మీ కారు నీటిలో మునిగిపోతే.. వర్షపు నీటిలో దెబ్బతింటే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందా..! తెలుసుకోండి..

|

Sep 02, 2021 | 4:46 PM

Car Insurance Rules: అప్పుడప్పుడు భారీ వర్షాలకు వరదనీటిలో కార్లు మునిగిపోతాయి. దీంతో కారు పూర్తిగా దెబ్బతింటుంది. అటువంటి సమయంలో బీమా కంపెనీ దాని కోసం

మీ కారు నీటిలో మునిగిపోతే.. వర్షపు నీటిలో దెబ్బతింటే ఇన్సూరెన్స్‌ వర్తిస్తుందా..! తెలుసుకోండి..
Car Rule
Follow us on

Car Insurance Rules: అప్పుడప్పుడు భారీ వర్షాలకు వరదనీటిలో కార్లు మునిగిపోతాయి. దీంతో కారు పూర్తిగా దెబ్బతింటుంది. అటువంటి సమయంలో బీమా కంపెనీ దాని కోసం క్లెయిమ్ ఇస్తుందా లేదా అనే ప్రశ్న అందరి మనసులో ఉంటుంది. అంతేకాదు వర్షం కారణంగా చాలాసార్లు పెద్ద పెద్ద చెట్లు కారుపై పడతాయి. ఈ పరిస్థితిలో కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ ప్రశ్న తలెత్తుతుంది. అయితే వర్షాకాలంలో కారు బ్రేక్‌డౌన్‌కు సంబంధించిన నియమాలు ఏమిటో ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

వర్షంలో కారు పాడైతే క్లెయిమ్ ఉంటుందా..?
వరదలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కంపెనీలు క్లెయిమ్‌లు ఇస్తుందని ఇన్సూరెన్స్ అధికారులు చెబుతున్నారు. అయితే కొన్ని షరతులు చెప్పారు. ‘మోటార్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు, మీ ఏజెంట్‌తో ఏది కవర్ అవుతుంది ఏది కవర్ కాదు అనే దాని గురించి స్పష్టంగా తెలుసుకోవాలన్నారు. ఇది కాకుండా మీరు అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా మరికొన్ని సేవలను పొందవచ్చని తెలిపారు.

పరిస్థితులు ఏమిటి?
‘కారు నీటిలో చిక్కుకుంటే మీరు చాలా విషయాలను గమనించాలి. వాహనం నీటిలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయకూడదు. ఇంజిన్ ఆఫ్ చేయాలి. ఇంజిన్‌లోకి నీరు వెళ్లినట్లయితే కారును నడపవద్దు. కానీ వాహనాన్ని బయటికి లాగడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా సమయ పరిమితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. దీనితో పాటు ఆ పరిస్థితిని ఫోటో లేదా వీడియో రికార్డింగ్ చేయడం అవసరం. ఇది కాకుండా ఇన్సూరెన్స్ కంపెనీ డిమాండ్ చేసిన పత్రాలను సిద్ధం చేయండి ఆ తర్వాత మీ క్లెయిమ్ కొన్ని షరతుల ఆధారంగా పాస్ చేస్తారు.

ఎలాంటి బీమా అవసరం?
మీరు మీ కారుకి సరైన ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్నప్పుడు మత్రమే క్లెయిమ్‌ సాధ్యమవుతుంది. సమగ్ర పాలసీతో వర్షాకాలంలో చెట్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడడం వల్ల వాహనానికి జరిగే నష్టానికి మీరు క్లెయిమ్ చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని సమగ్ర పాలసీలో మాత్రమే భర్తీ చేయవచ్చని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్‌లో ఇది కవర్‌ కాదని ఇన్సూరెన్స్‌ అధికారులు చెబుతున్నారు.

శ్రీకృష్ణాష్టమి వేడుకల్లో సందడి చేసిన తెలుగు రాష్ట్రాల చిన్నారులు.. ఆకట్టుకుంటున్న వీడియో:Krishnashtami celebrations Video.

Tirupati: ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంతా ఆయురారోగ్యా‌ల‌తో ఉండాలని బాలకాండ పారాయణం.. మార్మోగిన స‌ప్త‌గిరులు

Tenali: బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా గృహప్రవేశం.. తెల్లారి నిద్రలేచి చూసేసరికి మైండ్ బ్లాంక్