AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నారా..? నో టెన్షన్.. ఆన్‌లైన్‌లో సెకన్లలోనే డూప్లికేట్ లైసెన్స్ పొందండిలా..

కొన్నిసార్లు డ్రైవింగ్ లైసెన్స్ పొగోట్టుకోవడం లేదా పాడైపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు లైసెన్స్ లేకుండా పట్టుబడితే పోలీసులు జరిమనా విధిస్తారు. అయితే ఆన్‌లైన్ ద్వారా మీరు సులువుగా డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అదే విధంగా అప్‌లైన్‌లో కూడా అప్లై చేసుకోవచ్చు.

Driving License: డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నారా..? నో టెన్షన్.. ఆన్‌లైన్‌లో సెకన్లలోనే డూప్లికేట్ లైసెన్స్ పొందండిలా..
Driving License
Venkatrao Lella
|

Updated on: Aug 30, 2026 | 8:50 AM

Share

మీరు రోడ్డుపైకి వెహికల్ తీసుకెళ్లి నడుపుతుంటే డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా మీ దగ్గర ఉంచుకోవాలి. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వెహికల్ నడపడం నేరంగా పరిగణిస్తారు. ట్రాఫిక్ పోలీసులు పట్టుకుంటే మీకు వెంటనే జరిమానా విధిస్తారు. మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడపకూడదు. నడిపితే దానిని నేరంగా పరిగణించి ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకుంటారు. సెక్షన్ 181 ప్రకారం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే జరిమానా విధిస్తారు. ప్రస్తుతం జరిమానా భారీగా పెంచారు. కొన్ని రాష్ట్రాల్లో రూ.5 వేల వరకు ఉంది. ఒకవేళ మీరు డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకుంటే టెన్షన్ పడనక్కర్లేదు. ఆన్‌లైన్‌లో సులువుగా డూప్లికేట్ లైసెన్స్ పొందవచ్చు. ఆ ప్రక్రియ ఎలా అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూద్దాం.

ఆన్‌లైన్‌లో డూప్లికేట్ లైసెన్స్ పొందటం ఎలా..?

-కేంద్ర ప్రభుత్వానికి చెందిన పరివాహన్ వెబ్‌సైట్‌ ఓపెన్ చేయండి

– డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్ ఎంచుకోండి

-అనంతరం మీ స్టేట్‌ను సెలక్ట్ చేసుకోండి

-ఆ తర్వాత డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఆప్షన్‌ను ఎంచుకోండి

– డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, పేరు, డేట్ ఆఫ్ బర్త్ లాంటి ఇతర వివరాలను నమోదు చేయండి

– గుర్తింపు రుజువు కోసం అవసరమైన పత్రాలను అప్ లోడ్ చేయండి

– మీ వద్ద పోగొట్టుకున్న లైసెన్స్ ఫోటోకాపీ లేదా వివరాలు ఉంటే వాటిని సిద్ధంగా ఉంచుకోండి

– డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోకాపీ ఉండే అప్‌లోడ్ చేయండి

-ఆన్‌లైన్‌లో రుసుం చెల్లించి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయండి

-డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్‌ను డౌన్ లోడ్ చేసుకోండి

ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

మీ పరిధిలోని ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లాలి. మీ గుర్తింపు, చిరునామా రుజువుతో పాటు అసలు లైసెన్స్ కాపీ వివరాలు అందించాలి. డూప్లికేట్ డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు ఫారం నింపాలి. అవసరమైన పత్రాలను సమర్పించి రుసుము చెల్లించాలి. ఆర్టీఓ అధికారులు పరిశీలించి డూప్లికేట్ లైసెన్స్ జారీ చేస్తారు. మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్ లేకపోయినా వాహనం నడపవచ్చు. పోలీసులు ఆపినప్పుడు డిజిలాకర్ లేదా ఎం పరివాహన్ యాప్ ద్వారా డ్రైవింగ్ లైసెన్స్ డిజిటల్ కాపీ చూపిస్తే సరిపోతుంది.

Follow Us