TVS IQube: ఈ ఆఫర్ ను అసలు వదులుకోకండి.. అత్యంత తక్కువ ధరకే టీవీఎస్ ఐక్యూబ్

|

Dec 24, 2024 | 4:15 PM

నూతన సంవత్సరం త్వరలో రాబోతోంది. కొత్త ఏడాదికి ఆత్మీయ స్వాగతం పలకడానికి ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త స్కూటర్ ను కొనుగోలు చేసి, ఆ ఆనందంతో న్యూ ఇయర్ సంబరాలు చేసుకోవాలనుకునే వారికి శుభవార్త ఇది. ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ తన ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పై బంపర్ ఆఫర్ ను ప్రకటించింది.

TVS IQube: ఈ ఆఫర్ ను అసలు వదులుకోకండి.. అత్యంత తక్కువ ధరకే టీవీఎస్ ఐక్యూబ్
Tvs Iqube E Scooter
Follow us on

ఫ్లిప్ కార్ట్ నుంచి రూ.85 వేలకే కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్ 20వ తేదీ మొదలైన ఈ ఆఫర్ 25 వరకూ మాత్రమే అందుబాటులో ఉంది. ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ భారీ తగ్గింపుతో ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులో ఉంది. దీని 2.2 కేడబ్ల్యూ వేరియంట్ ధర సాధారణంగా రూ.94,999 (ఎక్స్ షోరూమ్) కాగా, సంవత్సరం ముగింపు సందర్భంగా ఫ్లిప్ కార్ట్ లో రూ.85 వేలకు కొనుగోలు చేయవచ్చు. డిస్కౌంట్ కు ముందు ఫ్లిప్ కార్ట్ లో టీవీఎస్ ఐక్యూబ్ ను రూ.1,03,299కు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఫ్లిప్ కార్ట్ లోని జస్ట్ ఫర్ యు అనే ఆఫర్ తో స్కూటర్ ధర రూ.4 వేలు తగ్గింది. అలాగే రూ.20 వేల కంటే ఎక్కువ కొనుగోళ్లపై కార్ట్ కు రూ.12,300 తగ్గింపు లభిస్తుంది. అదనంగా ఫ్లిప్ కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డును ఉపయోగించి వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు మరో రూ.5,619 డిస్కౌంట్ ఇస్తారు. ఇవన్నీ కలుపుకొని చివరకు రూ.85,380కి సొంతం చేసుకోవచ్చు.

టీవీఎస్ ఐక్యూబ్ స్కూటర్ 2.2, 3.4 కేడబ్ల్యూహెచ్ అనే రెండు రకాల వేరియంట్లలో లభిస్తుంది. 2.2 వేరియంట్ బ్యాటరీ ని 2.45 గంటల్లో దాదాపు సున్నా నుంచి 80 శాతం చార్జింగ్ చేసుకోవచ్చు. ఒక్కసారి పూర్తిస్థాయి చార్జింగ్ తో దాదాపు 75 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది. దీనిలో 4.4 కేడబ్ల్యూ శక్తిని కలిగిన మోటారును ఏర్పాటు చేశారు. దాని నుంచి గరిష్టంగా 140 ఎన్ఎం వరకూ టార్క్ విడుదల అవుతుంది. గంటలకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం సాగించవచ్చు.

టీవీఎస్ స్కూటర్ లో ఐదు అంగుళాల కలర్ టీఎఫ్టీ స్క్రీన్, ఫ్రంట్ డిస్క్ బ్రేకులు, 30 లీటర్ అండర్ సీట్ స్టోరేజీ, వెహికల్ క్రాష్ వార్నింగ్, టర్న్ బై టర్న్ నావిగేషన్, పార్కు అసిస్ట్, యూఎస్ బీ చార్జింగ్ పోర్టు, రిమోట్ చార్జింగ్ స్టేటస్ తదితర ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే వాల్ నట్ బ్రౌన్, పెరల్ కలర్స్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చింది. ముందు 222 ఎంఎం డిస్క్, వెనుక 130 ఎంఎం డ్రమ్ బ్రేకుతో వాహనం వేగాన్ని చాలా సమర్థవంతంగా నియంత్రణ చేయవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గ్రౌండ్ క్లియరెన్స్ 157 మీమీ, ఎత్తు 770 మీ.మీగా ఉన్నాయి. ఈవీ విభాగంలో ఓలా ఎస్1, బజాజ్ చేతక్, ఏథర్ రిజ్టా తదితర స్కూటర్లకు టీవీఎస్ ఐక్యూబ్ గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి