Oil Prices: దేశంలో ఎన్నికల తర్వాత పెట్రో ధరల మంట.. గ్యాస్ కూడా పెరుగుతుందా ? దీనిపై సామాన్యుల స్పందన ఏంటి ?

|

Mar 04, 2022 | 6:48 AM

Oil Prices: రష్యా-ఉక్రెయిన్(Russia Ukraine Crises) యుద్ధం కారణంగా చములు ధరలు గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటోంది. ఈ వారంలోనే బ్యారెల్ క్రూడ్ ఆయిల్(Crude Prices) ధర 100 డాలర్ల మార్కును దాటాయి.

Oil Prices: దేశంలో ఎన్నికల తర్వాత పెట్రో ధరల మంట.. గ్యాస్ కూడా పెరుగుతుందా ? దీనిపై సామాన్యుల స్పందన ఏంటి ?
Crude Prices
Follow us on

Oil Prices: రష్యా-ఉక్రెయిన్(Russia Ukraine Crises) యుద్ధం కారణంగా చములు ధరలు గరిష్ఠ స్థాయిలకు చేరుకుంటోంది. ఈ వారంలోనే బ్యారెల్ క్రూడ్ ఆయిల్(Crude Prices) ధర 100 డాలర్ల మార్కును దాటాయి. దీనికి తోడు తాజాగా.. బ్యారెల్ ధర 104 డాలర్లకు చేరుకుంది. దీంతో పెట్రో ధరలు పెరుగుతున్నప్పటికీ.. దేశంలో మాత్రం అనేక కారణాల వల్ల అవి ప్రస్తుతం స్థిరంగానే కొనసాగుతున్నాయి. వచ్చే వారం నుంచి పెట్రోలు-డీజిల్ ధరలు పెరగడం ప్రారంభం కావచ్చు. ఎందుకంటే దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు మార్చి 7తో ముగుస్తాయి. దీంతో పెట్రోలియం ధరలు పెంచే అవకాశం ఉంది. ఎన్నికల నేపధ్యంలో చాలాకాలంగా పెట్రోలియం కంపెనీలు ధరల పెంపును ఆపాయి. అదేసమయంలో అంతర్జాతీయంగా ముడిచమురు అంటే క్రూడాయిల్ బ్యారెల్ ధర 100 డాలర్ల మార్కును దాటింది. ఇప్పుడు ఈ క్రూడాయిల్ ధరల పెరుగుదలతో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌పై రూ.5 70 పైసలు నష్టపోతున్నాయి.

మార్చి 7 తర్వాత ఇంధన ధరలు రోజువారీగా పెరగవచ్చని, సాధారణ మార్కెటింగ్ లాభం పొందడానికి చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరుకు 9 రూపాయల చొప్పున రిటైల్ ధరలను పెంచాల్సి ఉంటుందని జేపీ మోర్గాన్స్ సంస్థ అంచనా వేసింది. దేశంలో రోజువారీ చమురు ధరల మార్పు ఉండేది.. కానీ గడిచిన 118 రోజులుగా ఎంటువంటి మార్పు లేకపోవటం విశేషమని చెప్పుకోవాలి. 27 వేల మందితో నిర్వహించిన.. ఒక సర్వే ప్రకారం తెలుస్తున్న విషయం ఏమిటంటే దేశంలోని సామాన్యులపై పెట్రో ధరల భారం భారీగా పెరగనుందని. రాబోయే పెంపును తట్టుకోలేక దేశంలో 42 శాతం మంది తమ పెట్రో, డీజిల్ అవసరాలపై వెచ్చించే మెుత్తాన్ని తగ్గించుకుంటారని తెలుస్తోంది.

దేశంలోని ప్రతి ఇద్దరిలో ఒక వ్యక్తి 2022 ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం తగ్గుతుందని భావిస్తున్నారని సర్వే చెబుతోంది. దేశంలో ఇప్పటికే సెంచరీకి దగ్గరగా ఉన్న చమురు ధరలు రూ.100 నుంచి 110 మధ్యకు చేరతాయన్న వార్తలు సామాన్యులను కలవరపెడుతున్నాయి. భారత్ తన 2022-23 బడ్జెట్ లో చమురు ధర యావరేజ్ గా 75 డాలర్ల వరకు ఉండవచ్చని అంచనా వేసింది. తానీ వాస్తవంగా ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. భారత ప్రభుత్వం ఇంధనంపై ఎక్కువగా వెచ్చించక తప్పదని తెలుస్తోంది. ఉక్రెయిన్ లోని పరిస్థితుల వల్ల గ్యాస్ పై ప్రభుత్వం అందిస్తున్న రాయితీ భారాన్ని ప్రభుత్వం భరిస్తుందా.. లేక దేశంలోని ప్రజలకే ఆ భారాన్ని ట్రాన్ఫర్ చేస్తుందా అనే విషయంపై రానున్న రోజుల్లో స్పష్టత రానుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా ధరలు త్వరలోనే పెరగనున్నట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం.. పెరిగిన వెండి ధరలు.. తాజా ధరల వివరాలు..!