ఆధార్ కార్డ్ మన దేశంలోని ప్రతి వ్యక్తి గుర్తింపును తెలియజేస్తుంది. ఈ కార్డ్‌లో 12 అంకెలు చాలా ముఖ్యం. ఇందులో వ్యక్తి బయోమెట్రిక్, ఇతర పూర్తి వివరాలు ఉంటాయి. ఇందులో పేరు, చిరునామా, చేతుల వేలిముద్రలు, కళ్ల స్కానింగ్, ఛాయాచిత్రాలు వంటి ప్రధాన అంశాలు ఉంటాయి. ఆధార్ కార్డ్ డేటా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ద్వారా సురక్షితంగా ఉంచబడుతుంది.
మీరు ఆధార్ కార్డ్‌ని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్‌లైన్‌లో అప్‌డేట్ చేసినా, ఆధార్ నంబర్‌లో ఎటువంటి మార్పు ఉండదు. ఆధార్ కార్డ్ తయారు చేసే సమయంలో అందుకున్న ఆధార్ నంబర్, అప్‌డేట్ చేసిన తర్వాత కూడా అదే ఆధార్ నంబర్‌గా ఉంటుంది.
మీరు ఆధార్ కార్డ్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌ను మార్చకపోతే, మీ ఆధార్‌కి లింక్ చేసిన మొబైల్ నంబర్‌పై ఆధార్ నోటిఫికేషన్ వస్తుంది. మొబైల్ నంబర్ కూడా మార్చబడితే, మీ ఆధార్ కార్డ్ ఎక్కడ పంపిణీ చేయబడుతుందో ఇచ్చిన మొబైల్ నంబర్‌కు సమాచారం వస్తుంది.
రిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి