Aadhar card: ఆధార్ కార్డులో మార్పులకూ నిబంధనలున్నాయి.. పేరు మార్చుకోవాలంటే అవి మస్ట్..!

దేశంలోని ప్రజలందరికీ ఆధార్ కార్డు అత్యంత అవసరం. ఒక రకంగా పౌరులందరికీ గుర్తింపు అని చెప్పవచ్చు. నిత్యం నిర్వహించే ప్రతి పనికీ ఇది అవసరమవుతుంది. ముఖ్యంగా ప్రభుత్వం పథకాలను పొందటానికి చాలా అవసరం. ఆస్తి, వాహనాలు, వస్తువులను కొనాలన్నా, విక్రయించాలన్నా ఆధార్ కార్డు లేకపోతే కుదరదు. పిల్లల నుంచి పెద్దల వరకూ 12 అంకెలతో కూడిన కార్డును ప్రభుత్వం మంజూరు చేస్తోంది. దీనిలో పేరు, చిరునామా, వయసు, ఫోన్ నంబర్ తదితర వివరాలు ఉంటాయి. ఆ వివరాలు సక్రమంగా లేకపోతే ఇబ్బందులు కలుగుతాయి. కాబట్టి వాటిని సక్రమంగా ఉండేలా చూసుకోవాలి. దోషాలు ఉంటే సరిచేసుకోవాలి. అయితే ఆధార్ కార్డులో మార్పులకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి.

Aadhar card: ఆధార్ కార్డులో మార్పులకూ నిబంధనలున్నాయి.. పేరు మార్చుకోవాలంటే అవి మస్ట్..!
Aadhaar
Follow us
Srinu

|

Updated on: Oct 21, 2024 | 2:42 PM

యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) ద్వారా ఆధార్ కార్డు జారీ అవుతుంది. బయో మెట్రిక్, డెమో గ్రాఫిక్ డేటా ఆధారంగా దాన్ని రూపొందిస్తారు. ఆధార్ కార్డులో 12 అంకెల నంబర్ కేటాయిస్తారు. అదే మనకు గుర్తింపు గా ఉపయోపడుతుంది. అయితే ఉద్యోగాలు, వ్యాపారాలు, బతుకుదెరువు కోసం ప్రజలు ఒకచోట నుంచి మరోచోటుకు వలస వెళతారు. అప్పుడు ఆధార్ కార్డులో చిరునామా మార్చుకోవాల్సి ఉంటుంది.  ఈ మార్పులకు కూడా పలు నిబంధనలు వర్తిస్తాయి. ఆధార్ కార్డులో పేరును మార్పు చేసుకునే అవకాశం ఉంది. అది కూడా కేవలం రెండు సార్లు మాత్రమే చేసుకోవచ్చు. 

అసాధారణ సమయంలో ప్రత్యేక అభ్యర్థనపై యూఐడీఏఐ కార్యాలయం తదుపరి మార్పులను అనుమతిస్తుంది.  ఆధార్ కార్డులోని పేరులో స్పెల్లింగ్ దోషాలు, క్రమాన్ని మార్చడం, సంక్షిప్త రూపంలోకి మార్చడం, వివాహం తర్వాత పేరు మార్పులు తదితర వాటికి అవకాశం ఉంది. సాాధారణంగా ఆధార్ కార్డులో మార్పులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో చేసుకోవచ్చు. పేరు, పుట్టిన తేదీ, లింగం, బయో మెట్రిక్ (వేలి ముద్రలు, ఐరిష్), మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ వంటి వాటిని మార్చడానికి తప్పకుండా ఆధార్ కేంద్రాలకు వెళ్లాలి. కేవలం చిరునామాను మాత్రం తగిన ధ్రువీకరణ పత్రాలను అప్ లోడ్ చేసి  ఆన్ లైన్ లో మార్చుకునే అవకాశం ఉంది. 

ఇవి కూడా చదవండి

ఆధార్ కార్డులో పేరు మార్చాలంటే..

  • సమీపంలోని ఆధార్ నమోదు కేంద్రానికి వెళ్లండి
  • యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ నుంచి ఆధార్ ఎన్ రోల్ మెంట్, అప్ డేట్ ఫారం డౌన్ లోడ్ చేయండి. దానిలో వివరాలు నింపండి
  • కేంద్రంలో ఆపరేటర్ కు గుర్తింపు పత్రాలు అందించండి 
  • ఆధార్ కార్డులో పేరు మార్పునకు రూ.50 చార్జీ చెల్లించండి. 
  • మీరు యూఆర్ఎన్ (అప్ డేట్ రిక్వెస్ట్ నంబర్) నంబర్ అందుకుంటారు. దాని ద్వారా యూఐడీఏఐ ఆధార్  స్థితిని తనిఖీ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
ప్రధాని మోదీకి కువైట్‌ అత్యున్నత పురస్కారం!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
శ్మశానం దగ్గర పసివాడి ఏడుపు శబ్దం.. దగ్గరికెళ్లి చూడగానే షాక్.!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
బిడ్డ కోసం మాతృ హృదయం తల్లడిల్లింది..!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
2024లో సీక్వెల్స్.. హిట్టా.? ఫట్టా.? ఆ ట్రెండ్ మారిందా.!
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
భారీగా తగ్గిన హీరోయిన్స్ రెమ్యునరేషన్.. కారణం అదేనా.? వీడియో
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.