు. అలా ఈ రెండు ఈఎల్ఎస్ఎస్ లేదా ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్‌ లో ఇన్వెస్ట్ చేసిన వారు కోటీశ్వరులు అయ్యారు. ఈ రెండు స్కీమ్‌లు రూ.1 లక్ష లంప్‌సమ్ పెట్టుబడిని ఏకంగా కోటి రూపాయలు చేశాయి. ఒక్కసారి లక్ష రూపాయలు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన వారికి కోటి రూపాయలు అందించాయి. మరి ఈ రెండు పథకాల గురించి తెలుసుకుందాం.

హెచ్‌డీఎఫ్‌సీ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ అద్భుతం చేసింది. రూ.1 లక్ష లంప్‌సమ్ పెట్టుబడిని ఏకంగా రూ.1.05 కోట్లు చేసింది. లంప్సమ్ అంటే మీ మొత్తం పెట్టుబడి మొత్తాన్ని ఒకేసారి డిపాజిట్ చేయడం. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడానికి ఏకమొత్తం పెట్టుబడి ఒక ప్రసిద్ధ మార్గం. సాధారణంగా లంప్సమ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఒక కార్పస్ డబ్బు ఉన్న వ్యక్తులు ఒకేసారి పెట్టుబడి పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: Indian Passport Holders: శుభవార్త.. ఈ 45 దేశాల్లోని భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం!

ఈ మొత్తానికి చేరాలంటే 25 ఏళ్ల సమయం పట్టింది. ఈ స్కీమ్‌ అందుబాటులోకి వచ్చి 25 ఏళ్లు గడుస్తోంది. ఈ సమయంలో 20.45 శాతం CAGR కలిగి ఉంది. ఆ తర్వాత ఫ్రాంక్లిన్ ఇండియా ఈఎల్ఎస్ఎస్  తం అదరగొట్టింది. 25 సంవత్సరాల కిందట ఈ స్కీమ్‌లో లక్ష రూపాయలు పెట్టినట్లయితే ఇప్పుడు దాని విలువ రూ. 1 కోటి అవుతుంది. ఈ సమయంలో ఈ ఫండ్ సీఏజీఆర్ 20.22 శాతంగా ఉంది.

మరో ఐదు పథకాలు

మరో 5 పథకాలు సైతం మార్కెట్‌లోకి వచ్చిన 25 ఏళ్లు పూర్తవుతున్నాయి. ఈ పథకాల్లో ఒకేసారి రూ.10.54 లక్షలు ఇన్వెస్ట్‌మెంట్‌ చేసిన వారు ఇప్పుడు రూ.65 లక్షలు అందుకున్నారు. ఈ పథకాలు సీఏజీఆర్ 9.87 శాతం నుంచి 18.11 శాతం మధ్య ఉంది. అందులో అత్యంత పాత స్కీమ్‌ అయిన ఎస్‌బీఐ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ స్కీమ్ రూ. 1 లక్ష పెట్టుబడిని 25 ఏళ్లలో 17.06 శాతం రిటర్న్స్‌తో రూ. 51.39 లక్షలు అయ్యింది.

సుందరమ్ ఈఎల్ఎస్ఎస్

ఇక సుందరమ్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ రూ.లక్ష లంప్‌సమ్ పెట్టుబడిని 25 ఏళ్లలో రూ. 42.97 లక్షలు చేసింది. ఈ స్కీమ్ సీఏజీఆర్ 16.22 శాతంగా ఉంది. ఈ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా పన్ను మినహాయింపులు కూడా పొందే అవకాశం ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే ఇది పాత పన్ను విధానం ఎంచుకున్న వారికి మాత్రమే వర్తిస్తుందని గుర్తించుకోండి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!